చిత్రం: నువ్వంటే నాకిష్టం (2005)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: కె. కె., చిత్ర
నటీనటులు: ఆర్యన్ రాజేష్ , అల్లరి నరేష్ , అను మెహతా
దర్శకత్వం: ఇ. వి.వి.సత్యన్నారాయణ
నిర్మాత: ఇ. వి.వి.సత్యన్నారాయణ
విడుదల తేది: 12.08.2005
సంభాషణలు:
వీరబాబు దేవుడెక్కడ
దేనికమ్మాయి గారు
వాడు చేసిన హెల్ప్ వల్ల నేను పరీక్ష బాగా రాశాను అది చెప్దామని
పంపు షెడ్ దగ్గర మోటర్ బాగుజే త్తన్నాడండి
అమ్మో... ఆంబోతు
దేవుడు... దేవుడు...
ఎంటమ్మాయి గారు ఏమైంది
దేవుడు ఆ ఆంబోతు నన్ను పొడవటానికి వస్తుంది
పట్టుకొని కట్టెయ్
దానిని పట్టుకోమంటే నవ్వుతావేమిటి నువ్వు
అదొస్తున్నది మిమ్మల్ని పొడవటానికి కాదు
అవుకోసం వచ్చింది చూడండి
అది మీ దత్తుడు మమయ్యగారి ఆంబోతు
అనికి కూడా ఆయన బుద్దులొచ్చినట్టున్నాయి
నీకు నవ్వులాట గానే ఉంటుంది ఆది నా వెనకాల వచ్చేసరికి నేనెంత హడలిపోయానో నీకు తెలుసా చూడు నా గుండెలు ఎలా కొట్టుకుంటున్నాయో
పల్లవి:
ఎందుకీ పరువమా ఈ పరుగులిప్పుడు
ఏమిటి అధరమా నీ అదురుడిప్పుడు
తెగ నచ్చాడన ఎద గిచ్చాడనా
మగతోడై మనసిచ్చాడనా
నీ గాలి తగిలితే మురళివా
ఏ కొత్తరాగమో కదలగా
ఈ రాధ గుండెలో కదలిక చెలరేగెనే సరిగమ
నీ పురుష మేఘమే ఉరమగా
నే పురులువిప్పగా నెమలిగా
నా మేను మెరుపులే మెరవగా
మొదలాయే మధురిమ
ఎందుకీ పరువమా ఈ పరుగులిప్పుడు
ఏమిటి అధరమా నీ అదురుడిప్పుడు
చరణం: 1
ఓ తేనె గోదారి నాలోన పొంగింది
నావేసె నా ఈడుకి
ఓ ఆకుల్లో సూరీడు సోకుల్ని తాకాడు
సూదంటు నా చూపుకే
నిన్నా మొన్నా ఎరుగనిదీ నేడే నాలో జరిగినదీ
ప్రేమే ఏమో ఏదో ఏమిటిదీ
చిరుగాలి సోకిన వణుకులో బిగి రైక చాటున ఇరుకులో
పదహారు వయసులో దరువులా చెలరేగెనే ప్రియతమా
ఎందుకీ పరువమా ఈ పరుగులిప్పుడు
ఏమిటి అధరమా నీ అదురుడిప్పుడు
చరణం: 2
ఈ పైరగాలుల్లో నీ పైట ఈలల్లో చలి ఊసులాడిందిలే
ఆ గూటి పడవల్లో నీ చాటు గొడవల్లో
చిరు గాజు చిక్కిందిలే
నీకు నాకు తెలియనిది నిన్ను నన్ను కలిపినది
ప్రేమేనేమో పేరే చెప్పనిది
నీ చేయి తాకితే పరవశం నీ పెదవి సోకితే మధురసం
నీ గాలి జన్మకే పరిమళం ఇది సుందరం సుమధురం
ఎందుకీ పరువమా ఈ పరుగులిప్పుడు
ఏమిటి అధరమా నీ అదురుడిప్పుడు