చిత్రం: ప్రేమ పావురాలు (1989)
సంగీతం: రామ్ లక్ష్మణ్
సాహిత్యం: రాజశ్రీ (All)
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: సల్మాన్ ఖాన్ , భాగ్యశ్రీ (ఇద్దరు తొలిపరిచయం)
దర్శకత్వం: సూరజ్ ఆర్. బరజాత్య
నిర్మాత: తారాచంద్ బరజాత్య
విడుదల తేది: 1989
మల్లికవా రంగవల్లివా వరాలు చిందే అక్షర కన్నెవా
నేవే పసిడి ప్రేమ గనివా
కావాలి ప్రశ్నలకే జవాబులు ఓ చెలి
మల్లికవా రంగవల్లివా వరాలు చిందే అక్షర కన్నెవా
నేవే పసిడి ప్రేమ గనివా
కావాలి ప్రశ్నలకే జవాబులు ఓ చెలి
మేఘాల వీధిలో తారలు చేరి
ఎందుకు నా చెలి మోమును చూసే
మేఘాల వీధిలో తారలు చేరి
ఎందుకు నా చెలి మోమును చూసే
గాలులు ఎందుకు గంధం చిలికే
రాతిరి ఎందుకు మత్తుగ మెరిసే
కావాలి ప్రశ్నలకే జవాబులు ఓ చెలి
కొసరె నీలో సిగ్గులివేళ కన్నులలో ఈ కలవరమేల
హో కొసరె నీలో సిగ్గులివేళ కన్నులలో ఈ కలవరమేల
నీ పైట చెంగే చెదిరిన దేలా
నా మదిలోన అలజడులేల
కావాలి ప్రశ్నలకే జవాబులు ఓ చెలి
శోభన గదిలో దంపతులల్లే ఇద్దరిలోను ఈ ఉలుకేలా
శోభన గదిలో దంపతులల్లే ఇద్దరిలోను ఈ ఉలుకేలా
ఇరువురికీ ఒకటే ఇది ఏలా
చివరకి ఇంతటి ప్రేమ ఇదేలా
కావాలి ప్రశ్నలకే జవాబులు ఓ చెలి
మల్లికవా రంగవల్లివా వరాలు చిందే అక్షర కన్నెవా
నేవే పసిడి ప్రేమ గనివా
కావాలి ప్రశ్నలకే జవాబులు ఓ చెలి
******* ******** ********
చిత్రం: ప్రేమ పావురాలు (1989)
సంగీతం: రామ్ లక్ష్మణ్
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు, చిత్ర
ఓ పావురమా ఏ ఏ ఓ పావురమా ఏ ఏ
ఓ పావురమా ఏ ఏ ఓ పావురమా ఏ ఏ
తొలిప్రేమల్లో తొలకరి లేఖ ఓ ఓ ఓ
తొలిప్రేమల్లో తొలకరి లేఖ చెలునుకి అందించి రా
ఓ పావురమా ఏ ఏ ఓ పావురమా ఏ ఏ
ఆతని ధ్యాసలో నే ప్రతిక్షణము కరిగేను
ఈ పెదవులకే మాటలు రాక చిరునవ్వులకే కరువయ్యాను
మనసే తెలియక వేధించనే ఓ ఓ...
మనసే తెలియక వేధించనే నన్ను క్షమించాలి
ఓ పావురమా ఏ ఏ ఓ పావురమా ఏ ఏ
ఓ పావురమా ఏ ఏ ఓ పావురమా ఏ ఏహే
మనసున నేను ఆతనిని నా సర్వస్వం అనుకున్నాను
నేనెవరో తనకేమౌతానో ఇపుడే తెలిసిందంటాను
అతనిని నీతో తీసుకు రావా... ఓ ఓ...
అతనిని నీతో తీసుకు రావా నా కథనెరిగేటి
ఓ పావురమా ఏ ఏ ఓ పావురమా ఏ ఏ
ఓ పావురమా ఏ ఏ ఓ పావురమా ఏ ఏహే
ఓ ఓ ఓ... ఓ ఓ ఓ...
ఎంతానందం ప్రకృతిలో ప్రేమకిదేలా వేధన
చెలికే తెలుపు దూరాన్నున్నా తనదేలే ఆరాధనా
ఈ సందేశాన్నందించాలీ... ఓ ఓ...
ఈ సందేశాన్నందించాలీ వసున్నా అని
ఓ పావురమా హె హె ఓ పావురమా హె హె
ఓ పావురమా హె హె ఓ పావురమా ఏ హే
ఎక్కడ చూసిన నువ్వేలే వేరేది కంటికి కనరాదే
ఈ క్షణమిలాగే ప్రపంచమంతా ఆగిపోతే చాలులే
ఇంతకుముందు ఎపుడూ లేదే...
ఇంతకుముందు ఎపుడూ లేదే లోకం అందంగా