చిత్రం: సందడే సందడి (2002)
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: సుజాత మోహన్ టిప్పు
నటీనటులు: జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, శివాజి, ఊర్వశి, రాశి, సంఘవి, సోనాలి జోషి, సోనీ రాజ్, స్వప్న మాధురి
దర్శకత్వం: ముప్పలనేని శివ
నిర్మాతలు: ఆదిత్య రామ్
విడుదల తేది: 13.12.2002
I am in Love... (3)
I am in Love... (3)
ఔనా ఔనా ప్రేమలోన అపుడే పడ్డాన
ఏదేమైనా ఈ హైరానా తప్పదమ్మ ఎప్పుడైనా
ఇన్నాళ్లుగ ఎదలో దాగిన రూపం ఎదురై కనపడగా
ఔనా ఔనా ప్రేమలోన అపుడే పడ్డాన
ఏదేమైనా ఈ హైరానా తప్పదమ్మ ఎప్పుడైనా
అంతా నువ్వే కావా ఆనందం నవ్వై రావా
నీ సొంతమై చేరుకున్నాగా
ఎదలో వెళుతువున్నా నువ్వెల్లే దారుల్లోన
నీ నీడనై నేనున్నా
నువ్వే నవ్వంగానే నే దోసిలి పడుతూ ఉన్నా
ముత్యాలే అందుకున్నా
నీ చెక్కిలి నొక్కుల్లోన నే చిక్కుకు పోతూవున్నా
నీ చెంతకి చేరుకున్నా
హృదయమా అంతే లేని హాయిలోకి పయణమా
ప్రియతమా అంటుపట్టనివ్వదమ్మ ప్రేమ మహిమ
ఔనా ఔనా ప్రేమలోన అపుడే పడ్డాన
ఏదేమైనా ఈ హైరానా తప్పదమ్మ ఎప్పుడైనా
కనురెప్పల్లో దూరి నా కలగా నువ్వే చేరి
నా లోకమే నువ్వుగ మారి
పువ్వుల పరిమళమంత నీ జాడనే అందిస్తుంటే
నీ జంటనే చేరాలి
నాలుగు దిక్కుల్లోన నీ చిత్రాలే చూడాలి
నా గుండెల్లో నువ్వుండాలి
నా ఊపిరిలో గాలి నీ పేరే జపియించాలి
నీ కోసమే బ్రతకాలి
చిటికెలో నీ చేతుల్లో బందించావే మనసుని
చిలిపిగా నీ మాయల్లో ముంచేశావే నా మదిని
ఔనా ఔనా ప్రేమలోన అపుడే పడ్డాన
ఏదేమైనా ఈ హైరానా తప్పదమ్మ ఎప్పుడైనా
ఇన్నాళ్లుగ ఎదలో దాగిన రూపం ఎదురై కనపడగా
I am in Love... (3)
I am in Love... (3)