చిత్రం: శీను. వాసంతి.. లక్ష్మి... (2003) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ నటీనటులు: ఆర్.పి.పట్నాయక్ , నవనీత్ కౌర్, పద్మప్రియ దర్శకత్వం: ఇ. శ్రీనివాస్ నిర్మాత: యన్.యమ్.సురేష్ విడుదల తేది: 26.03.2003
Songs List:
కుకుకూ కుకుకూ పాట సాహిత్యం
చిత్రం: శీను. వాసంతి.. లక్ష్మి... (2003) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఆర్.పి.పట్నాయక్ కుకుకూ కుకుకూ కుకుకూ కూ తొలిరాగం నేర్పింది ఈ పలుకూ కుకుకూ కుకుకూ కుకుకూ కూ నవలోకం చూపింది ఈ పిలుపూ చిగురాకుల సవ్వడి ఐనా చిరుగాలి తాకినా గుడిగంటల సందడి విన్నా నాలో ఏదో మైమరపూ కుకుకూ కుకుకూ కుకుకూ కూ తొలిరాగం నేర్పింది ఈ పలుకూ చరణం: 1 కుశలములెన్నో అడిగినదీ కులికే గోదావరీ పులకలు నాలో చిలికినదీ ఎగసే ఈ లాహిరి కరిమబ్బునే మహముద్దుగా ఎదముందుకు తెచ్చెను గాలీ తడికన్నుల్లో సిరివెన్నెల్లే కురిపించెను జాబిలీ... కుకుకూ కుకుకూ కుకుకూ కూ తొలిరాగం నేర్పింది ఈ పలుకూ కుకుకూ కుకుకూ కుకుకూ కూ నవలోకం చూపింది ఈ పిలుపూ చరణం: 2 అడుగులు తానై నడిపినదీ పుడమే ఓదారినీ పదములు పాడీ పంచినది ఒడిలో ఓదార్పుని రుణమన్నదే యిక తీరదే నా ప్రాణములిచ్చిన గానీ నేల తల్లికే నేను యివ్వనా ఈ గీతాంజలీ... కుకుకూ కుకుకూ కుకుకూ కూ తొలిరాగం నేర్పింది ఈ పలుకూ కుకుకూ కుకుకూ కుకుకూ కూ నవలోకం చూపింది ఈ పిలుపూ చిగురాకుల సవ్వడి ఐనా చిరుగాలి తాకినా గుడిగంటల సందడి విన్నా నాలో ఏదో మైమరపూ కుకుకూ కుకుకూ కుకుకూ కూ తొలిరాగం నేర్పింది ఈ పలుకూ
పాడనా శిలను కరిగించు గీతం పాట సాహిత్యం
చిత్రం: శీను. వాసంతి.. లక్ష్మి... (2003) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఆర్.పి.పట్నాయక్, నిహాల్ పాడనా శిలను కరిగించు గీతం పరమేశ్వరుడే యిలకేతెంచి పులకించి నర్తించు నవ నాట్య వేదం పాడనా మదిని మురిపించు గీతం స్వరమాధురిలో మనసే నెమలై పురివిప్పి ఆడేటి ఆనంద గీతం పాడనా... నారద ప్రణిపాతం స్వర భారతి పదపీఠం ఓంకార నాదాల నిగమార్ధసారం సంగీతం వెన్నెల జలపాతం మరుమల్లెల మణిదీపం స్వరరాగ రసయోగ గంగాప్రవాహం సంగీతం దిగంతాల శ్రుతి సుగంధాలు వెదజల్లును సంగీతం పాడనా శిలను కరిగించు గీతం స్వరమాధురిలో మనసే నెమలై పురివిప్పి ఆడేటి ఆనంద గీతం చరణం: 1 తుంబురు వరదానం తుహినాచల పరిధానం మందార మకరంద మాధుర్యపానం..నా గానం తుమ్మెద ఝంకారం నా పాటకి శ్రీకారం పరువాల పరవళ్ళ సెలయేటి వేగం నా రాగం కళాభారతికి కళాఘాతమది ఏమిర నీ గీతం పాడనా శిలను కరిగించు గీతం స్వరమాధురిలో మనసే నెమలై పురివిప్పి ఆడేటి ఆనంద గీతం నాదబ్రహ్మ గురు త్యాగరాజ కృత పంచరత్నములకించుమించు సరిసాటియైన మమ గాన వాహినికి మంజుల మార్దవ మానస గీతికి ఊపిరులాడక స్వరములు తోచక తికమక పడిపడి పదములు తడబడి శ్రుతి తప్పి మతిపోవు పసివాడవు జన్యజనకాల, ధన్యగామకాల నా మూర్చనలకింక మూర్చిల్లిపోతావు || పాడనా ... || చరణం: 2 గలగల పారే సెలయేరమ్మ సరిగమలంటే నేర్పింది కిలకిల పాడే ప్రతి గువ్వమ్మ గమకములంటే చూపింది అమ్మ పాటలో లాలి లాలన చిన్ని పాపలో హాయి భావన గాలి తరగలో గాన మధురిమ పేద వెదురులో ప్రాణ స్పందన కడలి అలల కమనీయ కీర్తన పుడమి ఎదను చినుకమ్మ నర్తన సుప్రభాత సుమ రాగ రంజన సూర్యదేవ కిరణాల దీవెన వేద మంత్రముల నాద ఘోషణ కాగితాలలో కావ్య వేదన గుండె గూటిలో వాయులీనమై కంటి పాపలో స్వప్న రాగమై గాన పథమ్మున నను నడిపించే జానపదమ్ముల జాను తెలుగు తొలి పాటతల్లి నా జోతలందుకొని పొంగిపోగా ... పాడనా...
కోదండ రాముణ్ణి పాట సాహిత్యం
చిత్రం: శీను. వాసంతి.. లక్ష్మి... (2003) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఆర్.పి.పట్నాయక్ పల్లవి: కోదండ రాముణ్ణి చూడు కోరింది యిచ్చేటివాడు ఆ సుందరాంగుణ్ణి చూడు మా తల్లి సీతమ్మ జోడు అందాలన్ని చూడ కళ్ళు చాలకుంటె నా మనసుతొ చూడు చూడయ్యో ఆ రూపం అపురూపం నిలపాలోయ్ గుండెలోపలా ఆదైవం మనకోసం వెలిశాడోయ్ నేలపై యిలా చరణం: 1 శ్రీరాముని చిరునవ్వుగ వెలుగొందిన సీత ఆ దేవుని వెనకాతలె వనికేగెను మాత లంకేశుడు బెదిరించెను పలుమాయలచేత బెంబేలున మూర్ఛిల్లెను అయ్యో మనసీత ఆ బాధే నాలో పాటై పాడేను రామాయణం కోదండ రాముణ్ణి చూడు చరణం: 2 హనుమంతుడు వివరించెను సీతాసతి జాడ శ్రీరాముడు వదిలించెను లంకేశుని చీడ పరనిందకు శీలమ్మును శంకించుట చేత పెనుమంటలలో దూకి పునీత అయ్యె సీత ఆ గాథే నాలో పాటై పాడేను రామాయణం కోదండ రాముణ్ణి చూడు
అమెరిక అన్నాడు పాట సాహిత్యం
చిత్రం: శీను. వాసంతి.. లక్ష్మి... (2003) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: మాలతి, ఆలి, సునీల్ ఏ పిల్లాయ్ ఏటి నువ్వు నాకు నచ్చావ్ నాకూ నా గోపి నచ్చాడు గోపిగాడ ఆడెక్కడుంటాడు ఏమో... అమెరిక అన్నాడు అరెకరమమ్మాడు అడ్డరోడ్డు సంతలో నన్నొదిలి పోయాడు తెలిసినోడు, తెలియనోడు, పడుచోడు, ముసలోడు ఉన్నోడు, లేనోడు, వెంటపడి నవ్వుతాడు హా... పిల్లా బాగున్నా వంటడూ - అంతనచ్చావా ? పిల్లా ఏవూరు అంటడూ - ఊరు చెప్పేనా? అమ్మాయ్ ఏఁ పేరు అంటడూ - పేరు చెప్పేవా ? అలా ఓ సారి అంటడూ - చాటుకెళ్ళావా ? అమ్మ దొంగా చాటుకెళ్ళినావా అందమంతా అప్పగించినావా ? ఏంటి తెగమెలికలు తిరిగిపోతున్నావు నా గోపి యే గుర్తోస్తున్నాడు అంత గుర్తొచ్చేసే పనేంచేశాడేంటి...? మనువని చెప్పాడు మడతలు విప్పాడు మావిడి తోపులో మంచం వేశాడు అమ్మతోడు అందగాడు మల్లెలవీ జల్లినాడు దగ్గరగా వచ్చినాడు బుగ్గలవీ గిల్లినాడు హాఁ అబ్బా మా చడ్డ గుంటడూ - మీద కొచ్చాడా ? అమ్మీ ముద్దెట్ట మంటడూ - ముద్దుపెట్టావా ? ఛీపో సిగ్గంటే ఒగ్గడూ - పట్టుకున్నాడా? కుర్రాడేమాత్రం తగ్గడూ - అంత పనోడా? కొంటె వాడా కోకలాగినాడా ? సూపుతోటే కాక రేపినాడా ? చెట్టంతుంటాడు చెప్పినదింటాడు నలుగురినెప్పుడూ నవ్విస్తుంటాడు కొత్తలుంగీ కట్టినాడు గళ్ళ బనీనేసినాడు మండగొలుసు పెట్టినాడు మందులవీ అమ్ముతాడు మందులమ్ముతాడా ? పిల్లా నీ వాడు ఎవ్వడే? - డాక్టరబ్బాయి అబ్బో ఏఁమందులున్నవే? - బోలెడున్నాయీ సరే మీ బావ ఎక్కడ? - తెలీదబ్బాయి కండపుష్టికి ధాతుపుష్టికి తిరుగులేని వనమూలికలమ్ముతాం మూలిక వాడండి మూలన పడ్డ మగతన్నాని వెలికి తీయండి చీకటి పడితే చాలు చిరుత పులైపోతారు మామాట నమ్మండి గజ్జిగాని, దురద గాని, తామరగాని గోక్కోవడానికి గోళ్ళు లేవని బాధపడకండి ధనుర్వాతం, పక్షవాతం కాళ్ళ నొప్పులు, కీళ్ళనొప్పులు, నడుంనొప్పులు, వెన్నునొప్పులు మెడనొప్పులు, తొడ నొప్పులు అన్ని నొప్పులకూ ఒకటే మందు రూపాయ్ కొడితే ఉంటుంది మీ ముందు పెద్దాపురం తైలం నొప్పులన్నీ మటుమాయం అరే మా బావ గొంతులా ఉందే...? ఏటి మీ బావ సందుల్లో మందులమ్ముతాడా ? మరి డాక్టరని పెద్ద బిల్డప్పిచ్చావ్ .... మా ఊళ్ళో సందుల్లో మందులమ్మేవాళ్ళని డాక్టరనే అంటారు మందులోడా ఓరి మాయలోడా మాతరేసి మాయ చేసినోడా
వానా వానా వానా పాట సాహిత్యం
చిత్రం: శీను. వాసంతి.. లక్ష్మి... (2003) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఆర్.పి.పట్నాయక్ పల్లవి: వానా వానా వానా నీలాకాశంలోన నీతో చిందేసి ఆడన వానా వానా వానా మేఘాలాపన లోన నేనూ ఓ పాట పాడన పన్నీటి పూలతోన ఊసులాడుకోన పసిపాపలా హరివిల్లునే చెయిచాపి అందుకోన వానా వానా వానా చరణం: 1 వానలోన కాగితాల పడవలేసే చిలిపి ప్రాయం యింకాగురుతే చిన్నినేస్తం యేటిలోన గాలమేసి ఎదురుచూసే మనసు పాపం మదిలో మెదిలే నాటి బాల్యం వాననీటిలో ఆడుకున్న ఈతలు జామతోటలో పాడుకున్న పాటలు మరుపే లేని తియ్యనైన జ్ఞాపకాలు వానా వానా వానా చరణం: 2 నింగిలోన మబ్బుకూన అందుకుంది చినుకురాగం దాహంకోరే నేలకోసం నేలపైన నీటివీణ పల్లవించే మబ్బుకోసం స్నేహం పంచే పూలగీతం కోయిలమ్మతోపాటు కొంటె పాటలు జాబిలమ్మతో ఎన్ని జామురాత్రులు మరుపే లేని తియ్యనైన జ్ఞాపకాలు వానా వానా వానా
గోదారి నవ్వింది పాట సాహిత్యం
చిత్రం: శీను. వాసంతి.. లక్ష్మి... (2003) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఆర్.పి.పట్నాయక్, ఉష గోదారి నవ్వింది తుమ్మెదా నిండు గోదారి నవ్వింది తుమ్మెదా గోదారి నవ్వింది తుమ్మెదా నిండు గోదారి నవ్వింది తుమ్మెదా మా పల్లె నవ్వింది తుమ్మెదా మల్లె పువ్వల్లె నవ్వింది తుమ్మెదా సంబరాల వేళ తుమ్మెదా ఊరు స్వర్గమయ్యిందమ్మ తుమ్మెదా ఇన్ని సంతోషాలు నిండు నూరేళ్ళుంటె ఎంత బాగుంటుందె తుమ్మెదా గోదారి నవ్వింది తుమ్మెదా నిండు గోదారి నవ్వింది తుమ్మెదా హోయ్ తుమ్మెదా ఆనందమె బ్రహ్మ తుమ్మెదా మనిషికానందమె జన్మ తుమ్మెదా కోరుకున్నదంత కళ్ళు ముందు ఉంటె ఆనందమె కద తుమ్మెదా ఆకాశమేమంది తుమ్మెదా చిటికెడాశుంటె చాలంది తుమ్మెదా అంతులేని ఆశ గొంతుదాటలేక ఇరక పడతాదమ్మ తుమ్మెదా ఈ నవ్వు తోడుంటె తుమ్మెదా ఇంక కష్టాలదేముంది తుమ్మెదా గోదారి నవ్వింది తుమ్మెదా నిండు గోదారి నవ్వింది తుమ్మెదా హోయ్ తుమ్మెదా గోధూళి వేళల్లొ తుమ్మెదా ఎద రాగాలు తీసింది తుమ్మెదా కొంటె గుండెలోన సందె పొద్దువాలి ఎంత ముద్దుగుంది తుమ్మెదా అందాల చిలకమ్మ తుమ్మెదా కూని రాగాలు తీసింది తుమ్మెదా కన్నె మూగ ప్రేమ హాయి పాటల్లోన ఊయలూగిందమ్మ తుమ్మెదా పుణ్యాల నోమంట తుమ్మెదా ఈ లోకాన ఈ జన్మ తుమ్మెదా గోదారి నవ్వింది తుమ్మెదా నిండు గోదారి నవ్వింది తుమ్మెదా మా పల్లె నవ్వింది తుమ్మెదా మల్లె పువ్వల్లె నవ్వింది తుమ్మెదా సంబరాల వేళ తుమ్మెదా ఊరు స్వర్గమయ్యిందమ్మ తుమ్మెదా ఇన్ని సంతోషాలు నిండు నూరేళ్ళుంటె ఎంత బాగుంటుందె తుమ్మెదా గోదారి నవ్వింది తుమ్మెదా నిండు గోదారి నవ్వింది తుమ్మెదా హోయ్ తుమ్మెదా