Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Suvarna Sundari (1985)




చిత్రం: సువర్ణ సుందరి (1985)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: వేటూరి (All)
నటీనటులు: చంద్రమోహన్, జయశ్రీ
కథ, స్కీన్ ప్లే, దర్శకత్వం: బీరం మస్థాన్ రావు
నిర్మాత: అట్ల బ్రహ్మారెడ్డి
విడుదల తేది: 04.01.1985



Songs List:



ఆ సిగ్గులు పెట్టని ముగ్గులు పాట సాహిత్యం

 
చిత్రం: సువర్ణ సుందరి (1985)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు

ఆ సిగ్గులు పెట్టని ముగ్గులు 



ఇది నా జీవితాలపనా...పాట సాహిత్యం

 
చిత్రం: సువర్ణ సుందరి (1985)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

పల్లవి:
ఆ ఆ... ఆ ఆ... ఆ ఆ... ఆ ఆ...
ఆ ఆ... ఆ ఆ... ఆ ఆ... ఆ ఆ...
ఆ ఆ... ఆ ఆ... ఆ ఆ... ఆ ఆ...
ఆ ఆ... ఆ ఆ... ఆ ఆ... ఆ ఆ...

ఇది నా జీవితాలపనా... ప్రియదేవతాన్వేషణా
ఏమైనదో ఎట దాగున్నదో..
ఏమైనదో ఎట దాగున్నదో..
ఎన్నాళ్ళు ఈ వేదనా... ఎన్నాళ్ళు ఈ వేదనా... 

ఇది నా జీవితాలపనా... ప్రియదేవతాన్వేషణా 

చరణం: 1 
పొలిమేర దాటాను దావానలో
పొలికేక నైనాను రాగాలలో.
శున్యాక్షరాల గవాక్షాలలో 
శున్యాక్షరాల గవాక్షాలలో
నిలిచాను నిరుపేదల గీతాలతో
మదిగాయలుగా మధు గేయాలుగా
మదిగాయలుగా మధు గేయాలుగా
ఎన్నాళ్ళు ఈ వేదనా... ఎన్నాళ్ళు ఈ వేదనా...

ఇది నా జీవితాలపనా... ప్రియదేవతాన్వేషణా

చరణం: 2 
మంజీరమైనాను నీ పాటలో
మందారమైనాను నీ తోటలో
మౌనస్వరాల ఈ పంజరాన.
మౌనస్వరాల ఈ పంజరాన 
కరిగాను కడలేని స్వప్నాలలో
విధి నటనాలలో ఋతుపవనాలలో
విధి నటనాలలో ఋతుపవనాలలో
ఎన్నాళ్ళు ఈ వేదనా... ఎన్నాళ్ళు ఈ వేదనా...

ఇది నా జీవితాలపనా... ప్రియదేవతాన్వేషణా 

చరణం: 3
నీ అంతిమ శ్వాస నీ కవితలో ప్రాస అవుతుందనీ బాస చేసానులే
కావాలనే బ్రతికి ఉన్నాను లే... ఉంటానులే...
నీ సంగామావేశ విజృంభణంలోన ఆకాశమే తుంచి
కైలాసమే వంచి నిను చేరుకుంటాను నీనాదమై



ఇలపై నడిచే చంద్రమా పాట సాహిత్యం

 
చిత్రం: సువర్ణ సుందరి (1985)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు

ఇలపై నడిచే చంద్రమా 




మధురం మధురం పాట సాహిత్యం

 
చిత్రం: సువర్ణ సుందరి (1985)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పూర్ణ చందర్ 

మధురం మధురం 



ఊహవో... ఊపిరివో... పాట సాహిత్యం

 
చిత్రం: సువర్ణ సుందరి (1985)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, యస్.జానకి

పల్లవి:
ఊహవో ఊపిరివో నా జీవన రసమాధురివో
ఊహవో ఊపిరివో నా జీవన రసమాధురివో
వివర్ణమైన ఆశల ముంగిట సువర్ణ సుందరివో
ఇదే నా స్వాగతం నీవే నా జీవితం

ఊహవో ఊపిరివో నా జీవన రసమాధురివో
వివర్ణమైన ఆశల ముంగిట సువర్ణ సుందరివో
ఇదే నా స్వాగతం నీవే నా జీవితం

చరణం: 1
చీకటి తీవెల రాతిరి వీణియ నవ్విన వేకువ చూపులని
ఆమని తేనెల వాగుల పొంగిన తీయని అలలే మాటలని
కంకణముల సడి పాటలుగా
కలికి అందియల ఆటలుగా
ఎడదల చప్పుడు తాళముగా
విడుదల ఎరుగని కౌగిలిలో...

కనుపాపలు తానాలాడే
ఆషాడపు అభిషేకంలో
ఏడుజన్మలిటు... ఆరు ఋతువులై
నూరు శరత్తులు విరిసిన వేళ...
ఉదయరేఖ నుదుటదిద్ది కదలిరావే నా సుందరి
ఓ నా ఉషస్సుందరి...

ఊహవో ఊపిరివో నా జీవన రస మాధురివో

చరణం: 2
వెన్నెలసణిగే వెండిమువ్వలో సన్నని లయ నా హృదయమని
కిన్నెర పలికే చిలిపి ముద్దులో చల్లని శృతి నా ప్రణయమని
గగన నీలిమలు కురులుగా ఉదయరక్తిమలు పెదవులుగా
హరిత చైత్రములు చీరెలుగా శరణ్మెఘముల నడకలలో

నిన్ను తాకిన హేమంతములో సుడిరేగిన సంగీతంలో
సప్తవర్ణములు సప్తస్వరాలై సప్తపదులు నడిపించిన వేళా...
కలలు వీడి ఇలకు చేరి కలిసిపొవె నా సుందరి 
ఇంద్రధనుస్సుందరీ...

ఊహవో ఊపిరివో నా జీవన రసమాధురివో
వివర్ణమైన ఆశల ముంగిట సువర్ణ సుందరివో
ఇదే నా స్వాగతం నీవే నా జీవితం




పాటల తోటలో పాట సాహిత్యం

 
చిత్రం: సువర్ణ సుందరి (1985)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: వేటూరి
గానం: యస్. జానకి

పాటల తోటలో 




వెన్నెల ఎండగా మారే వేళ పాట సాహిత్యం

 
చిత్రం: సువర్ణ సుందరి (1985)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు

వెన్నెల ఎండగా మారే వేళ




గొబ్బియమ్మా గొబ్బిళ్ళో పాట సాహిత్యం

 
చిత్రం: సువర్ణ సుందరి (1985)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: వేటూరి
గానం: 

గొబ్బియమ్మా గొబ్బిళ్ళో 




సంసార సుఖ యాత్రలో పాట సాహిత్యం

 
చిత్రం: సువర్ణ సుందరి (1985)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: వేటూరి
గానం: 

సంసార సుఖ యాత్రలో 




మధురం మధురం - 2 పాట సాహిత్యం

 
చిత్రం: సువర్ణ సుందరి (1985)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: వేటూరి
గానం: 

మధురం మధురం - 2

Most Recent

Default