Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Trinetrudu (1988)





చిత్రం:  త్రినేత్రుడు  (1988)
సంగీతం:  రాజ్-కోటి
నటీనటులు: చిరంజీవి, భానుప్రియ
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాతలు: నాగేంద్ర బాబు, చిరంజీవి
విడుదల తేది: 22.09.1988



Songs List:



హే పాపా పాట సాహిత్యం

 
చిత్రం:  త్రినేత్రుడు  (1988)
సంగీతం:  రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు

హే పాపా ప ప ప ప
హో పాపా ప ప ప ప
రీ పాపా ప ప ప ప ప ప
టీనేజి గాల్సు నా జట్టు
కాలేజి గైసు నా పట్టు
బ్రేకేస్తే షేకు నీకేలేరా

నా ఫ్యాన్సు లేత సొగసరి లేడీసూ
నన్ను తలుచుకు రొమాన్సు
చెయ్యగలిగిన గడసరి యువకుడు

పేబర్లీ కొండల్లొ గజ గజ
హాలివుడ్ తారల్లొ గిజ గిజ
డిస్నీ ల్యాండు గుండెల్లొ గడ బిడగా  
పేబర్లీ కొండల్లొ గజ గజ
హాలివుడ్ తారల్లొ గిజ గిజ
డిస్నీ ల్యాండు గుండెల్లొ గడ బిడగా

పాపలంత మెచ్చుకున్న పట్టు చూడరో
ఫ్రాకులోని సోకు చూడరో
ఒళ్ళు దాటి తుల్లి పడ్డ ఒంపు చూడరో
జంపు దాటి సొంపు చూడరో
త్రిల్లురో ఒళ్ళూ గిల్లురో గుండె జల్లురో

హే పాపా ప ప ప ప
హో పాపా ప ప ప ప
రీ పాపా ప ప ప ప ప ప
టీనేజి గాల్సు నా జట్టు
కాలేజి గైసు నా పట్టు
బ్రేకేస్తే షేకు నీకేలేరా

సిల్వర్ స్క్రీన్ సుంగార మధురిమ
యవర్ గ్రీన్ పరువాల గుమ గుమ
సమ్మర్త్ సాల్ట్ నాట్యాల రిమ రిమలు
సిల్వర్ స్క్రీన్ సుంగార మధురిమ
యవర్ గ్రీన్ పరువాల గుమ గుమ
సమ్మర్త్ సాల్ట్ నాట్యాల రిమ రిమలు

ఈడు చూడు పోసు చూడు ఈవుటీజులో
మొగ్గ విచ్చుకున్న మోజులో
చూపు చూడు ఊపు చూడు టాపు చూడరో
జీన్సు గున్న చాన్సు చూడరో
అల్లరు రాగ వల్లరు చూసి వెల్లరో

టీనేజు .....
టీనేజి గాల్సు నా జట్టు
కాలేజి గైసు నా పట్టు
బ్రేకేస్తే షేకు నీకేలేరా

నా ఫ్యాన్సు లేత సొగసరి లేడీసూ
నన్ను తలుచుకు రొమాన్సు
చెయ్యగలిగిన గడసరి యువకుడు



ఓరినాయనో పాట సాహిత్యం

 
చిత్రం:  త్రినేత్రుడు  (1988)
సంగీతం:  రాజ్-కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం:  మనో, చిత్ర

ఓరినాయనో సోకు షాకు కొట్టిందమ్మో
ఓరిదేవుడో చిలిపి చీమ కుట్టిందయ్యో
జిల్లు జిల్లంటూ ఒళ్ళు తూలింది
ఎర్ర ఎర్రంగా సిగ్గు కందింది
వెన్న ముద్దల్లే గుద్దుకున్న చిన్నదాని వన్నెదాడికీ
కన్నె ఒంపుల్లో సద్దుకున్న చిన్నవాడి కన్ను వేడికీ

ఓరినాయనో సోకు షాకు కొట్టిందమ్మో

ఒద్దనవద్దూ మెత్తని ముద్దు
హత్తుకుపోతె బిత్తరిపోదా ఇద్దరి హద్దు
ఒడ్డుకు నెట్టు ఒంటరి తెడ్డు
సిగ్గుల నావకు లగ్గం రేవున లంగరు దించు
కొత్త మోమాటం తీరాలమ్మో
కొంటె ఆరాటం ఆగాలయ్యో
సందిట పట్టి పందెం కట్టి గుట్టే లాగేస్తా
నును సిగ్గుల చుట్టు అగ్గిని పెట్టి పిండెను పండిస్తా

గుబురు చాటున్న మల్లెమొగ్గ
తుళ్ళి పడే మోజు ఎప్పుడో
గుబులు దొంకల్లో మొగలి సెగలు
రగులుకునే రోజు ఎప్పుడో

ఓరిదేవుడో చిలిపి చీమ కుట్టిందయ్యో

గుప్పున మండే నిప్పుల చెండు
వెన్నెల ఒళ్ళో వెచ్చగ తుల్లే అల్లరి చిందూ
అందిన పండు చిచ్చుల విందు
రెచ్చిన కొద్ది ముచ్చట పెంచే మెత్తని దిండూ
పూల బంతులతో ఆడాలయ్యో
పాల పుంతల్నే చూడాలమ్మో
చెయ్యక తప్పని తియ్యని తప్పుని చేసే తొందరలో
మన ఇద్దరి మద్యన ఉక్కిరిబిక్కిరి కాని నిద్దర్లో

బిందె లోతుల్లో ఉంగరాన్ని
అందుకునే పండగెప్పుడో
సంద్య చీకట్లో సంబరాలు
చెంగుమనే సందడెప్పుడో

ఓరినాయనో సోకు షాకు కొట్టిందమ్మో
ఓరిదేవుడో చిలిపి చీమ కుట్టిందయ్యో
జిల్లు జిల్లంటూ ఒళ్ళు తూలింది
ఎర్ర ఎర్రంగా సిగ్గు కందింది
వెన్న ముద్దల్లే గుద్దుకున్న చిన్నదాని వన్నెదాడికీ
కన్నె ఒంపుల్లో సద్దుకున్న చిన్నవాడి కన్ను వేడికీ



లవ్లి లకుముకి పాట సాహిత్యం

 
చిత్రం:  త్రినేత్రుడు  (1988)
సంగీతం:  రాజ్-కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు, జానకి

లవ్లి లకుముకి మోలి పిలుపుకి లవ్లో పడ్డానమ్మా
జాలీ చకుముకి మోలి చెలిమికి వల్లో పడ్డానమ్మా
తీర్చవా శింగారాలు చిలికిన తహతహా
ఓర్చుకో కంగారేల తుంటరి టిమటిమా
తొలి వలపు రాగాల గొడవ సాగాలి
కలల కవ్వింతలో

లవ్లి లకుముకి మోలి పిలుపుకి లవ్లో పడ్డానమ్మా
జాలీ చకుముకి మోలి చెలిమికి వల్లో పడ్డానమ్మా

ఆరుబైట కథా అల్లరైతె ఎలా
ఇంత పచ్చి శృంగారమా
కళ్ళు పచ్చబడీ ఒళ్ళు వెచ్చబడీ
పక్కకొస్తె నిష్టూరమా
ఉల్లిపొర్ల సిగ్గిలన్ని ఒలుచుకుంటు
అల్లుకున్న ఊపిరంత చిచ్చోనమ్మా
తెల్లవార్లు ముల్లు విప్పి నుల్లు పూలు
తుల్లుతున్న తాపమింక పిచ్చోనమ్మా

దూరం తీరే దారే చూడూ
భారం తీరే బేరం ఆడూ
మన మొదటి మైకాలు మధనలోకాలు
మలుపు తిప్పాలమ్మా

లవ్లి లకుముకి మోలి పిలుపుకి లవ్లో పడ్డానమ్మా
జాలీ చకుముకి మోలి చెలిమికి వల్లో పడ్డానమ్మా

ఊగుతున్న కొద్ది ఆగుతుంది నిసి 
రేగుతున్న ఆత్రాలలో
తీరుతున్న కొద్ది ఊరుతుంది కసి 
మోగుతున్న మోహాలలో
పూల పక్క వాడంగానె రేగి చుక్క వాలుతుంది వాలు కళ్ళ వాకిల్లలో
వెన్నెలమ్మ వెల్లువయ్యి ఝల్లు మంటు తుళ్ళుతుది చల్లబడ్డ ఆకళ్ళలో

తీసే శ్వాసే వేసే తాళం
పూసే ఆశే చేసే స్నానం
చిరి చెమట వాగుల్లొ చిలిపి దహాలు కరిహిపోవాలమ్మా

లవ్లి లకుముకి మోలి పిలుపుకి లవ్లో పడ్డానమ్మా
జాలీ చకుముకి మోలి చెలిమికి వల్లో పడ్డానమ్మా
తీర్చవా శింగారాలు చిలికిన తహతహా
ఓర్చుకో కంగారేల తుంటరి టిమటిమా
తొలి వలపు రాగాల గొడవ సాగాలి
కలల కవ్వింతలో

లవ్లి లకుముకి మోలి పిలుపుకి లవ్లో పడ్డానమ్మా
జాలీ చకుముకి మోలి చెలిమికి వల్లో పడ్డానమ్మా



నాటుకొట్టుడు పాట సాహిత్యం

 
చిత్రం:  త్రినేత్రుడు  (1988)
సంగీతం:  రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం:  బాలు, జానకి

పల్లవి:
నాటుకొట్టుడు వీరకొట్టుడు కన్నుకొట్టుడు
రెచ్చగొట్టే చంటి పిల్లడు పాలకొచ్చాడే
నాటుకొట్టుడు వీరకొట్టుడు దంచికొట్టుడు
దద్దరిల్లే కొంటెపిల్లడు పండు గిచ్చాడే
ఈడు దుప్పట్లో మన జోడు చప్పట్లు
పొద్దు చీకట్లో మన ముద్దు ముచ్చట్లు
కౌగిలిలో సిగ్గు బలి..  గాలి బలి యమో యమో

నాటుకొట్టుడు వీరకొట్టుడు దంచికొట్టుడు
దద్దరిల్లే కొంటెపిల్లడు పండు గిచ్చాడే
నాటుకొట్టుడు వీరకొట్టుడు కన్నుకొట్టుడు
రెచ్చగొట్టే చంటి పిల్లడు పాలకొచ్చాడే

చరణం: 1
ముట్టడించి కొట్టాలా బుగ్గల్లో నా ముద్దు
మట్టగించి తొక్కాలా మంచాలే ఈ పొద్దు
కోకపల్లి రాజ్యంలో కొటగుమ్మమేడుందో
ఆనతీసి పట్టేదాకా ఆరాటాలమ్మో
చుట్టుముట్టి పట్టాలా కౌగిట్లో నా సోకు
కట్టుతప్పి పోవాలా చీరమ్మే కాసేపు
రైకపల్లి రాజ్యంలో ముళ్ళుపడ్డ ముంగిట్లో
చిక్కులిప్ప తీసే దాకా మోమాటాలమ్మో
శృంగారానికి సింగంలాంటి చిన్నోడొస్తుంటే
సిగ్గు ఎగ్గు పుట్టిళ్ళల్లో నుగ్గైపోతుంటే
తాకిడి వేళా చెలి తట్టుకోవాలా
కస్సుబుస్సు పూజలతో కాముడికి నమో నమో

నాటుకొట్టుడు వీరకొట్టుడు దంచికొట్టుడు
దద్దరిల్లే కొంటెపిల్లడు పండు గిచ్చాడే
నాటుకొట్టుడు వీరకొట్టుడు కన్నుకొట్టుడు
రెచ్చగొట్టే చంటి పిల్లడు పాలకొచ్చాడే

చరణం: 2
చప్పరింత కొట్టాలా మైకంలో ఓమాటు
అప్పగింతలియ్యాలా మెత్తంగా ఈనాడు
పైటపల్లి తాలూకా పాలకొల్లు సంతల్లో
పండుకోసుకెళ్ళేదాకా పంతాలేనమ్మో
దండయాత్ర చెయ్యాలా దండల్తో ఓనాడు
ఎండ వెన్నెలవ్వాలా ఏనాడో ఓనాడు
పూలపల్లి తాలూకా పూతరేకు సందుల్లో
తేనేబొట్టు పెట్టిన్నాడే పేరంటాలమ్మో
వయ్యారానికి ఉయ్యాలోచ్చే వూహే చూస్తుంటే
ఉట్టి పట్టి చట్టే కొట్టే ఊపే వస్తుంటే
గుద్దులాటల్లో తొలి ముద్దులాటల్లో
మొగ్గే విచ్చే మోజులతో ప్రేమలకే...  ఘుమో ఘుమో

నాటుకొట్టుడు వీరకొట్టుడు కన్నుకొట్టుడు
రెచ్చగొట్టే చంటి పిల్లడు పాలకొచ్చాడే
నాటుకొట్టుడు వీరకొట్టుడు దంచికొట్టుడు
దద్దరిల్లే కొంటెపిల్లడు పండు గిచ్చాడే
ఈడు దుప్పట్లో మన జోడు చప్పట్లు
పొద్దు చీకట్లో మన ముద్దు ముచ్చట్లు
కౌగిలిలో సిగ్గు బలి..  గాలి బలి యమో యమో

నాటుకొట్టుడు వీరకొట్టుడు దంచికొట్టుడు
దద్దరిల్లే కొంటెపిల్లడు పండు గిచ్చాడే
నాటుకొట్టుడు వీరకొట్టుడు కన్నుకొట్టుడు
రెచ్చగొట్టే చంటి పిల్లడు పాలకొచ్చాడే



చెంపల తళుకుల పాట సాహిత్యం

 
చిత్రం:  త్రినేత్రుడు  (1988)
సంగీతం:  రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం:  యస్.పి.బాలు, జానకి

చెంపల తళుకుల కెంపుల లేడి జోడి కావే
ఒంపులు తిరిగిన సొంపుల బ్యూటీ నీదే లేరా
బిగిసిన రైకలో సొగసుల కేకలే
ఎగసిన వేలలో ఎగబడగా... కలబడగా

చెంపల తళుకుల కెంపుల లేడి జోడి కావే
ఒంపులు తిరిగిన సొంపుల బ్యూటీ నీదే లేరా

నలిగి మెత్తగ అలిగే సొగసే 
మత్తుగ అత్తరు కొడుతుంటే
చిదిపి సన్నగ కదిపి వలపే
వంటికి వత్తిడి పెడుతుంటే

నా రెక్క నీ పిక్క అంటించగా
తైతక్క లాటెదో పుట్టించగా
లోలోన పైపైన రెట్టింతగా
లోతైన మోహాలు ముట్టించగా

మబ్బుల చాటున జాబిలి చేజిక్కనీ
ఊకిరి చూపుల చుక్కని కొండెక్కనీ
మబ్బుల చాటున జాబిలి చేజిక్కనీ
ఊకిరి చూపుల చుక్కని కొండెక్కనీ
తొలిగా కలిసీ నడిపే కథలో రేగే శృంగారమే

చెంపల తళుకుల కెంపుల లేడి జోడి కావే
ఒంపులు తిరిగిన సొంపుల బ్యూటీ నీదే లేరా

అడిగి ముద్దుల కరిగే
ఒడిలో ప్రేమకు ఉగ్గులు కడుతుంటే
ఒదిగి కౌగిలి తొడిగే
అమ్మడి ముంగిట ముగ్గులు పెడుతుంటే

నా కన్ను నీ కన్ను కవ్వింతగా
వెన్నెల్లు పగటేల పుట్టించగా
నీ పోసు నా మోజు పూసంతగా
చీకట్లో చిరు తిల్లు తినిపించగా

పున్నమి నాటికి పువ్వులు తలకెక్కనీ
పువ్వులు వాలిన తుమ్మెద మత్తెక్కనీ
పున్నమి నాటికి పువ్వులు తలకెక్కనీ
పువ్వులు వాలిన తుమ్మెద మత్తెక్కనీ
తడిగా పొడిగా తగిలే తపనే తీరే సాయంత్రమే

చెంపల తళుకుల కెంపుల లేడి జోడి కావే
ఒంపులు తిరిగిన సొంపుల బ్యూటీ నీదే లేరా
బిగిసిన రైకలో సొగసుల కేకలే
ఎగసిన వేలలో ఎగబడగా... కలబడగా

చెంపల తళుకుల కెంపుల లేడి జోడి కావే
ఒంపులు తిరిగిన సొంపుల బ్యూటీ నీదే లేరా

Most Recent

Default