చిత్రం: అగ్నిగుండం (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం:
గానం: యస్.పి..బాలు,పి.సుశీల
నటీనటులు: చిరంజీవి, సుమలత, సిల్క్ స్మిత
దర్శకత్వం: క్రాంతికుమార్
నిర్మాత: క్రాంతికుమార్
విడుదల తేది: 23.11.1984
పల్లవి:
చెంపకు చారెడు కళ్ళమ్మా
చెంగుకు చాలని ఒళ్లమ్మా
ఒంపుల సొంపుల ఒయ్యారమ్మా
చంపుకు తినకే బుల్లెమ్మా
నిను చూడగనే మతి పోయినదే
కను గీటగనే కసి పెరిగిందే పిల్లో
చెంతకు చేరితె బావయ్యో
చెంగులు చాలవు లేవయ్యో
చీకటి చాటున సింగారయ్యో
సిగ్గులు దోచుకు పోకయ్యో
తడి పోద్దులలో పొడి చేరెనులే
పొడి కోరికలే సుడి రేగెనులేవయ్యో
చరణం: 1
కన్ను సోకిన్నాడే కట్టూతప్పింది
చేయి తాకిన్నాడే చెంగు జారింది
ముట్టు కుంటే కట్టూ బొట్టూ ఏమవుతాదో
పక్కా కొచ్చిన్నాడే పట్టూతప్పింది
గూడుదాటిన్నాడే గుట్టు చెదిరింది
ఒళ్లోకొస్తే ఒళ్ళు కాస్తా ఏమవుతాదో
జత కూడగనే జతులాడుకునే
చలి వేడుకలో తొలి కోరికలే చాలే
చెంపకు చారెడు కళ్ళమ్మా
చెంగుకు చాలని ఒళ్లమ్మా
ఒంపుల సొంపుల ఒయ్యారమ్మా
చంపుకు తినకే బుల్లెమ్మా
నిను చూడగనే మతి పోయినదే
కను గీటగనే కసి పెరిగిందే పిల్లో
చెంతకు చేరితె బావయ్యో
చెంగులు చాలవు లేవయ్యో
చీకటి చాటున సింగారయ్యో
సిగ్గులు దోచుకు పోకయ్యో
తడి పోద్దులలో పొడి చేరెనులే
పొడి కోరికలే సుడి రేగెనులేవయ్యో
చరణం: 2
ఈడు వచ్చిన్నాడే ముద్దు కోరింది
ఇద్దరయ్యిన్నాడే పొద్దుజారింది
మూడు ముళ్ళు వేసేలోగా ఏమవుతాదో
మిసమోచ్చిన్నాడే ఆసపుట్టింది
మిర్రి చుసిన్నాడే అగ్గిపుట్టింది
కమ్ముకొచ్చి కౌగిలిస్తే ఎట్టుంటాదో
పొగమంచులలో పొగరెందుకురో
సోగాసంచులలో వగలందుకు పోరాదా
చెంపకు చారెడు కళ్ళమ్మా
చెంగుకు చాలని ఒళ్లమ్మా
ఒంపుల సొంపుల ఒయ్యారమ్మా
చంపుకు తినకే బుల్లెమ్మా
నిను చూడగనే మతి పోయినదే
కను గీటగనే కసి పెరిగిందే పిల్లో
చెంతకు చేరితె బావయ్యో
చెంగులు చాలవు లేవయ్యో
చీకటి చాటున సింగారయ్యో
సిగ్గులు దోచుకు పోకయ్యో
తడి పోద్దులలో పొడి చేరెనులే
పొడి కోరికలే సుడి రేగెనులేవయ్యో