చిత్రం: అమ్మో ఒకటోతారీకు (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఉదిత్ నారాయణ్ , మహాలక్ష్మి అయ్యర్
నటీనటులు: శ్రీకాంత్ , రాశి, సురేష్ , ముంతాజ్ , ఎల్.బి.శ్రీరామ్
దర్శకత్వం: ఇ. వి.వి.సత్యనారాయణ
నిర్మాతలు: ఇ. వి.వి.సత్యనారాయణ
విడుదల తేది: 20.10.2000
పల్లవి:
నీ ఆకుపచ్చ కోక మీద బుల్ బుల్ తార తుమ్మెదై వాలనా
నీ పారిజాత ఛాతిమీద ప్రేమకుమారా గువ్వనై దాగనా
ఎంత వాత లగేసుకెళ్లి లవ్ లో దించేయ్నా
తస్సాదియ్య తమాషా చూసి పొగరే అనిచెయ్నా
సుబ్బులు ఓయ్ సుబ్బులు అరె పిండిన పండార బుగ్గలు
ఓ అబ్బులు ఓరబ్బులు ఇక చాలిక చలింక గంతులు
వేశాడే వేశాడే పిల్లడు మంత్రం వేశాడే వేశాడే పిల్లడు
పడ్డావే పడ్డావే అమ్మడు వలలో పడ్డావే పడ్డావే అమ్మడు
నీ ఆకుపచ్చ నీ ఆకుపచ్చ
నీ ఆకుపచ్చ కోక మీద బుల్ బుల్ తార తుమ్మెదై వాలనా
నీ పారిజాత ఛాతిమీద ప్రేమకుమారా గువ్వనై దాగనా
చరణం: 1
ఓసిని సన్నని నడుము ఊరినే ఊరిస్తోందే
బరువుతో వాలిన వెన్ను కళ్లనే కటేస్తోందే
నెడుమొంపులే నీ కేప్ గా మార్చేయనా
ఆ గమ్మత్తులో శుభమస్తని గుమ్మెత్తగా
అవసరం ఇద్దరిదీ కురవని పిల్లా జల్ని
అదరహో అన్నపుడే తిరుగు నీ పనిలోకెళ్లి
అబ్బులు ఓయ్ అబ్బులు చాలించు సన్నాయి నొక్కులు
సుబ్బులు నా సుబ్బులు మోగిపోవాలే మురిపాల మువ్వలు
నీ ఆకుపచ్చ నీ ఆకుపచ్చ
నీ ఆకుపచ్చ కోక మీద బుల్ బుల్ తార తుమ్మెదై వాలనా
నీ పారిజాత ఛాతిమీద ప్రేమకుమారా గువ్వనై దాగనా
చరణం: 2
జంటలేకుంటే నిదర పట్టని వయసొచ్చిందోయ్
పువ్వులా వెచ్చని సొగసే విందులా కవ్విస్తుందోయ్
తలదిండు నేనుండనా మండోదరి
పరువాలనే జోకొట్టనా నవమాధురి
మిలీనియం మన్మధుడా ఇరగదియ్ చుమ్మా చుమ్మా
చిలక సై అందంటే ఆదరదా కొమ్మా రెమ్మా
అబ్బులు ఓయ్ అబ్బులు మోగించమన్నాయి డ్రమ్ములు
సుబ్బులు ఏయ్ సుబ్బులు ఇక ఠారెత్తి పోవాలె సిగ్గులు
వేశాడే వేశాడే పిల్లడు మంత్రం వేశాడే వేశాడే