చిత్రం: అసాధ్యుడు (1968)
సంగీతం: టి.చలపతి రావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.జానకి
నటీనటులు: కృష్ణ , వాణిశ్రీ, కె.ఆర్.విజయ
దర్శకత్వం: వి.రామచంద్ర రావు
నిర్మాతలు: కాంతారావు, యస్. హెచ్. హుస్సేన్
విడుదల తేది: 01.01.1968
పల్లవి:
కలలే కన్నానురా ఆశతో ఉన్నానురా
త్వరగా రావేమిరా
కలలే కన్నానురా
వెన్నెల్లో ఈ రేయి విరబూసి ఉందోయ్
నీలాల కనుదోయి నిన్నే వెతికేనోయి
సొగసులన్నీ దోచుకో నన్ను నీలో దాచుకో
కలలే కన్నానురా
చరణం: 1
నా సిగ్గు దోచేవు నను చూసి నవ్వేవు
మెరుపల్లె మెరిసేవు మురిపించి పోయేవు
నా సిగ్గు దోచేవు నను చూసి నవ్వేవు
మెరుపల్లె మెరిసేవు మురిపించి పోయేవు
కనులముందే ఉండిపో మనసు నిండా నిండిపో
కలలే కన్నానురా
చరణం: 2
పులకించే నా మేను ఏమేమో కోరేను
నే చేర రాలేను ఒంటరిగా మనలేను
పులకించే నా మేను ఏమేమో కోరేను
నే చేర రాలేను ఒంటరిగా మనలేను
వలపు పొంగే వేళరా నీవు నాతో చేరరా
కలలే కన్నానురా ఆశతో ఉన్నానురా
త్వరగా రావేమిరా
కలలే కన్నానురా