చిత్రం: బాలకృష్ణుడు (2017)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: శ్రీవల్లి
గానం: అనురాగ్ కులకర్ణి, సాహితి చాగంటి
నటీనటులు: నరారోహిత్ , రెజీనా కసండ్ర
దర్శకత్వం: పవన్ మల్లెల
నిర్మాతలు: బి.మహేంద్ర బాబు, ముసునూరి వంశీ, శ్రీ వినోద్ నందమూరి
విడుదల తేది: 2017
రెండే రెండు కళ్ళు చాలవుగా
సంద్రంలా నా గుండె కన్నీళ్లు
రెండే రెండు కళ్ళు ఆగవుగా
ఊపిరినే నలిపేసే ఎక్కిళ్ళు
ఏమని నిమిషాన్ని అడగను నేను
నువులేని ఈ సున్యాన్ని ఏమనుకోను
మనసెంతో బాగుంది ఎప్పటివరకు
చేజారిపోయింది అశేపడకు
నీ రెక్కలు నాకిచ్చి నా స్వప్నము కదిలించి
సంతోషం తెలిశాక వెలిపోగలమా
నా రెప్పల బరువు నీ ఊసులు నడుగు
నా ప్రేమకు బదులు ఈ ప్రశ్నకు తెలుసు
రెండే రెండు కళ్ళు ఎందుకనో
కన్నీళ్లే వదిలేసే నన్ను
రెండే రెండు కళ్ళు ఎందుకని
నిలదీసి నన్ను అడిగెను
ఈ దూరం నీ దూరం తెలిసేలోపు
నీ ధ్యాసతో నా శ్వాసను కలిపేశావు
బాగుందే బాగుందే ఇప్పటివరకు
ఇకపైన కనపడదు మనసే పడకు
నీ నవ్వుల అద్దంలో నను నేను చూశాక
వెలితేదో తెలిసిందే వెలిపోయాక
నువ్వులేని రేపు ఏం తోచదు నాకు
తొలిసారి నాలో ఎండమావులు