చిత్రం: బెట్టింగ్ బంగార్రాజు (2010)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: దీపు , ప్రణవి
నటీనటులు: అల్లరి నరేష్ , నిధి ఓజ
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఇ. సత్తిబాబు
నిర్మాత: రామోజీరావు
విడుదల తేది: 09.04.2010
పల్లవి:
నీలి మేఘం నీ లోకం
నేల మూలలు నా జగం
వేల మెరుపులు నీ సొంతం
వీలుకాదది పొందటం
జల్లై నీలిమేఘం నేల ఒడిలో చేరగా
నీలా మెరుపుకైనా దారి చూపే వీలుందా
ఏమి అర్ధంకాని గుండె అద్దంలోని
ఆశలేవో చూస్తున్నా
తేనె కెరటాలున్న పాలసంద్రం ముందు
ఈత రాదని అంటున్నా
నీలి మేఘం నీ లోకం
నేల మూలలు నా జగం
చరణం: 1
బంగారంలా నవ్వే బొమ్మనీ బొమ్మనీ చూశామని
సంతోషంతో తుళ్ళే కళ్ళకి వేసేదెలా సంకెళ్లని
రెప్ప సంకెళ్లు వెయ్యాలి అనుకున్నా
స్వప్నలోకంలో సందళ్ళు ఆగేనా
స్వప్నం సత్యంగా ఇంతింత దగ్గరైనా
దూరం అవుతావా తాకేంత వీలున్నా
కోనీటిపై చందమామని చేయి తాకితే అది అందునా
అరచేతిపై ఉన్న గీతని చేయి తకదా ఔనా
ఏమి అర్ధంకాని గుండె అద్దంలోని
ఆశలేవో చూస్తున్నా
తేనె కెరటాలున్న పాలసంద్రం ముందు
ఈత రాదని అంటున్నా
చరణం: 2
తీరంనుండి ఎంతో హాయిగా కనిపించవా నది ఒంపులో
తీరం దాటామంటే మాయగా మూసిరేయవా
మరి ముంపులూ
ఎన్నో పంచేటి ఉద్దేశం ఉన్న మదికి
దీన్ని ముంచేటి ఆవేశం రాదెన్నటికి
ఏదో అందించే ఆరటంలో నువ్వుంటే
రారా రమ్మంటు ఆహ్వానం అందునంతే
చిరుగాలిని చిన దోసిలి బంధించదే ఓ ప్రాణమా
నీ శ్వాసలో కలిపేసుకో విడదీయడం తరమా
ఏమి అర్ధంకాని గుండె అద్దంలోని
ఆశలేవో చూస్తున్నా
తేనె కెరటాలున్న పాలసంద్రం ముందు
ఈత రాదని అంటున్నా
నీలి మేఘం నీ లోకం
నేల మూలలు నా జగం
వేల మెరుపులు నీ సొంతం
వీలుకాదది పొందటం