చిత్రం: బుద్ధిమంతుడు (1969) సంగీతం: కె.వి.మహదేవన్ నటీనటులు: నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణంరాజు, విజయనిర్మల దర్శకత్వం: బాపు నిర్మాత: యన్.యస్.మూర్తి విడుదల తేది: 20.09.1969
Songs List:
భూమ్మీద సుఖపడితే పాట సాహిత్యం
చిత్రం: బుద్ధిమంతుడు (1969) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: భూమ్మీద సుఖపడితే తప్పులేదురా బులబాటం తీర్చుకుంటే తప్పులేదురా చరణం: 1 పరలోకంలో దొరికే అమర సుఖాలు-ఈ నరలోకంలో పొందిన ముప్పులేదురా... ముప్పులేదురా...ముప్పులేదురా...ముప్పులేదురా... తప్పేలేదురా తప్పేలేదురా తప్పేలేదురా చరణం: 2 చచ్చేక దొరికే ఆ రంభకన్నా -ఇప్పుడు నచ్చినట్టి నెరజాణే భల్ అన్నులమిన్న ఒక్కలాంటి వాళ్ళురా జాజిపూవ్వూ ఆడపిల్లా వాడిపోకముందే వాటిని అనుభవించరా... తప్పేలేదురా తప్పేలేదురా తప్పేలేదురా చరణం: 3 అరకు రాణి గుండె తలుపు తట్టుతూందిరా-నువ్వు ఆలస్యం చేయకుండ ఆట ఆడరా- మధువు ముందు అమృతంలో మహిమ లేదురా -ఈ మధువును కాదన్న వాడు మనిషి- కాదురా-మనిషే కాదురా మనిషే కాదురా మనిషే కాదురా మనిషే కాదురా
హవ్వారే హవ్వా పాట సాహిత్యం
చిత్రం: బుద్ధిమంతుడు (1969) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: హవ్వారే హవ్వా హైలేసో సో సో... దాని యవ్వారమంతా హైలేసో... చరణం: 1 పచ్చిమిరపకాయలాంటి పడుచు పిల్లరోయ్ దాని పరువానికి గరువానికి పగ్గమేయరో... వగలమారి చెప్పరాని పొగరు మోతురోయ్....ఆ వన్నెలాడి వుడుక్కుంటే వదలమోకురోయ్... చరణం: 2 ఇంటికెడితే నిన్ను చూచి నవ్వుతుందిరోయ్-దాని యెంటబడితే కంటబడితే కసురుతుంది రోయ్- టక్కరి టెక్కులపిల్ల పడవయెక్కెరోయ్- టెక్కంతా ఎగిరిపోయి ఎక్కి ఎక్కి ఏడ్చెరోయ్ ఓయ్ ఓయ్ హాయ్ చరణం: 3 చూడబోతే అవ్వాయి చువ్వలాంటిదోయ్- జోడు కూడబోతే కులుకులాడి గువ్వలాంటిదోయ్ జాంపండులాంటి గుంట జట్టుకట్టరో -అది జారిపోతే దారికాసి పట్టు పట్టరోయ్
టా టా వీడుకోలు పాట సాహిత్యం
చిత్రం: బుద్ధిమంతుడు (1969) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: టా టా వీడుకోలు గుడ్ బై ఇంక సెలవు తొలినాటి స్నేహితులారా! చెలరేగే కోరికలారా! చరణం: 1 ప్రియురాలి వలపులకన్నా నునువెచ్చనిదేది లేదని నిన్నను నాకు తెలిసింది - ఒక చిన్నది నాకు తెలిపింది ఆ ప్రేమ నగరుకే పోతాను - పోతాను - పోతాను ఈ కామనగరుకు రాను - ఇక రాను చరణం: 2 ఇచ్చుటలో వున్న హయి - వేరెచ్చటనూ లేనే లేదని లేటుగ తెలుసుకున్నాను - నా లోటును దిద్దుకొన్నాను ఆ స్నేహ నగరుకే పోతాను పోతాను పోతాను- ఈ మోహ నగరుకు రాను ఇక రాను... చరణం: 3 మధుపాత్రకెదలొ ఇంక ఏ మాత్రం చోటులేదని.... మనసైన పిల్లే చెప్పింది - నా మనసంతా తానై నిండింది నే రాగనగరుకే పోతాను అనురాగనగరుకే - పోతాను
గుట్టమీద గువ్వ కూసింది పాట సాహిత్యం
చిత్రం: బుద్ధిమంతుడు (1969) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల, పి.సుశీల పల్లవి: గుట్టమీద గువ్వ కూసింది కట్టమీదకవుజు పలికింది గుడిలోన జేగంట మోగింది నా గుండెలో తొలివలపు పండింది చరణం: 1 నల్ల నల్లాని మబ్బు నడిచింది తెల్లా తెల్లాని అంచు తోచింది చనువు జలరేకులై వెలిగింది చల్లా చల్లాని జల్లు కురిసింది చరణం: 2 కొమ్మమీద వాలి గోరింక కమ్మ కమ్మని ఊసులాడింది గోరింక తానింక గూడు కట్టకపోతె కొమ్మా ఎంతో చిన్నబోతుంది కొమ్మా ఎంతో చిన్నబోతుంది చరణం: 3 సన్నగాజుల రవళి పిలిచింది సన్నగాజుల దండ వేచింది మనసైన జవరాలే వలచింది మనుగడే ఒక మలుపు తిరిగింది మనుగడే ఒక మలుపు తిరిగింది
అల్లరి పెడతారే పిల్లా పాట సాహిత్యం
చిత్రం: బుద్ధిమంతుడు (1969) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: కొసరాజు గానం: పిఠాపురం , స్వర్ణలత పల్లవి: అల్లరి పెడతారే పిల్లా అల్లరి పెడతారే అమ్య మ్య మ్య మ్యా అమ్మగారు పూజల్లో పడితే అయ్యగారు బేజారయిపోతే పుట్టక పోతారా పిల్లలు.. పుట్టక పోతారా వుయ్ వుయ్ వుయ్ వుయ్ దేవుడిచ్చిన పిప్పే ఉంటే ఎప్పటికైనా తప్పనిసరిగా చరణం: 1 మనిషి ప్రయత్నం కావాలే ! కావాలే దేవుడు సాయం రావాలే ! రావాలే వారలంటూ వర్జాలంటూ ఒక్క పొద్దులని వంకలు చెబుతూ వాయిదాలతో ప్రాణం దీస్తూ మడిగట్టుక నువ్ కూర్చుంటే ఇక చరణం: 2 సంతు లేనిదే కొంప మునగదూ వుయ్ వుయ్ వుయ్ సంపాదన కుప్పలు పడిపోదూ వుయ్ వుయ్ వుయ్ జనాభాను తగ్గించాలనీ మన నాయకులనేది నీకు వినబడదా చరణం: 3 గొడ్డు రాలని నిన్నంటారే ! అంటారే పాపి వీడని నన్నంటారే ! అంటారే ఎలాగైనా ఒక కాయ గాస్తే మన ఇద్దరిని శెహబాష్ అంటారే అలాగా... శహభాష్
తోటలోకి రాకురా పాట సాహిత్యం
చిత్రం: బుద్ధిమంతుడు (1969) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: దాశరధి గానం: పి.సుశీల పల్లవి: తోటలోకి రాకురా తుంటరి తుమ్మెదా, గడసరి తుమ్మెదా మామల్లి మనసెంతో తెల్లనిది అది ఏ వన్నెలేచిన్నెలెరుగనిది- చరణం: 1 కన్నుసైగ చేయకురా కామినీ చోరా గోపికాజారా మా రాధ అనురాగం మారనిది అది ఏ రాసకేళిలోన చేరనిది చరణం: 2 జిలుగుపైట లాగకురా తొలకరి తుమ్మెదా,చిలిపి తుమ్మెదా కన్నెసిగ్గు మేలిముసుగు వీడనిది- అది ఇన్నాళ్ళు ఎండకన్నెరుగనిది చరణం: 3 రోజు దాటి పోగానే జాజులు వాడునురా- మోజులు వీడునురా కన్నెవలపు సన్నజాజి వాడనిది అది ఎన్నిజన్మలైనా వసివాడనిది
వేయి వేణువుల మ్రోగేవేళ పాట సాహిత్యం
చిత్రం: బుద్ధిమంతుడు (1969) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: దాశరధి గానం: ఘంటసాల పల్లవి: వేయి వేణువుల మ్రోగేవేళ హాయి వెల్లువై పొంగేవేళ రాసకేళిలొ తేలేవేళ రాధమ్మను లాలించే వేళ నను పాలింపగ నడచీ వచ్చితివా గోపాలా మొరలాలింపగ తరలీ వచ్చితివా... గోపాలా చరణం: 1 అర చెదరిన తిలకముతో అల్లదిగో రాధమ్మ అరజారిన పయ్యెదతో అదిగదిగో గోపెమ్మా ఎరుపెక్కిన కన్నులతో ఇదిగిదుగో సత్యభామ పొదపొదలో ఎద ఎదలో నీ కొరకై వెదుకుచుండగా చరణం: 2 కంసుని చెరసాలలో ఖైదీవై పుట్టావు కాంతల కౌగిళ్ళలో ఖైదీవై పెరిగావు కరకు రాతి గుళ్లలో ఖైదీవై నిలిచావు ఈభక్తుని గుండెలో ఖైదీగా వుండాలని నను పాలింపగ నడచి వచ్చితివా మొరలాలింపగ తరలీ వచ్చితివా... మొరలాలింపగ తరలీ వచ్చితివా...గోపాల నను పాలింపగ నడచి వచ్చితివా
గుడిలో ఏముందీ బాబూ పాట సాహిత్యం
చిత్రం: బుద్ధిమంతుడు (1969) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: కొసరాజు గానం: ఘంటసాల పల్లవి: గుడిలో ఏముందీ బాబూ - బడిలోనే ఉంది భుక్తి శక్తి కావాలంటే మానవ సేవ చెయ్యాలంటే దేవుడి పేరిట దోపిడి చేసే దళారులెందరో పెరిగారూ ముక్తి మత్తులో భక్తుల ముంచీ సర్వం భోంచేస్తున్నారూ నోరులేని ఆ దేవుడు పాపం నోరుగారి పోతున్నాడూ చదువుల పేరిట గుమాస్తాలనూ తయారు చేస్తూ వున్నారు ప్రభువుల్లాగా బ్రతికేవాళ్ళను బానిసలుగ చేస్తున్నారు ఉద్యోగాలకు వేటలాడమని ఊళ్ల పైకి తోలేస్తున్నారు చదవక పోతే మనిషి రివ్వునా చంద్రుని పైకి ఎగిరే వాడా ? గిర గిర తిరిగి వచ్చేవాడా ? దేవుడు చల్లగ చూడకపోతే అక్కడె గల్లంతై పోడా - ఆనవాలు చిక్కేవాడా ? చదువుల సారం హరియని హరికూడా చదవాలని చదువుల మర్మం హరియని ఆ హరికీ గురువుండాలనీ హరియే సర్వస్వమ్మని చదువే సర్వస్వమ్మనీ హరిభక్తుడు ప్రహ్లాదుడు మునుపే బల్లగుద్ది చెప్పాడు ఆ హరియే శ్రీ కృష్ణుడుగా వచ్చీ బడిలో కూర్చుని చదివాడు యీ బడిలో కూర్చుని చదివాడు చదివాడూ చదివాడూ చదివాడూ
చిత్రం: బుద్ధిమంతుడు (1969)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: కొసరాజు
గానం: పిఠాపురం , స్వర్ణలత
నటీనటులు: నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణంరాజు, విజయనిర్మల, గరికపాటి వరలక్ష్మి
దర్శకత్వం: బాపు
నిర్మాత: యన్.యస్.మూర్తి
విడుదల తేది: 20.09.1969
పల్లవి:
అల్లరి పెడతారే పిల్లా
అల్లరి పెడతారే అమ్య మ్య మ్య మ్యా
అమ్మగారు పూజల్లో పడితే
అయ్యగారు బేజారయిపోతే
పుట్టక పోతారా పిల్లలు.. పుట్టక పోతారా
వుయ్ వుయ్ వుయ్ వుయ్
దేవుడిచ్చిన పిప్పే ఉంటే
ఎప్పటికైనా తప్పనిసరిగా
చరణం: 1
మనిషి ప్రయత్నం కావాలే ! కావాలే
దేవుడు సాయం రావాలే ! రావాలే
వారలంటూ వర్జాలంటూ
ఒక్క పొద్దులని వంకలు చెబుతూ
వాయిదాలతో ప్రాణం దీస్తూ
మడిగట్టుక నువ్ కూర్చుంటే ఇక
చరణం: 2
సంతు లేనిదే కొంప మునగదూ వుయ్ వుయ్ వుయ్
సంపాదన కుప్పలు పడిపోదూ వుయ్ వుయ్ వుయ్
జనాభాను తగ్గించాలనీ మన
నాయకులనేది నీకు వినబడదా
చరణం: 3
గొడ్డు రాలని నిన్నంటారే ! అంటారే
పాపి వీడని నన్నంటారే ! అంటారే
ఎలాగైనా ఒక కాయ గాస్తే
మన ఇద్దరిని శెహబాష్ అంటారే
అలాగా... శహభాష్
******* ******** *******
చిత్రం: బుద్ధిమంతుడు (1969)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల
పల్లవి:
గుడిలో ఏముందీ బాబూ - బడిలోనే ఉంది
భుక్తి శక్తి కావాలంటే
మానవ సేవ చెయ్యాలంటే
దేవుడి పేరిట దోపిడి చేసే
దళారులెందరో పెరిగారూ
ముక్తి మత్తులో భక్తుల ముంచీ
సర్వం భోంచేస్తున్నారూ
నోరులేని ఆ దేవుడు పాపం
నోరుగారి పోతున్నాడూ
చదువుల పేరిట గుమాస్తాలనూ
తయారు చేస్తూ వున్నారు
ప్రభువుల్లాగా బ్రతికేవాళ్ళను
బానిసలుగ చేస్తున్నారు
ఉద్యోగాలకు వేటలాడమని
ఊళ్ల పైకి తోలేస్తున్నారు
చదవక పోతే మనిషి రివ్వునా
చంద్రుని పైకి ఎగిరే వాడా ?
గిర గిర తిరిగి వచ్చేవాడా ?
దేవుడు చల్లగ చూడకపోతే అక్కడె
గల్లంతై పోడా - ఆనవాలు చిక్కేవాడా ?
చదువుల సారం హరియని
హరికూడా చదవాలని
చదువుల మర్మం హరియని
ఆ హరికీ గురువుండాలనీ
హరియే సర్వస్వమ్మని
చదువే సర్వస్వమ్మనీ
హరిభక్తుడు ప్రహ్లాదుడు మునుపే బల్లగుద్ది చెప్పాడు
ఆ హరియే శ్రీ కృష్ణుడుగా వచ్చీ
బడిలో కూర్చుని చదివాడు
యీ బడిలో కూర్చుని చదివాడు
చదివాడూ చదివాడూ చదివాడూ
******* ******** *******
చిత్రం: బుద్ధిమంతుడు (1969)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, పి.సుశీల
పల్లవి:
గుట్టమీద గువ్వ కూసింది
కట్టమీదకవుజు పలికింది
గుడిలోన జేగంట మోగింది
నా గుండెలో తొలివలపు పండింది
చరణం: 1
నల్ల నల్లాని మబ్బు నడిచింది
తెల్లా తెల్లాని అంచు తోచింది
చనువు జలరేకులై వెలిగింది
చల్లా చల్లాని జల్లు కురిసింది
చరణం: 2
కొమ్మమీద వాలి గోరింక
కమ్మ కమ్మని ఊసులాడింది
గోరింక తానింక గూడు కట్టకపోతె
కొమ్మా ఎంతో చిన్నబోతుంది
కొమ్మా ఎంతో చిన్నబోతుంది
చరణం: 3
సన్నగాజుల రవళి పిలిచింది
సన్నగాజుల దండ వేచింది
మనసైన జవరాలే వలచింది
మనుగడే ఒక మలుపు తిరిగింది
మనుగడే ఒక మలుపు తిరిగింది
******* ******** *******
చిత్రం: బుద్ధిమంతుడు (1969)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల
పల్లవి:
హవ్వారే హవ్వా హైలేసో సో సో...
దాని యవ్వారమంతా హైలేసో...
చరణం: 1
పచ్చిమిరపకాయలాంటి పడుచు పిల్లరోయ్
దాని పరువానికి గరువానికి పగ్గమేయరో...
వగలమారి చెప్పరాని పొగరు మోతురోయ్....ఆ
వన్నెలాడి వుడుక్కుంటే వదలమోకురోయ్...
చరణం: 2
ఇంటికెడితే నిన్ను చూచి నవ్వుతుందిరోయ్-దాని
యెంటబడితే కంటబడితే కసురుతుంది రోయ్-
టక్కరి టెక్కులపిల్ల పడవయెక్కెరోయ్-
టెక్కంతా ఎగిరిపోయి ఎక్కి ఎక్కి ఏడ్చెరోయ్
ఓయ్ ఓయ్ హాయ్
చరణం: 3
చూడబోతే అవ్వాయి చువ్వలాంటిదోయ్- జోడు
కూడబోతే కులుకులాడి గువ్వలాంటిదోయ్
జాంపండులాంటి గుంట జట్టుకట్టరో -అది
జారిపోతే దారికాసి పట్టు పట్టరోయ్
******* ******** *******
చిత్రం: బుద్ధిమంతుడు (1969)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల
పల్లవి:
టా టా వీడుకోలు
గుడ్ బై ఇంక సెలవు
తొలినాటి స్నేహితులారా!
చెలరేగే కోరికలారా!
చరణం: 1
ప్రియురాలి వలపులకన్నా నునువెచ్చనిదేది లేదని
నిన్నను నాకు తెలిసింది - ఒక చిన్నది నాకు తెలిపింది
ఆ ప్రేమ నగరుకే పోతాను - పోతాను - పోతాను
ఈ కామనగరుకు రాను - ఇక రాను
చరణం: 2
ఇచ్చుటలో వున్న హయి - వేరెచ్చటనూ లేనే లేదని
లేటుగ తెలుసుకున్నాను - నా లోటును దిద్దుకొన్నాను
ఆ స్నేహ నగరుకే పోతాను పోతాను పోతాను-
ఈ మోహ నగరుకు రాను ఇక రాను...
చరణం: 3
మధుపాత్రకెదలొ ఇంక ఏ మాత్రం చోటులేదని....
మనసైన పిల్లే చెప్పింది - నా మనసంతా తానై నిండింది
నే రాగనగరుకే పోతాను
అనురాగనగరుకే - పోతాను
******* ******** *******
చిత్రం: బుద్ధిమంతుడు (1969)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల
పల్లవి:
భూమ్మీద సుఖపడితే తప్పులేదురా
బులబాటం తీర్చుకుంటే తప్పులేదురా
చరణం: 1
పరలోకంలో దొరికే అమర సుఖాలు-ఈ
నరలోకంలో పొందిన ముప్పులేదురా...
ముప్పులేదురా...ముప్పులేదురా...ముప్పులేదురా...
తప్పేలేదురా తప్పేలేదురా తప్పేలేదురా
చరణం: 2
చచ్చేక దొరికే ఆ రంభకన్నా -ఇప్పుడు
నచ్చినట్టి నెరజాణే భల్ అన్నులమిన్న
ఒక్కలాంటి వాళ్ళురా జాజిపూవ్వూ ఆడపిల్లా
వాడిపోకముందే వాటిని అనుభవించరా...
తప్పేలేదురా తప్పేలేదురా తప్పేలేదురా
చరణం: 3
అరకు రాణి గుండె తలుపు తట్టుతూందిరా-నువ్వు
ఆలస్యం చేయకుండ ఆట ఆడరా-
మధువు ముందు అమృతంలో మహిమ లేదురా -ఈ
మధువును కాదన్న వాడు మనిషి- కాదురా-మనిషే కాదురా
మనిషే కాదురా మనిషే కాదురా మనిషే కాదురా
******* ******** *******
చిత్రం: బుద్ధిమంతుడు (1969)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: దాశరధి
గానం: పి.సుశీల
పల్లవి:
తోటలోకి రాకురా తుంటరి తుమ్మెదా, గడసరి తుమ్మెదా
మామల్లి మనసెంతో తెల్లనిది
అది ఏ వన్నెలేచిన్నెలెరుగనిది-
చరణం: 1
కన్నుసైగ చేయకురా
కామినీ చోరా గోపికాజారా
మా రాధ అనురాగం మారనిది అది
ఏ రాసకేళిలోన చేరనిది
చరణం: 2
జిలుగుపైట లాగకురా
తొలకరి తుమ్మెదా,చిలిపి తుమ్మెదా
కన్నెసిగ్గు మేలిముసుగు వీడనిది-
అది ఇన్నాళ్ళు ఎండకన్నెరుగనిది
చరణం: 3
రోజు దాటి పోగానే
జాజులు వాడునురా-
మోజులు వీడునురా
కన్నెవలపు సన్నజాజి వాడనిది
అది ఎన్నిజన్మలైనా వసివాడనిది
******* ******** *******
చిత్రం: బుద్ధిమంతుడు (1969)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: దాశరధి
గానం: ఘంటసాల
పల్లవి:
వేయి వేణువుల మ్రోగేవేళ
హాయి వెల్లువై పొంగేవేళ
రాసకేళిలొ తేలేవేళ రాధమ్మను లాలించే వేళ
నను పాలింపగ నడచీ వచ్చితివా గోపాలా
మొరలాలింపగ తరలీ వచ్చితివా... గోపాలా
చరణం: 1
అర చెదరిన తిలకముతో అల్లదిగో రాధమ్మ
అరజారిన పయ్యెదతో అదిగదిగో గోపెమ్మా
ఎరుపెక్కిన కన్నులతో ఇదిగిదుగో సత్యభామ
పొదపొదలో ఎద ఎదలో నీ కొరకై వెదుకుచుండగా
చరణం: 2
కంసుని చెరసాలలో ఖైదీవై పుట్టావు
కాంతల కౌగిళ్ళలో ఖైదీవై పెరిగావు
కరకు రాతి గుళ్లలో ఖైదీవై నిలిచావు
ఈభక్తుని గుండెలో ఖైదీగా వుండాలని
నను పాలింపగ నడచి వచ్చితివా
మొరలాలింపగ తరలీ వచ్చితివా...
మొరలాలింపగ తరలీ వచ్చితివా...గోపాల
నను పాలింపగ నడచి వచ్చితివా