చిత్రం: చిన్నోడు (2000)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: కందికొండ
గానం: తాన్య , టిప్పు
నటీనటులు: సుమంత్, ఛార్మి
దర్శకత్వం: కణ్మణి
నిర్మాత: కాట్రగడ్డ లోకేష్ , సి.వి.శ్రీకాంత్
విడుదల తేది: 2000
పల్లవి:
కన్నుల్లో మెరిశావే చమకు చమకు మని పిల్లా నువ్వు
నామనసే దోచావే తళుకు తళుకు మంటూ
ఓ మసక మసక చీకటిలో వెన్నెల్లాగ వస్తావే
భేషుగ్గా రాకున్నా నే వెలుగే తెస్తాలే
హే ఊసులాడే చూపు చూపుతో వింతగా
ఉరకలేసే ఊహలే ఇలా
వలపు చేసే మెత్తమెత్తగా తొందర
మనసు వినదే మాటనే ఇలా
చరణం: 1
నీ బుగ్గల్లో ఆ ఎరుపే కవ్విస్తే
మదిని తొంగి చూసే ఏదో మాయ
నీ చూపుల్లో ఆ చురకే తాకేస్తే
వలపు నాలో చేరి నీ తోడయ్యా
So Give it up, Give it up, Give it up
నీ చిలిపి వన్నెలే ఇచ్చేసేయ్
Give it up, Give it up, Give it up
నీ ప్రేమలోన ముంచెయ్
అబ్బాబ్బా నోరార నీకంత దూకుడే వద్దంటా
నా వైపే వచ్చావంటే చిక్కు తప్పదంటా
చరణం: 2
నీ పెదవుల్లో ఆ మధువే అందిస్తే
కలిసి నీడలాగా నీతో వస్తా
నా అడుగుల్లో నీ అడుగే వేసేస్తే
ఎదకు ఆరిపోని వెలుగే ఇస్తా
So Give it up, Give it up, Give it up
నీ తేనె నవ్వు చెల్లేస్తావా
Give it up, Give it up, Give it up
నీ సోకులిచ్చి పోవా
ఐతే ఓకే ఓకే నీ తీపిముద్దు నాకిస్తావా
నా మనసే నిన్నే కోరి వెంట సాగుతాగా
కన్నుల్లో మెరిశావే చమకు చమకు మని పిల్లా నువ్వు
నామనసే దోచావే తళుకు తళుకు మంటూ
ఓ మసక మసక చీకటిలో వెన్నెల్లాగ వస్తావే
భేషుగ్గా రాకున్నా నే వెలుగే తెస్తాలే
హే ఊసులాడే చూపు చూపుతో వింతగా
ఉరకలేసే ఊహలే ఇలా
వలపు చేసే మెత్తమెత్తగా తొందర
మనసు వినదే మాటనే ఇలా