చిత్రం: చుట్టాలబ్బాయి (1990)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, రాజ్ సీతారాం, మనో, పి.సుశీల, యస్.జానకి, చిత్ర
నటీనటులు: కృష్ణ , రాధ, సుహాసిని, యస్.వరలక్ష్మి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: యన్. రామలింగేశ్వర రావు
విడుదల తేది: 1990
ఆటేసుకుందామా ఒక్కసారి వాటేసుకుందామా
ఆటేసుకుందామా ఒక్కసారి వాటేసుకుందామా
లోకులే చూసినా కాకులై కూసినా
ఊరంతా చూడంగా ఊరేగుతూ
వాటేసుకుందామా చాటుమాటు ఆటేసుకుందామా
వాటేసుకుందామా చాటుమాటు ఆటేసుకుందామా
కళ్ళతో ఏడ్చినా కడవలే నింపినా
ఊరంతా చూడంగా ఊరేగుతూ
అమ్మా...
ఏంటమ్మా... అహ హ హ
రాయంటి నా మొగుడు రంగమెక్కి ఆడినాడు
కొండంత నా మొగుడు కొంపముంచి పోయినాడు
చిత్రాంగి వలలోన చిక్కాడమ్మా
ఓ అమ్మా... నా ఖర్మా... హ హ హ
మొగుడంట మొగుడు
మొగుడు లేదు మొద్దు లేదు కానీ
నోరు మూసుకొని పదా
ఆ ఆటేసుకుందామా ఒక్కసారి వాటేసుకుందామా
వాటేసుకుందామా చాటుమాటు ఆటేసుకుందామా
మనసైన ఈ వేళ మనకేల ఆ గోల
చెలరేగిపోదాములే
ఊపొచ్చి మనముంటే ఆపేది ఎవరంట
మనమేకమౌదాములే
అహ కౌగిళ్ళలో విందుకే అబ్బా కవ్వింతగా ఉందిలే
అహ ఉప్పిల్లలో సందుకే అహ చిరుగాలి వెతికిందిలే
ఎదురేది మనకింక ఓ భామా
నిదురైన పోనంది ఈ ప్రేమా
అమ్మా...
ఏవిటే...
మనువాడి నావాడు మారుమనువు కోరినాడు
తాళిగట్టి నా మొగుడు ఎగతాళి చేసినాడు
ఈ సవతి పొరింక పడలేనమ్మా
ఓ యమ్మా... హ హ నా ఖర్మా...
కలికాలమే కలికాలం
వాళ్ళకి తగ్గ శాస్తి నే చాస్తాగా నువ్వూరుకో
వాటేసుకుందామా చాటుమాటు ఆటేసుకుందామా
ఆ ఆ ఆటేసుకుందామా ఒక్కసారి వాటేసుకుందామా
పొదరిల్లు రమ్మంటే ఎద వెళ్ళువౌతుంటే
సోదలింక మనకెందుకు
పగడాల నీ పెదవి పడుసు ముద్దిస్తుంటే
జగడాలు మనకెందుకు
అహ మరుమల్లె పూలెందుకు అహ మంచాన పరిచేసుకో
అహ వరసల్లే కలిపేసుకో అబ్బా వయసల్లే వాటేసుకో
ఎందాక యవ్వారం
అందాక నాదేలే వయ్యారం
అహ వాటేసుకుందామా చాటుమాటు ఆటేసుకుందామా
ఆ ఆటేసుకుందామా ఒక్కసారి వాటేసుకుందామా
కళ్ళతో ఏడ్చినా కడవలే నింపినా
ఊరంతా చూడంగా ఊరేగుతూ
ఆటేసుకుందామా ఒక్కసారి వాటేసుకుందామా...