చిత్రం: చుట్టాలబ్బాయి (2016)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రామజోగయ్య శాస్త్రి , శ్రీకృష్ణ , గీతామధురి
నటీనటులు: ఆది, నమితా ప్రమోద్, ప్రణీత
దర్శకత్వం: వీరభద్రం చౌదరి
నిర్మాతలు: తళ్లూరి రాము, తలారి వెంకట్
విడుదల తేది: 19.08.2016
పల్లవి:
పిపిపి డుండుం డోలు సన్నాయి
మోగేందుకు సిద్దంగున్నాయి
పెళ్లింట్లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యి
లగ్గం కానిద్దామన్నాయి
పట్టుచీరలన్ని ముస్తాబైపోయాయి
అందాల కనువిందుగ
పంచికట్టు లాల్చీ ప్యాంటు షర్టులన్నీ
జిగేలుమన్నాయి ఉల్లాసంగా
పందిళ్లు తోరణాలు వేసివున్నాయి
అక్షింతలు దీవెనలు ఆ గట్టిమేళం
ఎప్పుడంటు గోల పెట్టెస్తున్నాయి
చూడవోయి చుట్టాలబ్బాయి
మా పెళ్లింటికి పెద్దవి నువ్వోయి
మంచికి నీదెపుడు పైచేయి
చిలకల జంటకు కళ్యాణం చేద్దాం రావోయి
పిపిపి డుండుం డోలు సన్నాయి
మోగేందుకు సిద్దంగున్నాయి
పెళ్లింట్లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యి
లగ్గం కానిద్దామన్నాయి
చరణం: 1
కుందనాల బొమ్మండి
చందనాల కొమ్మండి
భూమ్మిద సీతమ్మె మా సుందరి
అంత మంచి రత్నాన్ని
ఎంచుకుంది ఎవరండి
మాయింటి రామయ్యే కాడా మరి
అందానికే అందం చెలి
అబ్బా మీ పెళ్లికొడుకు పంట పండింది
అదృష్టమంటే మీ పిల్లదేనండి
అందుచేత మా కుర్రాడి కంట పడింది
మాటల్లో పొద్దుపోతే లాభమేముంది
జీరాబెల్లాలు పెట్టి తాళిబొట్టు
కట్టకుంటే మూర్తమెల్లిపోతుంది
చూడవోయి చుట్టాలబ్బాయి
మా పెళ్లింటికి పెద్దవి నువ్వోయి
మంచికి నీదెపుడు పైచేయి
చిలకల జంటకు కళ్యాణం చేద్దాం రావోయి
చరణం: 2
అడ్డుగోడై తెరసెల్లా
ఆడుకుంటోందేంటిళ్ల
పిల్లాడి ఆత్రాన్ని ఆపేంతలా
సిగ్గుబరువై నిలువెళ్ల
తలవంచుకుందే పూబాల
అందాల వెన్నెల్ని దాచేంతల
ఇన్నాళ్లుగా వేచారుగా
ఇందాక వచ్చికూడా ఇన్నికష్టాల
కన్నెర్రగా కందేంతగా
దోబూచులాటలో అల్లాడిపోవాలా
బుగ్గల్లో చుక్కలు రెండు తొందరన్నాయి
మాంగల్యం తంతునా వియ్యాలు కలిపే
అయ్యవారి మంత్రమేగ తరువాయి
చూడవోయి చుట్టాలబ్బాయి
మా పెళ్లింటికి పెద్దవి నువ్వోయి
మంచికి నీదెపుడు పైచేయి
చిలకల జంటకు కళ్యాణం చేద్దాం రావోయి