Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Devudu Chesina Manushulu (1973)




చిత్రం: దేవుడు చేసిన మనుషులు (1973)
సంగీతం: రమేష్ నాయుడు
నటీనటులు: కృష్ణ, యన్.టి.రామారావు, జయలలిత, విజయనిర్మల, కాంచన, యస్.వరలక్ష్మి , (అతిధి నటులు: జమున మంజుల)
దర్శకత్వం: వి.రామచంద్రరావు
నిర్మాత: జి.హనుమంతరావు
విడుదల తేది: 09.08.1973



Songs List:



దేవుడు చేసిన మనుషుల్లారా.. పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడు చేసిన మనుషులు (1973)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల

పల్లవి:
దేవుడు చేసిన మనుషుల్లారా..
మనుషులు చేసిన దేవుళ్ళారా..
వినండి మనుషుల గోల.. కనండి దేవుడి లీల
వినండి మనుషుల గోల.. కనండి దేవుడి లీల

దేవుడు చేసిన మనుషుల్లారా..
మనుషులు చేసిన దేవుళ్ళారా..
వినండి మనుషుల గోల.. కనండి దేవుడి లీల
వినండి మనుషుల గోల.. కనండి దేవుడి లీల

గోవిందా హరిగోవిందా.. గోవిందా భజగోవిందా
గోవింద గోవింద హరిగోవిందా.. గోవింద గోవింద భజగోవిందా
గోవింద గోవింద హరిగోవిందా.. గోవింద గోవింద భజగోవిందా

ఆ..ఆ..ఆ..ఆ.. ఓం..

చరణం: 1
వెన్నదొంగ.. ఆ వెన్నదొంగ.. మా.. తొలిగురువు
మా తొలిగురువు..
తొలినుంచీ మా కులగురువు..
మా కులగురువు..
కోరిన కోరిక తీరాలంటే.. కోరక మోక్షం రావాలంటే
గోపాలునే సేవించాలి.. గోవిందునే ధ్యానించాలి
గోవిందా హరిగోవిందా.. గోవిందా భజగోవిందా
వినండి దేవుడి గోల కనండి మనుషుల లీల
    
దేవుడు చేసిన మనుషుల్లారా
మనుషులు చేసిన దేవుళ్ళారా
వినండి దేవుడి గోల కనండి మనుషుల లీల...

చరణం: 2
పేదల నెత్తురు తాల్చిన రూపం
బలిసిన జలగలు దాచిన పాపం
పేదల నెత్తురు తాల్చిన రూపం
బలిసిన జలగలు దాచిన పాపం

మానవులను పీడించే జబ్బు.. దేవతలను ఆడించే డబ్బు
మానవులను పీడించే జబ్బు.. దేవతలను ఆడించే డబ్బు
తెలుపో నలుపో జాన్ దేవ్.. ఆ తేడాలిక్కడ లేనేలేవ్
తెలుపో నలుపో జానేదేవ్.. ఆ తేడాలిక్కడ లేనేలేవ్
లేనేలేవ్..
వినండి డబ్బుల గోల కనండి మనుషుల లీల
వినండి డబ్బుల గోల కనండి మనుషుల లీల

హే.. యహా..
గాలిబుడగ జీవితం ఓటి పడవ యవ్వనం
గాలిబుడగ జీవితం ఓటి పడవ యవ్వనం

నిన్న మరల రాదు రాదు రాదు.. నేడే నిజం.. నేడే నిజం
నేడే నిజం..
రేపు మనది కాదు కాదు.. నేడే సుఖం.. నేడే సుఖం
సుఖం.. సుఖం.. నేడే సుఖం
కాసే బ్రహ్మానందం..అహా.. ఓ డోసే పరమానందం.. ఒహో..
ఆ.. కాసే బ్రహ్మానందం..అహా.. ఓ డోసే పరమానందం.. ఒహో..
ఆ.. కాసే బ్రహ్మానందం.. హ్మ్.. డోసే పరమానందం
ఆనందం పరమానందం.. ఆనందం బ్రహ్మానందం (4)
ఆనందం ఆనందం ఆనందం ఆనందం

వినండి గ్లాసుల గోల.. కనండి మనుషుల లీల
వినండి గ్లాసుల గోల.. కనండి మనుషుల లీల
దేవుడు చేసిన మనుషుల్లారా
మనుషులు చేసిన దేవుళ్ళారా
వినండి గ్లాసుల గోల.. కనండి మనుషుల లీల..

చరణం: 3
ఆలయాలలో వెలుతురు లేదు.. ఆకాశంలో చీకటి లేదు
ఆలయాలలో వెలుతురు లేదు.. ఆకాశంలో చీకటి లేదు
విమానాలలో విహరిస్తుంటే సముద్రాలనే దాటేస్తుంటే
విమానాలలో విహరిస్తుంటే సముద్రాలనే దాటేస్తుంటే

గుడిలో ఎందుకు రామయ్యా.. నిను విడుదల చేస్తాం రావయ్యా
గుడిలో ఎందుకు రామయ్యా.. నిను విడుదల చేస్తాం రావయ్యా
రామయ్యా.. రామయ్యా..
లేవయ్యా.. లేవయ్యా..

హ్యాండ్సప్..





తొలిసారి నిన్ను చూసాను నేను పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడు చేసిన మనుషులు (1973)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: దాశరధి
గానం: యస్. పి.బాలు

ఉ..ఊ..ఉఊ..ఉఊ..ఊ..హూ..ఉహూఉహూ..
లా..అహ..ఆ

తొలిసారి నిన్ను చూసాను నేను
నీ ప్రేమ పాశం లాగింది నన్ను
ఏ తారలోను నీ తీరు లేదు..
ఏ పువ్వులోనూ నీ నవ్వు లేదు..లేదు..లేదు

నీ బుగ్గ మీద మొగ్గ వేయు నిగ్గు చూసి..
తాజా గులాబి సిగ్గుతో తలవంచె చూడు..
నీ బుగ్గ మీద మొగ్గ వేయు నిగ్గు చూసి..
తాజా గులాబి సిగ్గుతో తలవంచె చూడు..

ఏ తారలోను నీ తీరు లేదు..
ఏ పువ్వులోనూ నీ నవ్వు లేదు..లేదు..లేదు

నీ చక్కనైన మేనిలోని ఛాయచూసి..
చిన్నారి కన్నె చేమంతి చిన్నబోయె నేడు

ఏ తారలోను నీ తీరు లేదు..
ఏ పువ్వులోనూ నీ నవ్వు లేదు..లేదు..లేదు

ఏ సుందరిలో కానరాని సోయగాలు
ఏ వయ్యారిలో లేని అందచందాలు

ఏ సుందరిలో కానరాని సోయగాలు
ఏ వయ్యారిలో లేని అందచందాలు

తనలోన కలిగి..మనసారా వలచే
చినదానికోసం వెతికేను నేను..నేను..నేను..



దోర వయసు చిన్నది.. పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడు చేసిన మనుషులు (1973)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: పి.సుశీల

పల్లవి:
ఏయ్..
అబ్బో..

దోర వయసు చిన్నది.. లరలలహ
భలే జోరుగున్నది... లరలలహ
దీని తస్సాదియ్యా కస్సుమంటున్నది కవ్విస్తూ ఉన్నదీ..

దోర వయసు చిన్నది.. లరలలహ
భలే జోరుగున్నది... లరలలహ
దీని తస్సాదియ్యా కస్సుమంటున్నది కవ్విస్తూ ఉన్నదీ..

దోర వయసు చిన్నది.. లరలలహ.. అహా..
అహా..

చరణం: 1
ఏయ్.. ఒళ్ళు ఎలా ఉంది?
ఒళ్ళా?
ఒళ్ళు ఝల్లుమంటుంది నిన్ను చూస్తే...
ఏదోలా ఉంటుందీ నిన్ను తాకితే
ఒళ్ళు ఝల్లుమంటుంది నిన్ను చూస్తే...
ఏదోలా ఉంటుందీ నిన్ను తాకితే
ఊఁహూఁ.. ఉంటది.. ఒక్కటిస్తే.. గూబ గుయ్... అంటది
ఒక్కటిచ్చి ఒక్కసారి నీ వాణ్ణి చేసికో
ఎన్నటికీ మరువలేని ఎన్నో సుఖాలందుకో..
ఛీ..పో..
అబ్బో..

దోర వయసు చిన్నది.. లరలలహ
భలే జోరుగున్నది... లరలలహ
దీని తస్సాదియ్యా కస్సుమంటున్నది కవ్విస్తూ ఉన్నదీ..

దోర వయసు చిన్నది.. లరల..
అహా.. అహా.. ఒహో..

చరణం: 2
ఒళ్ళు మండిపోతోంది నిన్ను చూస్తే
చెంప చెళ్ళు మంటుందీ హద్దు మీరితే
ఒళ్ళు మండిపోతోంది నిన్ను చూస్తే
చెంప చెళ్ళు మంటుందీ హద్దు మీరితే
అహాఁ.. అలాగా?
అలాగిలా అనుకోకు అందరిలా నన్నూ
చెఢామఢా పేలావో చెరిగేస్తా చూడు
అబ్బో...





వినరా అలనాటి వేణుగానం పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడు చేసిన మనుషులు (1973)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఘంటసాల , సుశీల 

వినరా అలనాటి వేణుగానం 




మసక మసక చీకటిలో.. పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడు చేసిన మనుషులు (1973)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యల్. ఆర్.ఈశ్వరి

మసక మసక చీకటిలో..మల్లె తోట వెనకాల
మసక మసక చీకటిలో..మల్లె తోట వెనకాల
మాపటేళ కలుసుకో..

నీ మనసైనది దొరుకుతుంది..నీ మనసైనది దొరుకుతుంది..
 దొరుకుతుంది..

ఓకే! యా!!
యా యా .. య య యా యా యా. .
యా యా .. య య యా యా యా ..
హా..ఆ..ఆ

మా దేశం వచ్చినవాడా..మా బొమ్మలు మెచ్చినవాడా!!
మా దేశం వచ్చినవాడా..మా బొమ్మలు మెచ్చినవాడా!!
తరతరాల అందాల..తరగని తొలిచందాల
తరతరాల అందాల..తరగని తొలిచందాల

ఈ భంగిమ నచ్చిందా??
ఆనందం ఇచ్చిందా??

ఐతే..

మసక మసక చీకటిలో..మల్లె తోట వెనకాల
మాపటేళ కలుసుకో..

నీ మనసైనది దొరుకుతుంది..నీ మనసైనది దొరుకుతుంది..
 దొరుకుతుంది..

ఓకే! యా!!
యా యా .. య య యా యా యా. .
యా యా .. య య యా యా యా ..
హా..ఆ..ఆ

చోద్యాలు వెతికేవాడా..సొగసు చూసి మురిసేవాడా!!
చోద్యాలు వెతికేవాడా..సొగసు చూసి మురిసేవాడా!!
కళ చేతికి దొరకాలంటే..నలుమూలలు తిరగాల!!

నీ ముందుకు రావాలా??
నీ సొంతం కావాలా??

ఐతే..

మసక మసక చీకటిలో..మల్లె తోట వెనకాల
మాపటేళ కలుసుకో..

నీ మనసైనది దొరుకుతుంది..నీ మనసైనది దొరుకుతుంది..
 దొరుకుతుంది..

ఓకే! యా!!
యా యా .. య య యా యా యా. .
యా యా .. య య యా యా యా ..
హా..ఆ..ఆ



నీదగ్గర ఏదో ఉంది పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడు చేసిన మనుషులు (1973)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యల్. ఆర్.ఈశ్వరి


నీదగ్గర ఏదో ఉంది 




దేవుడు చేసిన మనుషుల్లారా -2 పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడు చేసిన మనుషులు (1973)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల, యస్.పి.బాలు 

దేవుడు చేసిన మనుషుల్లారా

Most Recent

Default