Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Iddaru Asadhyule (1979)




చిత్రం: ఇద్దరూ అసాధ్యులే (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆత్రేయ, దాశరధి, వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు: కృష్ణ, రజినీకాంత్
దర్శకత్వం: కె.యస్.ఆర్.దాస్
నిర్మాతలు: జి.డి.ప్రసాదరావు, పి.శశిభూషణ్
విడుదల తేది: 25.01.1979



Songs List:



తల్లోకచోట - పిల్లోకచోట పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరూ అసాధ్యులే (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

తల్లోకచోట - పిల్లోకచోట
కొమ్మలేదట గూడు లేదట
ఏ వేటగాడో - విడదీసి నాడట

ఈ బ్రతుకే ఒక ఇది దేవుడు ఆదే పిల్లాట
మనుషులు మాకులు పరువులు, పక్షులు అన్నీ బొమ్మలట..
అన్నీ బొమ్మలట ॥బ్రతుకే॥ 

చేసిన త్యాగం చెరగని మచ్చై- చెరసాల పాలైనదీ కన్నతల్లి
అమ్మ చేతి అన్నానికి వెలియె అనాధ అయినదీ ఈ చిట్టితల్లి -
చెల్లెలుకాని చెల్లెలు కోసం - వెల్లువయిందో పాలవెల్లి
విడదీసినవా దెపడో కాని కలిసేదెపుడీ బ్రతుకులు మళ్ళీ

నెత్తురుకి తన నెత్తురు ఏదో గుర్తే నంటారు
నెత్తిన వ్రాసిన జిలుగు వ్రాతను గుర్తించేదెవరు
పామును కప్పను పులిని మేకను ప్రేమ కలుపుతుంది.
దేవుని ఆటకు ప్రేమ గీతమే నాంది పలుకుతుంది

ఎవరికెవరు చెల్లీ ఈ లోకంలో
ఎవరు నీకు తోడూ ఈ పయనంలో 
పసుపు కుంకుమతో మెట్టినింటికి సంపాలనుకుంటే
మనసులేని ఒక మానవ మృగము మట్టిని కలిపిందే
నోరులేని ఈ జీవాలే నీ బంధువులమ్మా
అని నీ కన్నీరే నీకు తర్పణమమ్మా




సంకురేత్రి సంబరాల జాతరోయి పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరూ అసాధ్యులే (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

సంకురేత్రి సంబరాల జాతరోయి
సందట్లో షోకిలాల వేటరోయి
చాటుందిరో నీకు చోటుందిరో
మాటిస్తే చాలు మంచి వేటుందిరో.

మాటిచ్చి తప్పినోళ్ళు చాలామంది
మనసిచ్చి చచ్చినోళ్ళు కొద్ది మంది 
మనసులేనిఘాట వోటిడప్పువంటిది
ఆమోతింటే అసలు సరుకు బయటపడతది

గురిచూసి కొట్టడం నీకు తెలుసు
ఎరవేసి పట్టడం నాకు తెలుసు
తెలుసు తెలుసన్న పిల్ల మనసు
అది తెరిచున్న ఇల్లని నాకు తెలుసు

జడ విప్పినానంటే వల ఔతది 
పైటిసిరినానంటే పలుపౌతది
పసుపద్దితే పలుపు తాళౌతది
వలపుంటే వలకన్న సుఖమేముంది




చినుకు చినుకు పడుతూ ఉంటే పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరూ అసాధ్యులే (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు , పి.సుశీల

పల్లవి: 
చినుకు చినుకు పడుతూ ఉంటే 
తడిసి తడిసి ముద్దౌతుంటే 
ఒదిగి ఒదిగి ఒకటై పోతు
ఒకరికొకరు చలిమంటైతే  - అయితే 
జోహారు జోహారు ఈ వానకు
ఈ హాయి లేదోయి ఏ జంటకూ

చినుకు చినుకు పడుతూ ఉంటే 
తడిసి తడిసి ముద్దవుతుంటే
ఒదిగి ఒదిగి ఒకటై పోతు
ఒకరికొకరు చలిమంటైతే  - ఐతే
జోహారు జోహారు ఈ వానకు
ఈ హాయి లేదోయి ఏ జంటకూ

చరణం: 1
చెయ్యి నడుము చుట్టేస్తుంటే 
చంప చంప నొక్కేస్తుంటే 
చిక్కు కురులు చిక్కవ్వేయదా
చెయ్యి నడుము చుట్టేస్తుంటే 
చంప చంప నొక్కేస్తుంటే 
చిక్కు కురులు చిక్కవ్వేయదా
ఆ ఊపిరాడలేదని నువ్వు 
ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే
జేజేలు జేజేలు ఈ రోజుకు
ప్రతిరోజు ఈ రోజు అయ్యేందుకూ

చినుకు చినుకు పడుతూ ఉంటే 
తడిసి తడిసి ముద్దవుతుంటే
ఒదిగి ఒదిగి ఒకటై పోతు
ఒకరికొకరు చలిమంటైతే  
జోహారు జోహారు ఈ వానకు
ఈ హాయి లేదోయి ఏ జంటకూ

చరణం: 2
ఒంపులన్ని తెలిసే మేరా
ఒంటికంటుకున్నది చీర
వదిలిపెడితె రట్టవుతుందిరా 
ఒంపులన్ని తెలిసే మేరా
ఒంటికంటుకున్నది చీర
వదిలిపెడితె రట్టవుతుందిరా 

గుట్టునువ్వు చెబుతూ ఉంటే 
కొట్టువేసి నే చూస్తుంటే 
బిగువైన పరువాణ్ణి ఆపేందుకు
పగ్గాలు లేవింక జంకేందుకు

చినుకు చినుకు పడుతూ ఉంటే 
తడిసి తడిసి ముద్దవుతుంటే
ఒదిగి ఒదిగి ఒకటై పోతు
ఒకరికొకరు చలిమంటైతే  
జోహారు జోహారు ఈ వానకు
ఈ హాయి లేదోయి ఏ జంటకూ




నదిలో అలనురా నడిచే కలనురా పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరూ అసాధ్యులే (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్. జానకి 

నదిలో అలనురా నడిచే కలనురా
నిలిచే నీడరా ఇక నీకో తోడురా
రారా .... కదలిరా .... కదలిరా... కదలిరా

పల్లవి లేని పాటను కాను
బదులే లేని ప్రశ్నను కాను
అడవిని కాచే వెన్నెల నేను
అన్నెం ఎరుగని పున్నెం నేను

ఇది తుదిరేయి నీకూ నాకూ
కలిపే యోగం లేదిక మనకు
ఉన్నది జామే ఊగిసలాడకు
కన్నె కోర్కెను కాదనకు




వేయకు గాలము పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరూ అసాధ్యులే (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆత్రేయ 
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి 

వేయకు గాలము - చేయకు గారాము
వెన్నెల చిన్నది. వెచ్చగ వెర్రిగ ఆడుతువుంచే ఝూము
ఆడుతువుంటే ఝూము- ఆటాడుతువుంటే ఝాము

ఉసిగొలిపే వయసుండాలి
శృతికలిపే మనసుండాలి
అందాల చిన్నది కోరే
అనువైన పొత్తుండాలి

అలాంటి మగవాడ్ని అరుదైన జతగాన్ని 
నే వెతుకుతున్నారో

నవ్వల్లే పూస్తుండాలి
గిలిగింతే పెడుతుండాలి
చీకట్లో చిరుదీపంలా
కన్నులకు కాంతివ్వాతి
రేపుల్లో మాపుల్లా -- మాపుల్లో రేపుల్లా
కలబోసి కోవాలిరోయ్ 




అందాల పాపకు ఆరేళ్ళు పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరూ అసాధ్యులే (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: దాశరథి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

అందాల పాపకు ఆరేళ్ళు
అందరి దీవన నూరేళ్ళు
దేవతలా దీవించంది
చెడు కళ్ళేవీ పడనివ్వకండి

పాప నవ్వితే దివ్వెలెందుకు
పాస పరికితే తేనెలెందుకు
పాప పుట్టిన ఈరోజే
పండుగలన్ని కలిసినరోజు
ఊగింది ఈ వేళ - మా మనసు ఉయ్యాలా

అమ్మా నాన్న ఆశల పంపై
ఆడుతు పాడుకు వుండాలి
కన్నుల ముందు వెన్నెల విందై
కళకళలాడురు పెరగాలి 
యేటేటా మానోట - ఈ పాటే పలకాలి

అందాల పాపకు ఆరేళ్ళు
అపుడే నిందెను నూరేళ్ళు
దీవించే ఓ దేవతలారా
దీవికే పాపను కొనిపోయారా

Most Recent

Default