Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kalam Marindi (1972)




చిత్రం: కాలం మారింది (1972)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
నటీనటులు: శోభన్ బాబు, శారద, అంజలీదేవి, చంద్రమోహన్, పుష్ప కుమారి
దర్శకత్వం: కె.విశ్వనాథ్
నిర్మాతలు: వాసిరాజు ప్రకాశం, బి. హనుమంతరావు
విడుదల తేది: 01.12.1972



Songs List:



ఏ తల్లి పాడేను జోల పాట సాహిత్యం

 
చిత్రం: కాలం మారింది (1972)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి 
గానం: ఘంటసాల, పి.సుశీల 

సాకి : 
పల్లె నిదురించేను తల్లి నిదురించేను
ప్రతిపాప తల్లి పొత్తిళ్ళ నిదురించేను
ఎవరికి నీవు కావాలి
ఎవరికి నీమీద జాలి ?

ఏ తల్లి పాడేను జోల
ఏ తల్లి ఊ పేను డోల ?
ఏ తల్లి పాడేను జోల ?
ఏ తల్లి ఊ పేను డోల ?
నీ ఇలు కొండలో కోనలో
నీ బ్రతుకు ఎండలో వానలో
లోకానికి నీవు దూరం
లోకాలతల్లికే భారం ॥ఎవరికి॥

కలువ పాపాయికి కొలను ఒడి వున్నది
చిలుకపాపాయికి చిగురు ఒడి వున్నది
ప్రాణమేలేని ఒక శిలకు గుడి వున్నది
పాపా .. నీకే.... అమ్మ ఒడిలేనిదీ గుడిలేనిదీ
ఏనాడు చేశావు పాపం - నీకు
ఏనాటిదీ కౄరశాపం.... ॥ఎవరికి॥



నిజం తెలుసుకోండీ పాట సాహిత్యం

 
చిత్రం: కాలం మారింది (1972)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దాశరథి 
గానం: రామక్రిష్ణ 

సాకి:
విగ్రహాలను ప్రతిష్టించమని వీధులకు తమ పేర్లు పెట్టమని
మన నాయకులెవరూ అనలేదండీ ఈ ఆలోచనలు
మన వేనండీ....
నిజం తెలుసుకోండీ.... యీ.... నిజం తెలుసుకోండీ
ఓ యువకుల్లారా  ఓ యువకుల్లాగా యీ విజం
తెలుసుకోండీ....
పేదలపాలిటి పెన్నిధి గాంధీ 
దీనులపాలిటి దేవుడు గాంధీ
అంటరానితనమై పీడించే 
అంటువ్యాధికే వైద్యుడు గాంధీ
అతని దారిలో నడవండి అతనికి శాంతిని చేకూర్చండి 

స్వతంత్రభారత సారధి నెహ్రూ తూర్పు పడమరల
సారధి నెహ్రూ
శాంతివిధాత జాతికి నేత  సామ్యవాద సంధాత నెహ్రూ
అతని బాటలో నడవండి అతని ఆశలూ తీర్చండీ

ఆంధ్రకేసరి ప్రకాశమూ ఆంగ్లేయులకూ సింహస్వప్నమూ
అతనిజీవితంత్యాగమయం ఆంధ్రుల ఐక్యత ఆతని ఆశయం
అతని దారిలో నడపండీ ఆంధ్రుల పేరూ నిలపండీ

వీరనారి మన ఇందిర ఆహ: విజయశంఖమూదిందిరా 
మన స్వాతంత్ర్యాన్ని హరించజూసిన 
శత్రులను అణచిందిరా
బాంగ్లా జాతిని నరహంతకుల బారినుండి కాచిందిరా
కోరస్ : ఇందిరా ! మన ఇందిరా 

మన నాయకులు కోరింది వెండి విగ్రహాలా?
వీధులకు తమ పేర్లా.... కాదు ....
కులమత బేధంలేని సమాజం-
ధనికుడు పేదలేని సమాజం
దోపిడి రాపిడిలేని సమాజం -
ద్రోహం మోసంలేని సమాజం
భారతదేశం ఒకటే ఒకటని ప్రపంచమంతా చాటాలి
వీరనాయకుల వారసులనుని పేరు ప్రతిష్టలు తేవాలి
వారి కలలన్నీ నిజం కావాలి



సన్నజాజిసొగసుంది పాట సాహిత్యం

 
చిత్రం: కాలం మారింది (1972)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి.సుశీల 

ఓ.... తొలకరి మెరుపులా
తొలివాన చినుకులా
యీ వేళ వచ్చావు ఎవరికోసం....?
ఇంకెవరికోసం
ఏమేమి తెచ్చావు యీ బావ కోసం

సన్నజాజిసొగసుంది జున్నులాంటివయసుంది
నిన్ను చూస్తే కరగిపోయే - వెన్నలాంటి
మనసుంది ఇంతకుమించి ఏమిలేదురా
బావా, యీ బతుకే యింక నీదిరా

సన్నజాజి సొగసుంటే జున్నులాంటి
వయంటే నన్ను చూస్తే కరిగిపోయే 
వెన్నలాంటి మనసుంటే అంతకు మించి
ఏమివద్దులేపిల్లా ఆమనసే ఎంతో ముదులే

బంగారు నగలేవీ పెట్టుకోనురా  పట్టంచు
చీరలేవీ కటుకోనురా గుండెలో మొలకెత్తే 
గోరువెచ్చని వలపే - పెదవుల భరణీలో
పొదిగి వంచినానురా! ఇంతకుమించి ఏమి
లేదురా బావా ఈవలపే యింకనీదిరా 

మిసమసలాడే నీ మేనే బంగారం - సిగ్గే 
కంచి పట్టు చీరకన్న సింగారం నీ పెదవుల
పొంగే తేనియవలపే  ముద్దులమూటలో
ముడిచిదాచుకొందునే  అంతకుమించి ఏమి
వద్దులే పిల్లా  ఆ మనసే ఎంతో ముద్దులే

రవ్వల మేడలంటే మనసులేదురా  
పువ్వుల పానుపంటే మోజులేదురా  
పచ్చని చేలలో పైరగాలి జోలలో ముచ్చటైన గూడుకట్టి
వెచ్చగ వుందామురా ఇంతకుమించి ఏమి
కోరనురా ఈ వరమొకటే చాలునురా 

రవ్వలు ఎందుకు నీ నవ్వులువుండగా
పువ్వులు ఎందుకు నీ పులకింతలుండగా 
వీడని బాసలే వాడని తీపెలుగా వెన్నెల గూడుకటి
వేయి జన్మలుందాము 
అంతకుమించి ఏమి కోరనులే 
ఆ చల్లని కాపురమే చాలునులే




మారలేదులే యీ కాలం పాట సాహిత్యం

 
చిత్రం: కాలం మారింది (1972)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దాశరథి 
గానం: సాలూరి రాజేశ్వరరావు

పల్లవి:
మారలేదులే యీ కాలం
మారలేదులే యీ లోకం
దీనులకు హీనులకు
తీరలేదులే యీ శోకం ॥ మార ॥

అందరిలో వుండేది ఒకే రకమైనా
అందరినీ సృష్టించింది ఒకే దైవమైనా
కులం పేరుతో మతం ముసుగులో
ప్రాణమున్న మనిషినే సమాధిచేశారే.... ॥ మార ॥

వారే నీవారు.... అనాధలు, అభాగ్యులు
వారే నీ బంధువులు.... బాధితులు, పీడితులు
కంటినీటితోనే తమ కడుపులను నింపుకొనే
అంటరాని వారు .... వారే నీవారు....

ఈ కోవెలలో యిక నీకు చోటు లేదమ్మా !
ఈ లోగిలిలో యిక నిలువనీడ లేదమ్మా !!



ఓం నమో నారాయణాయ పాట సాహిత్యం

 
చిత్రం: కాలం మారింది (1972)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి 
గానం:  పి.సుశీల 

ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ 
ఓం నమో నారాయణాయ 
ఆ శతసహస్ర మంటాహ్వానము నా కొరకేనా
ఆ శతసహస్ర వీణాగానము నా కొరకేనా 
ఆ శతశతసహస్ర శంపాప్రభా దివ్యమూ  నా కొరకేనా
మందహాస మధుర వదనాః శ్రీ సదనా !

ఇందురవి నయన ఫణిశయన గోవిందా !
అరవింద భవ పండిత పదనళిని గోవిందా !
విందారు మునియోగి బృందాః ముకుందా 
బృందార కార్చితా ఇందీవర శ్యామసుందరా 
భ క ప్రసన్న మందారః భువనాధారా
ఏదీ ఏదీ గఁగ కలిగిన పాదకంజాతమేదీ !
మెత్తని రమా కరములొ తిన చరణమేదీ 
నలువపుట్టిన నాభి నళినమేదీ
శ్రీ వత్స కౌస్తుభ శ్రీనివాసమ్మేడీ 
ఔనుగానీ, కృపాధానీ! నీ ఉరమునందేది



ఏమిటయ్య సరసాలు పాట సాహిత్యం

 
చిత్రం: కాలం మారింది (1972)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు
గానం: యస్.పి.బాలు, యల్.ఆర్.ఈశ్వరి

పల్లవి:
ఏమిటయ్య సరసాలు ఎందుకయ్య జల్సాలు
ఏమిటయ్య సరసాలు ఎందుకయ్య జల్సాలు
ఓ సోగ్గాడా ఆపవయ్య నీ అల్లరి చిల్లర వేషాలు
ఏమిటి పిల్లా నా తప్పు ఔనో కాదో నువు చెప్పు
ఏమిటి పిల్లా నా తప్పు ఔనో కాదో నువు చెప్పు
అదర గొట్టిన బెదర గొట్టిన వీడిపోదు మన వలపు

ఏమిటయ్య సరసాలు ఎందుకయ్య జల్సాలు

చరణం: 1
ఒళ్ళు ముద్దగా తడిసిపోయింది చలి చలిగా ఉన్నదిలే
ఈ నీలల్లోన ఏముందో సిగ్గేస్తూ ఉన్నదిలే
అందులో మజా ఉన్నదిలే అనుభవించితే తెలుసునులే
అందులో మజా ఉన్నదిలే అనుభవించితే తెలుసునులే
నిందమునిగిన వాళ్లకు మనకు చలి ఏమున్నదిలే

ఏమిటయ్య సరసాలు ఎందుకయ్య జల్సాలు
ఏమిటి పిల్లా నా తప్పు ఔనో కాదో నువు చెప్పు

చరణం: 2
రంగులు మార్చే అబ్బాయిలు చదరంగపుటెత్తులు వేస్తారు
మాయలు తెలియని అమ్మాయిలను మైకంలో ముంచేస్తారు
ఆడవాల్లిలా అంటారు నాటక మాడుతువుంటారు
ఆడవాల్లిలా అంటారు నాటక మాడుతువుంటారు
సందుచూసుకొని ఎంతటి వాడినైన ముడేసుకుంటారు

ఏమిటయ్య సరసాలు ఎందుకయ్య జల్సాలు
హయ్ ఏమిటి పిల్లా నా తప్పు ఔనో కాదో నువు చెప్పు

చరణం: 3
అత్తకొడుకని అలుసిస్తే ఈ ఆగడమంతా ఏలా
అత్తకొడుకని అలుసిస్తే ఈ ఆగడమంతా ఏలా
మావోలిప్పుడు చూశారంటే అబ్బో మిర్చి మసాలా
ఓ మామ కూతురమ్మా అందాల ముద్దుగుమ్మా
ఓ మామ కూతురమ్మా అందాల ముద్దుగుమ్మా
మనకేనాడో రాసినాడు ఆ మాయదారి బ్రహ్మ

ఏమిటయ్య సరసాలు ఎందుకయ్య జల్సాలు
ఓ సోగ్గాడా ఆపవయ్య నీ అల్లరి చిల్లర వేషాలు
ఏమిటి పిల్లా నా తప్పు ఔనో కాదో నువు చెప్పు
అదర గొట్టిన బెదర గొట్టిన వీడిపోదు మన వలపు




ముందరున్న చిన్నదాని పాట సాహిత్యం

 
చిత్రం: కాలం మారింది (1972)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దాశరథి 
గానం: ఘంటసాల, పి.సుశీల 

ముందరున్న చిన్నదాని అందమేమో
చందమామ సిగ్గుచెంది సాగిపోయే దాగిపోయె
పొందుగోరు చిన్న వాని తొందరేమో
మూడుముళ్ళ మాటగూడ మరచిపోయే
తోచదాయె....
పాలబుగ్గ పిలిచింది యెందుకోసమో
ఎందుకోసమో

పైట కొంగు కులికింది యెవరికోసమో
ఎవరికోసమో ?

నీ లోని పొంగులూ నా వేననీ
చెమరియ నీమేను తెలిపెలే ....
ముందరున్న
కొంటెచూపు రమ్మంది యెందుకోసమో?
ఎందుకోసమో ?
ఆ....
ఓ....
కన్నెమనసు కాదంది ! యెందుకోసమో?
ఎందుకోసమో ?

సరియైన సమయం రాలేదులే
మనువైన తొలిరేయి మనదిలే
ఆ....
ఓ....

ఎన్నాళ్లు మనకీ దూరాలూ
ఏనాడూ తీరని విరహాలూ 
కాదన్నవారూ ఔనన్ననాడూ
కౌగిళ్ళ కరిగేది నిజములే..... 

Most Recent

Default