చిత్రం: మాణిక్యం (1999) సంగీతం: యస్.ఏ రాజ్ కుమార్ నటీనటులు: శ్రీకాంత్ , దేవయాని, సంఘవి దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య నిర్మాతలు: యన్.వి.ప్రసాద్, శానం నాగ అశోక్ కుమార్ విడుదల తేది: 12.02.1999
Songs List:
కొండపల్లి మన్నుతో పాట సాహిత్యం
చిత్రం: మాణిక్యం (1999) సంగీతం: యస్.ఏ రాజ్ కుమార్ సాహిత్యం: శివ గణేష్ గానం: యస్.పి.బాలు పల్లవి: కొండపల్లి మన్నుతో గోదారమ్మ నీళ్లతో కొండపల్లి మన్నుతో గోదారమ్మ నీళ్లతో మలచిన బొమ్మరా ఇది ఓ ప్రాణమున్న గుమ్మరా ఇది ఓ ప్రాణమున్న గుమ్మరా ఇది తందాన తాన తననన తందాన తాన (2) చరణం: 1 కోటేరంటి ముక్కే చేశా కోన సీమ మన్నుతో పట్టువంటి చెక్కిలి చేశా పట్టిసీమ మన్నుతో గుస గుస చెవులు చేశా గుంటూరు మన్నుతో తేనెలూరు పెదవి చేశా తణుకు చెరుకు మన్నుతో కులుకు మబ్బు కురులుకేమో కృష్ణవేణి మన్నండి శంఖమంటి మెడకు మాత్రం శంకవరం మన్నండి అందాలమ్మ నుదురు తీర్చు మన్నే ఇలను లేదండి చందమామ మన్నే తెచ్చి నుదురు తీర్చా చూడండి ఎదురు దీనికేదండి కొండపల్లి మన్నుతో గోదారమ్మ నీళ్లతో మలచిన బొమ్మరా ఇది ఓ ప్రాణమున్న గుమ్మరా ఇది చరణం: 2 కూచిపూడి మన్నే తెచ్చా కులుకులమ్మ చేతికి పాలకొల్లు మన్నెతెచ్చా పైట చాటు సొగసుకి నందికొండ మన్నే తెచ్చా నాజూకైనా నాభికి నాగుల్లంక మన్నే తెచ్చా నాగమల్లి నడుముకి కాళహస్తి వీధుల్లోన మన్నెతెచ్చా కాళ్ళకి గోలుకొండ కోటలోని మన్నే తెచ్చా గోళ్ళకి ఊరూరు మన్నే తెచ్చి రూపమిచ్చా ఒంటికి నా ఊపిరేపోసి జీవమిచ్చా కంటికి జీవమిచ్చా కన్నెకి కొండపల్లి మన్నుతో గోదారమ్మ నీళ్లతో మలచిన బొమ్మరా ఇది ఓ ప్రాణమున్న గుమ్మరా ఇది ఓ ప్రాణమున్న గుమ్మరా ఇది తందాన తాన తననన తందాన తాన (4)
చింగు చా చింగు చా పాట సాహిత్యం
చిత్రం: మాణిక్యం (1999) సంగీతం: యస్.ఏ రాజ్ కుమార్ సాహిత్యం: కె.వెంకట శివయ్య గానం: యస్.పి.బాలు, స్వర్ణలత చింగు చా చింగు చా
చల్ చల్ గుర్రం పాట సాహిత్యం
చిత్రం: మాణిక్యం (1999) సంగీతం: యస్.ఏ రాజ్ కుమార్ సాహిత్యం: సామవేదం శర్మ గానం: చిత్ర చల్ చల్ గుర్రం
జాం జాం జాం పాట సాహిత్యం
చిత్రం: మాణిక్యం (1999) సంగీతం: యస్.ఏ రాజ్ కుమార్ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు జాం జాం జాం
వయ్యరమ్మ ఊరించకే పాట సాహిత్యం
చిత్రం: మాణిక్యం (1999) సంగీతం: యస్.ఏ రాజ్ కుమార్ సాహిత్యం: శివ గణేష్ గానం: యస్.పి.బాలు వయ్యరమ్మ ఊరించకే