చిత్రం: నీ స్నేహం (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్ , ఉష
నటీనటులు: ఉదయ్ కిరణ్ , జతిన్, ఆర్తి అగర్వాల్
దర్శకత్వం: పరుచూరి మురళి
నిర్మాత: యమ్. ఎస్. రాజు
విడుదల తేది: 01.11.2002
ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం
ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం
ఈ అనుభవం వెన్నెల వర్షం
ఎలా తెలపటం ఈ సంతోషం
ఓ హాని - ఐ లవ్ యు
నమ్మనంటావో ఏమో నిజమే తెలుసా
అమృతం నింపే నాలో నీ చిరు స్పర్శ
ఒప్పుకోలేవో ఏమో మురిసే మనసా
రెప్పనే దాటిరాదే కలలో ఆశ
పొద్దేరాని నిద్దర్లోనే ఉండిపోని
నిన్నే చూసే కల కోసం
సర్లేకాని చీకట్లోనే చేరుకోని
నువ్వు కోరే అవకాశం
తక్కువేం కాదులే ఈ జన్మలో ఈ వరం
ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం
వానలా తాకగానే ఉరిమే మేఘం
వీణలా మోగుతుంది యదలో రాగం
స్వాగతం పాడగానే మదిలో మైకం
వచ్చి ఒడి చేరుతుందా ఊహాలోకం
ఉన్నట్టుండి నిన్నట్నుండి రాజయోగం
దక్కినంత ఆనందం
అయ్యో పాపం ఎక్కడ్లేని ప్రేమ రోగం
తగ్గదేమో ఏ మాత్రం
తానుగా చేరెగా ప్రియమైన ప్రేమాలయం
ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం
ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం
ఈ అనుభవం వెన్నెల వర్షం
ఎలా తెలపటం ఈ సంతోషం
******** ******** ********
చిత్రం: నీ స్నేహం (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్ , ఉష
ఏమో అవునేమో నిజమేమో
నాలో మైమరపే రుజువేమో
ఏంచేసిందో ఆ చిన్నది
ప్రేమించేసానందీ మది
తన పేరైనా అడగాలన్నా ఎదరుంటేనా
చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి
చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి
ఏమో అవునేమో నిజమేమో
నాలో మైమరపే రుజువేమో
ఒక్కటే జ్ఞాపకం ఆమెతో పరిచయం
మబ్బులో మెరుపులా తగలటం
అక్కడే ఆ క్షణం మొదలు ఈ లక్షణం
నిద్రలో నడకలా సాగటం
ఆ మెరుపు కంటపడకుంటే
తన జంట కలిసి నడవందే
ఈ మరపు వదలనంటుందే ఇంకెలా
చెప్పమ్మా ఓ పావురమా ఆమెతో ఈ సంగతి
ఏమో అవునేమో నిజమేమో
నాలో మైమరపే రుజువేమో
ఆమెనే వెతకటం అందుకే బతకటం
కొత్తగా ఉన్నదే అనుభవం
ప్రేమనే పిలవటం ప్రేమనే తెలపటం
బొత్తిగా నేర్పదీ సతమతం
తన కంటి చూపులో మౌనం
చదివేదెలాగ నా హృదయం
తన గుండె గూటిలో నే వాలేదెలా
చెప్పమ్మా కలవరమా ఆమెతో నీ అలజడి
ఏమో అవునేమో నిజమేమో
నాలో మైమరపే రుజువేమో
ఏంచేసిందో ఆ చిన్నది
ప్రేమించేసానందీ మది
తన పేరైనా అడగాలన్నా ఎదరుంటేనా
చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి
చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి
********* ********* *********
చిత్రం: నీ స్నేహం (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఉష
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
మువ్వలే మనసు పడు పాదమా
ఊహలే ఉలికి పడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
ఆమని మధువనమా
ఆ... ఆమని మధువనమా
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
సరిగసా సరిగసా రిగమదని
సరిగసా సరిగసా నిదమ దని
సాస నిని దాద మామ గమదనిరిస గా
నినిదగ నినిదగ నినిదగ నినిదగ
సగమగ సనిదని మద నిస నిస గసగా
పసిడి వేకువలు పండు వెన్నెలలు
పసితనాలు పరువాల వెల్లువలు
కలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మ
పచ్చనైన వరిచేల సంపదలు అచ్చ తెలుగు మురిపాల సంగతులు
కళ్ళముందు నిలిపావే ముద్దుగుమ్మా
పాల కడలి కెరటాల వంటి
నీ లేత అడుగు తన ఎదను మీటి
నేలమ్మ పొంగెనమ్మా
ఆ... ఆగని సంబరమా ఆ ఆగని సంబరమా
సగమగా రిస సనిదమగ సగ సగమగా
రిస సనిదమగ సగ
సగస మగస గమద నిదమ గమదనిసా
సనిస సనిస నిస నిస నిస గమ రిస
సనిస సనిస నిస నిస నిస గమ రిస
గాగ నీని గగ నీని దగ నిగ సపా
వరములన్నీ నిను వెంట బెట్టుకొని
ఎవరి ఇంట దీపాలు పెట్టమని
అడుగుతునవే కుందనాల బొమ్మ
సిరుల రాణి నీ చేయి పట్టి
శ్రీహరిగా మారునని రాసిపెట్టి
ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా
అన్నమయ్య శృంగార కీర్తనల
వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా
ఆ...రాముని సుమ శరమా
ఆ...రాముని సుమ శరమా
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
మువ్వలే మనసు పడు పాదమా
ఊహలే ఉలికి పడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
ఆమని మధువనమా
ఆ...ఆమని మధువనమా
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవమ్మా
********* ********* *********
చిత్రం: నీ స్నేహం (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె కె (కృష్ణ కుమార్ కున్నత్)
ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా
మాట మన్నించుమా బయటపడిపోకుమా
చెయ్యేత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా
నీపేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా
ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా
చూపులో శూన్యమై పెంచుతూ ఉన్నది
జాలిగా కరుగుతూ అనుబంధం
చెలిమితో చలువనే పంచుతూ ఉన్నది
జ్యోతిగా వెలుగుతూ ఆనందం
కలత ఏ కంటిదో మమత ఏ కంటిదో
చెప్పలేనన్నది చెంప నిమిరే తడి
చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా
నీ పేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా
దేహమే వేరుగా స్నేహమే పేరుగా
మండపం చేరనీ మమకారం
పందిరై పచ్చగా ప్రేమనే పెంచగా
అంకితం చేయనీ అభిమానం
నుదిటిపై కుంకుమై మురిసిపో నేస్తమా
కళ్ళకే కాటుకై నిలిచిపో స్వప్నమా
చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా
నీ పేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా
ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా
మాట మన్నించుమా బయటపడిపోకుమా
********* ********* *********
చిత్రం: నీ స్నేహం (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఆర్.పి.పట్నాయక్ , రాజేశ్
కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
రూపు రేఖలు వేరట ఊపిరొకటే చాలట
ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం
కంటిపాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా
నిండు చెలిమికి నువ్వూ నేను నీడనివ్వాలి
స్నేహమంటే రూపులేని ఊహకాదని లోకమంతా
నిన్నూ నన్నూ చూడగానే నమ్మితీరాలి
కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
బొమ్మా బొరుసులేని నాణేనికి విలువుంటుందా
మనమిద్దరమూ పుట్టుండకపోతే చెలిమికి విలువుందా
సూర్యుడూ చంద్రుడూ లేని గగనానికి వెలుగుటుందా
మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా
గలగలమని సిరిమువ్వగా కలతెరుగని చిరునవ్వుగా
నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం
కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
వివరిస్తున్నది అద్దం మన అనుబంధానికి అర్ధం
నువ్వు నాలాగా నేన్నీలాగా కనిపించడమే సత్యం
నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాతిరి దారికి దీపం
నీ కల నిజమై కనిపించనిదే నిదరించనురా నేస్తం
గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా
మన ప్రాణాలే తన పాదాలై సాగాలి నీ స్నేహం
కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట
రెండు ఆత్మలు వేడుకున్నవి ఓ వరం
రూపు రేఖలు వేరట ఊపిరొకటే చాలట
ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం
కంటిపాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా
నిండు చెలిమికి నువ్వూ నేను నీడనివ్వాలి
స్నేహమంటే రూపులేని ఊహకాదని లోకమంతా
నిన్నూ నన్నూ చూడగానే నమ్మితీరాలి
********* ********* *********
చిత్రం: నీ స్నేహం (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఆర్.పి.పట్నాయక్
(సోలో సాంగ్)
వేయి కన్నులతో వేచిచూస్తున్నా
తెరచాటు దాటి చేరదా నీ స్నేహం!
కోటి ఆశలతో కోరుకుంటున్నా
కరుణించి ఆదరించదా నీ స్నేహం!
ప్రాణమే నీకూ కానుకంటున్నా
మన్నించి అందుకోవా నేస్తమా!
వేయి కన్నులతో వేచిచూస్తున్నా
తెరచాటు దాటి చేరదా నీ స్నేహం!
నీ చెలిమే ఊపిరిలా బతికిస్తున్నది నన్ను
నీ తలపే దీపంలా నడిపిస్తున్నది నన్ను
ఎంత చెంత చేరినా సొంతమవని బంధమా
ఎంతగా తపించినా అందనన్న పంతమా
ఎంత ఆశ ఉన్నా నిన్ను పిలిచేదెలాగమ్మా
అందాల ఆకాశమా