చిత్రం: నేనంటే నేనే (1968)
సంగీతం: యస్.పి.కోదండ పాణి
సాహిత్యం: కోసరాజు రాఘవయ్య చౌదరి (All)
గానం: యస్.పి.బాలు (All)
నటీనటులు: కృష్ణ , కృష్ణంరాజు, చంద్రమోహన్, కాంచన, సంధ్యారాణి
దర్శకత్వం: వి.రామచంద్ర రావు
నిర్మాత: పి.ఎన్. బాబ్జి
విడుదల తేది: 1968
( యస్.పి.బాలు కృష్ణ గారికి పాడిన మొట్టమొదటి పాట మరియు కోసరాజు గారు రాసిన పాటకు కూడా పాడటం ఇదే మొదటిది, అలాగే బాలు గారు సినిమాలో మొత్తం పాటలు పాడటం ఈ సినిమాతోనే ప్రారంభం)
పల్లవి:
ఓ చిన్నదానా...
ఓ చిన్నదాన నన్ను విడిచి పోతావటే
పక్కనున్నవాడి మీద నీకు దయరాదటే
ఒక్క సారి ఇటుచూడు పిల్లా..
మనసు విప్పి మాటాడు బుల్లే
ఒక్క సారి ఇటుచూడు మనసు విప్పి మాటాడు
నిజం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు
ఆ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మా
అహ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మా
గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మా
చరణం: 1
నే చూడని జాణ లేదు భూలోకంలో పిల్లా
నను మెచ్చని రాణి లేదు పైలోకంలో
ఓహో హో హో హో
నే చూడని జాణ లేదు భూలోకంలో పిల్లా
నను మెచ్చని రాణి లేదు పైలోకంలో
కంటికి నచ్చావే చెంతకు వచ్చానే
కంటికి నచ్చావే చెంతకు వచ్చానే
నిలవకుండ పరుగు తీస్తే నీవే చింత పడతావే
ఆ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మా
అహ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మా
గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మా
చరణం: 2
బెదిరి బెదిరి లేడిలాగ గంతులేయకే
చేయబట్టి అడిగినపుడు బిగువు చేయకే
బెదిరి బెదిరి లేడిలాగ గంతులేయకే
చేయబట్టి అడిగినపుడు బిగువు చేయకే
రంగు చీరలిస్తానే....
రంగు చీరలిస్తానే రవల కమ్మలేస్తానే
దాగుడు మూతలు వదిలి కౌగిలి ఇమ్మంటానే పిల్లా...
ఆ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మా
అహ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మా
గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మా
చరణం: 3
నీ నడుముబట్టి హంసలాగా నాట్యం చేస్తా
నీ కౌగిటిలో ఘుమ్ ఘుమ్ గ రాగం తీస్తా
నీ నడుముబట్టి హంసలాగా నాట్యం చేస్తా
నీ కౌగిటిలో ఘుమ్ ఘుమ్ గ రాగం తీస్తా
కారులోన ఎక్కిస్తా పోయ్ పోయ్
జోర్ జోర్ గ నడిపేస్తా
కారులోన ఎక్కిస్తా జోర్ జోర్ గ నడిపేస్తా
చంపా చంపా రాసుకుంటూ జల్సాగా గడిపేస్తా
పిప్పిరి పిప్పిరి పీ పీ పీ, పిప్పిరి పిప్పిరి పీ పీ పీ
ఓ చిన్నదాన
ఓ చిన్నదాన నన్ను విడిచి పోతావటే
పక్కనున్నవాడి మీద నీకు దయరాదటే
ఒక్క సారి ఇటుచూడు మనసు విప్పి మాటాడు
నిజం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు
ఆ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మా
అహ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మా
గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మా
******* ******* *******
చిత్రం: నేనంటే నేనే (1968)
సంగీతం: కోదండపాణి
సాహిత్యం: దాశరథి
గానం: బాలు, సుశీల
పల్లవి:
చాలదా ఈ చోటు... రాదులే ఏ లోటు
చాలదా ఈ చోటు... రాదులే ఏ లోటు
ఎందులోనూ లేని సుఖం... పొందులోనే ఉంది నిజం
ఈ పొందులోనే ఉంది నిజం
చాలదా ఈ చోటు... రాదులే ఏ లోటు
చరణం: 1
కనులూ కనులూ కలుపుటకు... మనసులోనిది తెలుపుటకు
వలపుల ఊయలూగుటకు... కలల కడలిలో తేలుటకు
అందరాని స్వర్గమేదో ఇందులోనే అందుటకు... ఇందులోనే అందుటకు
చాలదా ఈ చోటు... రాదులే ఏ లోటు
చాలదా ఈ చోటు... రాదులే ఏ లోటు
చరణం: 2
వానకు తడిసిన మేనిలో.. ఓ.. ఓ...
వెచ్చని కోరికలూరగా... ఆ ఆ..
ఎన్నడు తీరని ఆశలూ అన్నీ నేడే తీరగా
ఎన్నడు తీరని ఆశలూ అన్నీ నేడే తీరగా
కానరాని అందమంతా కనులముందే నిలువగా... కనులముందే నిలువగా
చాలదా ఈ చోటు... రాదులే ఏ లోటు
చాలదా ఈ చోటు... రాదులే ఏ లోటు
చరణం: 3
చెక్కిలి చెక్కిలి చేరగా... ఆ.. ఆ.. ఆ
ఏవో గుసగుసలాడగా.. ఆ.. ఆ..
ఉరుముల మెరుపుల జోరులో హృదయాలొకటై సోలగా
మనకు తెలియని మైకం లోనా మనము ఒకటై పోవగా... మనము ఒకటై పోవగా