చిత్రం: ప్రజారాజ్యం (1983)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: కృష్ణ , జయప్రద
దర్శకత్వం: యమ్.మల్లికార్జునరావు
నిర్మాత: జి.నాగరత్నం
విడుదల తేది: 29.09.1983
పల్లవి:
అమ్మాయీ... అమ్మాయీ
అమ్మాయీ... అమ్మాయీ
కోకంతా గొడవాయే.. రైకంతా బిగువాయే
ఏమొచ్చెనే అమ్మడూ
ఊరోళ్ళ కళ్ళల్లో ఊరేగే వొల్లంతా
ఈడొచ్చెరో పిల్లడూ
కోకంతా గొడవాయే.. రైకంతా బిగువాయే
ఏమొచ్చెనే అమ్మడూ
ఊరోళ్ళ కళ్ళల్లో ఊరేగే వొల్లంతా
ఈడొచ్చెరో పిల్లడూ
హహా... హహా... హహా...
చరణం: 1
కులుకమ్మా నడుమంతా గుపెట్లోనే దాచా
గుపెట్లో గిలిగింతా కౌగిట్లోనే చూశా
కులుకమ్మా నడుమంతా గుపెట్లోనే దాచా
గుపెట్లో గిలిగింతా కౌగిట్లోనే చూశా
అందంలో సంగీతం... సందిట్లో సావాసం
అహా.. అహా... అహా..
కోకంతా గొడవాయే.. రైకంతా బిగువాయే
ఏమొచ్చెనే అమ్మడూ..హహా..
ఊరోళ్ళ కళ్ళల్లో ఊరేగే వొల్లంతా
ఈడొచ్చెరో పిల్లడూ
హహా... హహా... హహా...
చరణం: 2
కవ్వించే అందాలే కళ్ళల్లో ఆరేశా
కౌగిళ్ళా హద్దుల్లో ఇల్లేన్నో కట్టేశా
కవ్వించే అందాలే కళ్ళల్లో ఆరేశా
కౌగిళ్ళా హద్దుల్లో ఇల్లేన్నో కట్టేశా
ఒళ్ళంతా వయ్యారం... వందిళ్ళా సంసారం
అహా.. ఒహో.. అహా
కోకంతా గొడవాయే.. రైకంతా బిగువాయే
ఏమొచ్చెనే అమ్మడూ..
ఊరోళ్ళ కళ్ళల్లో ఊరేగే వొల్లంతా
ఈడొచ్చెరో పిల్లడూ
హహా... హహా... హహా...
చరణం: 3
చేపంటి ఆ కళ్ళు... చెప్పేవే ఆకళ్ళు
ఎదురైతే ఉవ్విళ్ళు... ఎదకొచ్చే ఎక్కిళ్ళు
చేపంటి ఆ కళ్ళు... చెప్పేవే ఆకళ్ళు
ఎదురైతే ఉవ్విళ్ళు... ఎదకొచ్చే ఎక్కిళ్ళు
నీ ముద్దే మందారం... ముదిరిందీ యవ్వారం
అహా..ఒహో.. అహా...
కోకంతా గొడవాయే.. రైకంతా బిగువాయే
ఏమొచ్చెనే అమ్మడూ..హహా..
ఊరోళ్ళ కళ్ళల్లో ఊరేగే వొల్లంతా
ఈడొచ్చెరో పిల్లడూ
హహా... హహా... హహా...
******* ******* ******
చిత్రం: ప్రజారాజ్యం (1983)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల
పల్లవి:
ధిం తకతక ధిం తకతక..ఓ..ఓ..ఓ..
ధిం తకతక ధిం తకతక..ఓ..ఓ..ఓ..
తకధిమి తకఝణు తకధిమి తకఝణు
తకధిమి తకఝణు తకధిమి తకఝణు
తకధిమి తకఝణు తకధిమి తకఝణు
తకధిమి తకధిమి తకధిమి తకఝణు
ఓ........ఓ...హో....
ఓ.....హో హో హో.....ఓ...
గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే రేపల్లె వీధుల్లో
వయ్యారి చిందుల్లో..ఓ..ఓహో ఓహో ఓహో......
గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే రేపల్లె వీధుల్లో
వయ్యారి చిందుల్లో..ఓ......
మువ్వా మువ్వా ముద్దాడంగ...ముద్దు ముద్దూ పెళ్ళాడంగ
అందాలన్నీ అల్లాడంగ...రావే..హో..హో..హో...
ఇదే అల్లరీ... ఈ..హో.. నాదే నా గిరీ...
గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే రేపల్లె వీధుల్లో వయ్యారి చిందుల్లో..ఓ......
చరణం: 1
ధిం తకతక ధిం తకతక..ఓ..ఓ..ఓ..
ధిం తకతక ధిం తకతక..ఓ..ఓ..ఓ..
దాచిన ఏహే..దాగని ఓహో..తీయని వలపులో
చక్కలిగిలిలో...కౌగిలి వలలో...ఇద్దరు కరగాలిలే
దక్కిన ఆహా..చిక్కని..ఓహో హో..తీరని కొలుపులో
ముద్దులముడిలో...మెత్తని ముడుపే...వెచ్చగ దొరకాలిలే
కన్ను కన్ను మాటాడంగ ...మాట మాట మనసివ్వంగ
మనసు మనసు మనువాడంగ... రావే..హే..హో..హ్హ..
అ.. మన పెళ్ళికీ..ఈ..హ్హో..మదే పల్లకీ..
గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే రేపల్లె వీధుల్లో
వయ్యారి చిందుల్లో..ఓ...ఓ...ఓ...
గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే రేపల్లె వీధుల్లో
వయ్యారి చిందుల్లో..ఓ...
చరణం: 2
ధిం తకతక ధిం తకతక..ఓ..ఓ..ఓ..
ధిం తకతక ధిం తకతక..ఓ..ఓ..ఓ..
తకధిమి తకఝణు తకధిమి తకఝణు
తకధిమి తకఝణు తకధిమి తకఝణు
తకధిమి తకఝణు తకధిమి తకఝణు
వచ్చిన..హహహ..వయసులో..ఓహోహోహో..ఇచ్చిన మనసులే...
కలసిన జతలో...కమ్మని శృతిలో ...మల్లెలు పాడాలిలే
నచ్చిన..ఓహో..హో..సొగసులు..హే..తెచ్చిన వరసలే
వలపులు కడితే...వంతెన పడితే...పంటలు పండాలిలే
పాటే తీసి పైటేయంగ... పైటే నేను జారేయంగ ...
పైటే నువ్వై వాటేయంగ రారా..హో..హో...హో..
ఇదే ఆశగా..హోయ్..ఇదే బాసగా..అరెరే..
గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే రేపల్లె వీధుల్లో వయ్యారి చిందుల్లో..
హోయ్...గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే రేపల్లె వీధుల్లో
వయ్యారి చిందుల్లో..వయ్యారి చిందుల్లో..హ్హ..
వయ్యారి చిందుల్లో....ఆ ఆ..వయ్యారి చిందుల్లో...
లలాలలాలలా..లలాలలాలలా..లలాలలాలలా