చిత్రం: పులి-బెబ్బులి (1983) సంగీతం: రాజన్-నాగేంద్ర నటీనటులు: కృష్ణంరాజు, చిరంజీవి, జయప్రద, రాధిక దర్శకత్వం: కె.యస్.ఆర్.దాస్ నిర్మాత: ఆర్. వి.గురుపాదం విడుదల తేది: 16.06.1983
Songs List:
నీ రూపే ఆలాపన... పాట సాహిత్యం
చిత్రం: పులి-బెబ్బులి (1983) సంగీతం: రాజన్-నాగేంద్ర సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: నీ రూపే ఆలాపన... మదిలోనే ఆరాధన ఆరని జ్యోతి.. అమరజ్యోతి... వెలిగిన నా కోవెలలో నీ రూపే ఆలాపన... మదిలోనే ఆరాధన ఆరని జ్యోతి.. అమరజ్యోతి... వెలిగిన నా కోవెలలో నీ రూపే ఆలాపన... మదిలోనే ఆరాధన ఆరనిజ్యోతి.. అమరజ్యోతి... వెలిగిన నా కోవెలలో చరణం: 1 వయసు విరులుగా విరిసే వసంతం మనసున విరి తేనె కురిసే సుగంధమై కలల అలలపై కదిలే ప్రయాణం కౌగిట ముగిసేను కమ్మని బంధమై మల్లెల పల్లకి వెన్నెల వాకిట... మాపటి వేళకు వచ్చిన ముచ్చట మల్లెల పల్లకి వెన్నెల వాకిట... మాపటి వేళకు వచ్చిన ముచ్చట పూచేపున్నాగ పూలా సన్నాయి... పులకరింత పలకరించు వేళ సౌందర్య రాగాలలో... సాహిత్యభావాలలో సుమించు సుఖాల .. మిళుమిళు చీకటి చిలిపి వెన్నెలల హారతే ఇవ్వగా నీ రూపే... నీ రూపే నీ రూపే ఆలాపన... మదిలోనే ఆరాధన ఆరని జ్యోతి.. అమరజ్యోతి... వెలిగిన నా కోవెలలో చరణం: 2 గిరులకు సిరినై.. విరులకు విరినై చిరుచిరునవ్వుల శ్రీలక్ష్మి నేనై సిరికే హరినై.. సుఖలాహిరినై నీ పద గీతికి నేనే శృతినై రిరిరీగాగా... వాణి నా రాణి సారిసారిరి.. నిత్య కల్యాణి పపద దదప ససగరిరిస సుందరసుమధుర నాట్యములాడగ ఆ.. ఆ.. ఆ.. ఆ..ఆ.. ఆ.. ఆ.. ఆ.. నిను వలచినా పెనవెసినా ప్రణయములలో మమతాస్వరాలు... మధురాక్షరాలు మనసులు కలిపిన వలపుల పిలుపున సాగే సంగీతమై నీ రూపే... నీ రూపే నీ రూపే ఆలాపన... మదిలోనే ఆరాధన ఆరని జ్యోతి.. అమరజ్యోతి... వెలిగిన నా కోవెలలో నీ రూపే ఆలాపన... మదిలోనే ఆరాధన
పరిమళించు పున్నమిలో.. పాట సాహిత్యం
చిత్రం: పులి-బెబ్బులి (1983) సంగీతం: రాజన్-నాగేంద్ర సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది మౌనమే.. గానమై.. మధుమాసవేళలో మౌనమే.. గానమై.. మధుమాసవేళలో ఆ..... ఆ.... ఆ.... పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది మౌనమే.. గానమై... మధుమాసవేళలో మౌనమే.. గానమై.. మధుమాసవేళలో ఆ ఆ ఆ పరిమళించు పున్నమిలో... ప్రణయ వీణ పలికింది చరణం: 1 నవ్వగనే.. నవయవ్వనమే పువ్వులు రువ్విందిలే తానె విరితేనై తానాలు ఆడిందిలే నిన్ను గని.. ఎద కోయిలగ రాగాలు తీసిందిలే నాలో ఎలమావి ఉయ్యలలూగిందిలే చేలిమికిదే చైత్రమనీ.. నా ఆశ పూసింది.. అందాల బృందావిహారాలలో పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది చరణం: 2 అందమిదే.. మకరందమిదే.. నా జీవితానందమే నాలో కెరటాలై ఉప్పొంగి పోయిందిలే బంధమిదే.. సుమగంధమిదే.. ఏ జన్మ సంబంధమో నాలో విరితావి వెదజల్లిపోయిందిలే జాబిలిగా.. వెన్నెలగా.. ఈ జంట కలిసింది కార్తిక పూర్ణిండు మాసాలలో పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది మౌనమే.. గానమై.. మధుమాసవేళలో మౌనమే.. గానమై.. మధుమాసవేళలో
ఇంటిపని వంటపని పాట సాహిత్యం
చిత్రం: పులి-బెబ్బులి (1983) సంగీతం: రాజన్-నాగేంద్ర సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల ఇంటిపని వంటపని
గుట్టుగా పుట్టిల్లు విడిచిపెట్టేశా పాట సాహిత్యం
చిత్రం: పులి-బెబ్బులి (1983) సంగీతం: రాజన్-నాగేంద్ర సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల గుట్టుగా పుట్టిల్లు విడిచిపెట్టేశా
గొప్పెందుకే గోవిందమ్మ పాట సాహిత్యం
చిత్రం: పులి-బెబ్బులి (1983) సంగీతం: రాజన్-నాగేంద్ర సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల గొప్పెందుకే గోవిందమ్మ ఓ యాబ్బా
చెక్కిలిగింతమ్మో చక్కనిచుక్కమ్మో పాట సాహిత్యం
చిత్రం: పులి-బెబ్బులి (1983) సంగీతం: రాజన్-నాగేంద్ర సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల చెక్కిలిగింతమ్మో చక్కనిచుక్కమ్మో