చిత్రం: రక్తసంబంధం (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: అనిసెట్టి
గానం: ఘంటసాల, సుశీల
నటీనటులు: యన్. టి.రామారావు, సావిత్రి, దేవిక
దర్శకత్వం: వి.మధుసూదనరావు
నిర్మాత: డి.సుందర్లాల్ నహత
విడుదల: 01.11.1962
పల్లవి:
చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే
నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే
కరుణతో జూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే
లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే
చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే
నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే
కరుణతో జూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే
లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే
చరణం: 1
అన్న ఒడి జేర్చి ఆటలాడించు నాటి కధ పాడనా .. నాటి కధ పాడనా
కలతలకు లొంగి కష్టముల క్రుంగు నేటి కథ పాడనా .. కన్నీటి కధ పాడనా
కలతలకు లొంగి కష్టముల క్రుంగు కన్నీటి కథ పాడనా
కంటిలో పాప ఇంటికే జ్యోతి చెల్లి నా ప్రాణమే .. చెల్లి నా ప్రాణమే
మము విధియె విడదీసే వెతలలో ద్రోసే మిగిలెనీ శోకమే .. మిగిలెనీ శోకమే
విధియె విడదీసే.. వెతలలో ద్రోసే.. మిగిలెనీ శోకమే
చరణం: 2
మనసులను కలుపు మధుర బంధాలు మాసిపోరాదులే
పెరిగి నీవైన మామగారింటి మనువునే కోరుమా
బంధమే నిల్పుమా .. మా బంధమే నిల్పుమా
కాలమెదురైన గతులు వేరైన మమతలే మాయునా
పెరిగి నీవైన అత్తగారింట కోడలిగ చేరుమా
బంధమే నిల్పుమా .. మా బంధమే నిల్పుమా
దివిలో తారకలు .. భువిలో మానవులు ధూళిలో కలసినా
అన్నచెల్లెళ్ళ జన్మబంధాలె నిత్యమై నిల్చులే..
లాలి పాపయి హాయి పాపాయి.. లాలి పాపాయి జో జో..
లాలి పాపాయి జో జో ..
******* ******* ********
చిత్రం: రక్తసంబంధం (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: అనిసెట్టి
గానం: సుశీల
బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే
బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే
కళ్యాణ శోభకనగానే కనులార తనివితీరేనే
ఓ బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే
ఎనలేని నోము నోచీ నీవీరోజుకెదురుచూచి
మురిపించి మనసు దోచి మది ముత్యాల ముగ్గులేసి
కలగన్న ఘడియ రాగానే తలవంచి బిడియ పడరాదే...
కలగన్న ఘడియ రాగానే తలవంచి బిడియ పడరాదే
ఓ బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే
అందాల హంస నడక ఈ అమ్మాయి పెళ్లినడక
ఓయమ్మ సిగ్గుపడకే వేచి వున్నాడు పెళ్ళికొడుకే
నూరేళ్ళపంట పండేనే గారాల సిరులు పెరిగేనే..
నూరేళ్ళపంట పండేనే గారాల సిరులు పెరిగేనే..
ఓ బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే
మనసైన వాడు వరుడు.. నీ మదినేలుకొనెడు ఘనుడు
వేసేను మూడుముళ్ళు ఇక కురిసేను పూలజల్లు
ఈ ఏటికిరువురొకటైతే మీదటికి ముగ్గురౌతారే
ఈ ఏటికిరువురొకటైతే మీదటికి ముగ్గురౌతారే
ఊ –ళ ళ ళ –హాయి
ఓ బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే
బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే