చిత్రం: రాణీ రత్నప్రభ (1955)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల
నటీనటులు: యన్. టి.రామారావు, అంజలీ దేవి
నిర్మాత & దర్శకత్వం: బి.ఎ. సుబ్బారావు
విడుదల తేది : 1955
నిన్న కనిపించింది
నన్ను మురిపించింది
అంద చందాల రాణీ ఆ చిన్నది
నిన్న కనిపించింది...
నిన్న కనిపించింది
నన్ను మురిపించింది
అంద చందాల రాణీ ఆ చిన్నది
నిన్న కనిపించింది
నన్ను మురిపించింది
అంద చందాల రాణీ ఆ చిన్నది
ఆమె చిరునవ్వులోనే
హాయున్నది
మనసు పులకించగా మధురభావాలు
నాలోన కలిగించింది
మరచిపోలేను ఆ రూపు ఏనాటికి
మరచిపోలేను ఆ రూపు ఏనాటికి
మమత లేవేవో చెలరేగే ఇది ఏమిటి
మమత లేవేవో చెలరేగే ఇది ఏమిటి
తలచుకొనగానే ఏదో ఆనందమూ
తలచుకొనగానే ఏదో ఆనందమూ
వలపు జనియించగా
ప్రణయ గీతాలు
నాచేత పాడించింది
సోగకనులార చూసింది సొంపారగా
మూగ కోరికలు చిగురించె ఇంపారగా
సోగకనులార చూసింది సొంపారగా
నడిచిపోయింది ఎంతో నాజూకుగా
నడిచిపోయింది ఎంతో నాజూకుగా
విడిచి మనజాలను విరహతాపాలు
మొహాలు రగిలించింది
నిన్న కనిపించింది
నన్ను మురిపించింది
అంద చందాల రాణీ ఆ చిన్నది