చిత్రం: సరదాగా కాసేపు (2010)
సంగీతం: చక్రి
సాహిత్యం:
గానం: వంశీ, చైత్ర
నటీనటులు: అల్లరి నరేష్ , అవసరాల శ్రీనివాస్ , మధురిమ
దర్శకత్వం: వంశీ
నిర్మాత: యమ్.ఎల్. పద్మకుమార్ చౌదరి
విడుదల తేది: 2010
మగధీరా సుకుమారా మనసారా నినుచేరా
చూపుతోనే తొలిమాటతోనే నను మార్చినావు తెలుసా
నిజమా - నిజమే, నిజమా - నిజమే
మణిమాలా జపమాలా మనసైనా మధుబాలా
ప్రేమ నువ్వు అని నువ్వు నేను అని ఇపుడె నాకు తెలిసే
నిజమా - నిజమే, నిజమా - నిజమే
నిన్నుకోరిన చిన్ని గుండెలో వేల వేల కలలే
ఇన్ని నాళ్లుగా నాకు లేవులే నిన్ను చూసి కలిగే
మగధీరా సుకుమారా మనసారా నినుచేరా
చరణం: 1
అందమైన కథ అల్లుకుంది కద నువ్వునాకు జతగా
అందువల్లె మరి ఝల్లుమంది ఎద నిన్ను చూసి విధిగా
స్నేహం నువ్వే స్వప్నం నువ్వే భావం నువ్వే బంధం నువ్వే
ఇంద్రధనస్సు మరి ఇక్కడుండగా నింగి చిన్నబోదా
పండువెన్నెలే పక్కనుండగా బతుకు పండిపోదా
మగధీరా సుకుమారా మనసారా నిను చేరా
చరణం: 2
చేరువైన చెలి చెప్పుతున్న ప్రతిమాట ఎంత మధురం
వెల్లువైన ప్రతి ఆశలోన నిను కోరుతుంది హృదయం
నవ్వే ఇస్తే నన్నే ఇస్తా నిన్నే ఇస్తే ప్రాణం ఇస్తా
ఇష్టమైన నీ కళ్లుచూడగా విన్నవించుకోనా
స్పష్టమైన నా ప్రేమ సాక్షిగా నన్ను పంచుకోనా
మణిమాలా జపమాలా మనసైనా మధుబాలా
ప్రేమ నువ్వు అని నువ్వు నేను అని ఇపుడె నాకు తెలిసే
నిజమా - నిజమే, నిజమా - నిజమే
నిన్నుకోరిన చిన్ని గుండెలో వేల వేల కలలే
ఇన్ని నాళ్లుగా నాకు లేవులే నిన్ను చూసి కలిగే
మగధీరా సుకుమారా మనసారా నిను చేరా