చిత్రం: శ్రీవారు మావారు (1973) సంగీతం: జి.కె. వెంకటేశ్ నటీనటులు: కృష్ణ , కృష్ణంరాజు, అంజలీదేవి , వాణిశ్రీ , యస్.వరలక్ష్మి దర్శకత్వం & నిర్మాత: బి.యస్.నారాయణ్ విడుదల తేది: 28.06.1973
Songs List:
చేయి వేస్తే చాల పాట సాహిత్యం
చిత్రం: శ్రీవారు మావారు (1973) సంగీతం: జి.కె. వెంకటేశ్ సాహిత్యం: దాశరథి గానం: పి. సుశీల పల్లవి: చేయి వేస్తే చాలు చిర్రుమంటాడప్పా చూపుతోనే నన్నూ జుర్రు కుంటా డప్పా ఏం ముంచు కొచ్చిందని యింతటి రుసరుసలు బావా .. దారికి రావా చేయి వేస్తే చాలు చిర్రుమంటాడప్పా చూపుతోనే నన్నూ జుర్రుకుంటా డప్పా ఏం ముంచు కొచ్చిందని యింతటి రుసరుసలు బావా.. దారికి రావా.. చరణం: 1 రామ చిలక జామ పండు కొరికినప్పుడు ఏమి రుచులు నాలోన కలిగెనప్పుడు రామ చిలక జామ పండు కొరికినప్పుడు ఏమి రుచులు నాలోన కలిగెనప్పుడు చందమామ మొగలు మీద పొడిచినప్పుడు వయసు ఎన్నిరేకులో విప్పెనప్పుడు ఏమని చెప్పను ఎలా మనసు విప్పను నీకు బదులుగా నేనే చెప్పవలసి వచ్చెను బావా.. దారికిరావా చేయి వేస్తే చాలుచిర్రుమంటాడప్పా చూపుతోనే నన్నూ జుర్రుకుంటా డప్పా ఏం ముంచు కొచ్చిందని యింతటి రుసరుసలు బావా... దారికిరావా చరణం: 2 గువ్వలాగ కన్నెమనసు ఎగురుతున్నది నీ గుండెలోని గూటి కొరకు తిరుగుతున్నది గువ్వలాగ కన్నెమనసు ఎగురుతున్నది నీ గుండెలోని గూటి కొరకు తిరుగుతున్నది లేతవలపు జింక లాగ దుముకు తున్నది నీ కౌగిలిలో నిలుపుకుంటె వొదిగి వుంటది మేనత్త కూతురిని నీ ముద్దు మరదల్ని మేనత్త కూతురిని నీ ముద్దు మరదల్ని జతగా నువు లేకుంటే బ్రతుకంతా ఒంటరిని బావా.. దారికిరావా చేయి వేస్తే చాలు చిర్రుమంటాడప్పా చూపుతోనే నన్నూ జుర్రుకుంటా డప్పా ఏం ముంచు కొచ్చిందని యింతటి రుసరుసలు బావా.. దారికిరావా
పూలు గుసగుసలాడేనని పాట సాహిత్యం
చిత్రం: శ్రీవారు మావారు (1973) సంగీతం: జి.కె. వెంకటేశ్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు పల్లవి: పూలు గుసగుసలాడేనని.. జతగూడేననీ.. గాలి ఈలలు వేసేనని.. సైగ చేసేననీ.. అది ఈరోజే తెలిసిందీ.. హా.... పూలు గుసగుసలాడేనని.. జతగూడేననీ.. గాలి ఈలలు వేసేనని.. సైగ చేసేననీ.. అది ఈరోజే తెలిసిందీ.. అ.... హా.... లాలలలల లాలల... లలలాలలల.. లాలలలల లాలల... లలలాలలల.. చరణం: 1 మబ్బుకన్నెలు పిలిచేనని.. మనసు రివ్వున ఎగిసేనని.. వయసు సవ్వడి చేసేనని.. ఇపుడే తెలిసిందీ.... రు రు రు రు..ఆ..ఓ పూలు గుసగుసలాడేనని.. జతగూడేననీ.. గాలి ఈలలు వేసేనని.. సైగ చేసేననీ.. అది ఈరోజే తెలిసిందీ.. అ.... చరణం: 2 అలలు చేతులు సాచేనని.. నురుగు నవ్వులు పూచేనని.. నింగి నేలను తాకేనని..నేడే తెలిసిందీ..!! రు రు రు రు..ఆ.. ఓ.. పూలు గుసగుసలాడేనని.. జతగూడననీ.. గాలి ఈలలు వేసేనని.. సైగ చేసేననీ.. అది ఈరోజే తెలిసిందీ.... టుర్..ఆ ఆ హు...ఆ హు..
పోలేవులే.. నీవు పోలేవులే పాట సాహిత్యం
చిత్రం: శ్రీవారు మావారు (1973) సంగీతం: జి.కె. వెంకటేశ్ సాహిత్యం: దాశరథి గానం: యస్.పి.బాలు, పి. సుశీల పల్లవి: పోలేవులే.. నీవు పోలేవులే పోలేవులే.. నీవు పోలేవులే నీ మదిలో ఉన్నాను.. నా మనసే ఇచ్చాను రావేలా.. కోపమా... తాపమా..నా ప్రియా పోలేవులే.. నీవు పోలేవులే పోలేవులే.. నీవు పోలేవులే నీ మదిలో ఉన్నాను.. నా మనసే ఇచ్చాను రావేలా.. కోపమా... తాపమా..నా ప్రియా చరణం: 1 మొదటి చూపులోనే మైమరిచాను.. కనులఙ హ్ు కలవగానే కలగన్నాను మొదటి చూపులోనే మైమరిచాను...కనులు కలవగానే కలగన్నాను ఎన్ని జన్మల ఈ ప్రేమబంధమో... నే నిన్ను వీడి ఉండలేనులే రా ప్రియా... నా ప్రియా పోలేవులే.. నీవు పోలేవులే చరణం: 2 మొదటి చూపులోనే మురిసిన నీవు... చెంత చేరగానే పొమ్మన్నావు అమ్మగారి మాట నమ్మేదెట్లా... రా రమ్మని పిలువగనే వచ్చెదెట్లా ముందు ఎన్నడు నీ పొందు కోరను...నా దారి నేను పోతానులే... రానులే... చాలులే పోలేవులే.. నీవు పోలేవులే చరణం: 3 అందమైనా ఇలాటి వేళా... అందుకోవే గులాబి మాల కోరికలే మాలికలై నీ మెడలో... వాలెను నేడు ఎన్ని జన్మల ఈ స్నేహబంధమో.. నే నిన్ను వీడి పోలేనులే ఓ ప్రియా..... నా ప్రియా పోలేవులే.. నీవు పోలేవులే పోలేవులే.. నీవు పోలేవులే నీ మదిలో ఉన్నాను... నా మనసే ఇచ్చాను రావేలా..ఓ ప్రియా... నా ప్రియా... నా ప్రియా
అల్లరి చూపులవాడే పాట సాహిత్యం
చిత్రం: శ్రీవారు మావారు (1973) సంగీతం: జి.కె. వెంకటేశ్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: జానకి పల్లవి: హొయ్.. అల్లరి చూపులవాడే.. అందాల నా చందూరూడే హూయ్..హూయ్.. అల్లరి చూపులవాడే.. అందాల నా చందూరూడే ఏడున్నడో కాని వాడు.. రామ చక్కనోడే చెంతకు చేరీ వింతగ చక్కలి గింతలు చేశాడే చెక్కిలినీ నొక్కగనే.. చిక్కుల్లో పడ్డానే అల్లరి చూపులవాడే.. అందాల నా చందూరూడే ఏడున్నడో కాని.. వాడు రామ చక్కనోడే చెంతకు చేరీ వింతగ చక్కలి గింతలు చేశాడే చెక్కిలినీ నొక్కగనే.. చిక్కుల్లో పడ్డానే అల్లరి చూపులవాడే.. వాడే వాడే అందాల నా చందూరూడే..ఏడే ఏడే చరణం: 1 అందాలన్నీ దోసిట దూసేనన్నాడే ఎందుకే అమ్మీ యింతటి సిగ్గని అన్నాడే అందాలన్నీ దోసిట దూసేనన్నాడే ఎందుకే అమ్మీ యింతటి సిగ్గని అన్నాడే కలగా నన్నే కవ్వించాడే.. అలలా నాలో పులకించాడే అమ్మో..ఏ మందునే.. సందిటనే చేరగనే సగమైనానే ఓ..అల్లరి చూపులవాడే... అందాల నా చందూరూడే ఏడున్నడో కాని వాడు.. రామ చక్కనోడే చెంతకు చేరీ వింతగ చక్కలి గింతలు చేశాడే చెక్కిలినీ నొక్కగనే చిక్కుల్లో పడ్డానే అల్లరి చూపులవాడే.. వాడే వాడే అందాల నా చందూరూడే.. ఏడే ఏడే చరణం: 2 మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ లలలలలా మ్మ్ మ్మ్ మ్మ్ హా..మ్మ్ మ్మ్ మ్మ్ హా..లలలలలాలలా..హోయ్ చెయీ చెయీ కలపాలని.. అన్నాడే రేయీ రేయీ కలవాలని.. అన్నాడే చెయీ చెయీ కలపాలని.. అన్నాడే రేయీ రేయీ కలవాలని.. అన్నాడే ఎదలో వాడే.. ఎదుగుతున్నాడే నిదురే కరువై.. వేగుతున్నానే అమ్మో.. ఏ మందునే... ఓ యమ్మో యీ తాపం ఓపగలేనే అల్లరి చూపులవాడే.. అందాల నా చందూరూడే ఏడున్నడో కాని వాడు.. రామ చక్కనోడే చెంతకు చేరీ వింతగ చక్కలి గింతలు చేశాడే చెక్కిలినీ నొక్కగనే.. చిక్కుల్లో పడ్డానే అల్లరి చూపులవాడే.. వాడే వాడే అందాల నా చందూరూడే.. ఏడే ఏడే ఏడున్నడో కాని వాడు.. రామ చక్కనోడే చెంతకు చేరీ వింతగ చక్కలి గింతలు చేశాడే చెక్కిలినీ నొక్కగనే.. చిక్కుల్లో పడ్డానే
ఇంతేలే జీవితం పాట సాహిత్యం
చిత్రం: శ్రీవారు మావారు (1973) సంగీతం: జి.కె. వెంకటేశ్ సాహిత్యం: దాశరథి గానం: యస్.పి.బాలు ఇంతేలే జీవితం
ఈ వేళలో... పాట సాహిత్యం
చిత్రం: శ్రీవారు మావారు (1973) సంగీతం: జి.కె. వెంకటేశ్ సాహిత్యం: శ్రీశ్రీ గానం ఎల్. ఆర్. ఈశ్వరి, వి.రామకృష్ణ పల్లవి: ఈ వేళలో... నా మనసు నీదే.. వయసు నీదే ఈ నిషాలూ.. ఖుషీలూ నీకేలే ఈ వేళలో... నా మనసు నీదే.. వయసు నీదే ఈ నిషాలూ.. ఖుషీలూ నీకేలే చరణం: 1 నేనుంటినీ నీ వెంటనే.. హైహై.. నీవుంటివీ నా కంటనే..మ్మ్ హు నా జీవితం నీ కోసమే.. ఓహో.. నీ యవ్వనం... నా కోసమే నీ యవ్వనం.. నా కోసమే... హాయ్.. ఈ వేళలో... నా మనసు నీదే.. వయసు నీదే ఈ నిషాలూ.. ఖుషీలూ నీకేలే చరణం: 2 ఆగేది కాదోయి కాలం.. లాగాలి లోలోని సారం ఆగేది కాదోయి కాలం.. లాగాలి లోలోని సారం నేడుంది నీ కేల రేపు.. జీవించు ఈ కోంత సేపు అహా..అహా..అహా..హా..హా..హా..ఆ ఈ వేళలో... నా మనసు నీదే.. వయసు నీదే ఈ నిషాలూ.. ఖుషీలూ నీకేలే చరణం: 3 చేరాలి కారామసాలా.. ఊగాలి వేగాల ఝాలా చేరాలి కారామసాలా.. ఊగాలి వేగాల ఝాలా సాగాలి గానాబజానా.. తానాన తందాన తానా లలాల..లలాల.. లలలలాలలా ఈ వేళలో... నా మనసు నీదే.. వయసు నీదే ఈ నిషాలూ.. ఖుషీలూ నీకేలే