చిత్రం: శ్రీకృష్ణ విజయం (1971)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల, పి. సుశీల
నటీనటులు: యన్. టి.రామారావు, జయలలిత, జమున
దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
నిర్మాత: కౌముది ప్రొడక్షన్స్
విడుదల తేది: 1971
పిల్లనగ్రోవి పిలుపు మెలమెల్లన రేపెను వలపు
మమతను దాచిన మనసు ఒక మాధవునికే తెలుసు
ఈ మాధవునికే తెలుసు!
సుందరి అందెల పిలుపు
నా డెందము నందొక మెరుపు
నంద కిశోరుని మనసు రతనాల బొమ్మకు తెలుసు!
ఈ రతనాల బొమ్మకు తెలుసు!
వెన్న మీగడలు తిన్నావట
వెన్నెలలో ఆడుకున్నావటా
వెన్న మీగడలు తిన్నావట
వెన్నెలలో ఆడుకున్నావటా
ఎన్నో నేర్చిన వన్నె కాడవట
ఏమందువో మరి నా మాట
ఏమందువో మరి నా మాట!
వెన్న మీగడలు తిన్నది నిజము
ఎన్నో నేర్చితినన్నదీ నిజము
వెన్న మీగడలు తిన్నది నిజము
ఎన్నో నేర్చితినన్నదీ నిజము
చిన్నారీ......చిన్నారీ!
నీ కన్నుల బాసలు వెన్నుని దోచిన
ఆ మాట నిజము..వెన్నుని దోచిన మాట నిజము!
సుందరి అందెల పిలుపు
నా డెందము నందొక మెరుపు
పిల్లనగ్రోవి పిలుపు మెలమెల్లన రేపెను వలపు!
అందీ అందని అందగాడవని
ఎందరో అనగా విన్నాను
అందీ అందని అందగాడవని
ఎందరో అనగా విన్నాను
అందులోని పరమార్ధమేమిటో
అలవోకగా కనుగొన్నాను..అలవోకగా కనుగొన్నాను!
ఎంత బేలవని అనుకున్నాను
అంత గడసరి తరుణివిలే
ఎంత బేలవని అనుకున్నాను
అంత గడసరి తరుణివిలే
అష్ట భార్యలతో అలరే రాజును
చెంగును ముడిచిన చెలువవులే
చెలువవులే చెంగలువవులే !
పిల్లనగ్రోవి పిలుపు మెలమెల్లన రేపెను వలపు
మమతను దాచిన మనసు ఒక మాధవునికే తెలుసు
ఈ మాధవునికే తెలుసు!