చిత్రం: శుభప్రదం (2010) సంగీతం: మణిశర్మ నటీనటులు: అల్లరి నరేష్ , మధురిమ దర్శకత్వం: కె.విశ్వనాథ్ నిర్మాతలు: హరిగోపాల్ కృష్ణ , ఫీల నీల తిలక్ విడుదల తేది: 16.07.2010
Songs List:
తప్పట్లోయ్ తాళాలోయ్ పాట సాహిత్యం
చిత్రం: శుభప్రదం (2010) సంగీతం: మణిశర్మ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: చిత్ర తప్పట్లోయ్ తాళాలోయ్
మౌనమే చెబుతోంది పాట సాహిత్యం
చిత్రం: శుభప్రదం (2010) సంగీతం: మణిశర్మ సాహిత్యం: అనంత్ శ్రీరామ్ గానం: యస్.పి.బాలు, ప్రణవి పల్లవి: మౌనమే చెబుతోంది నీ మౌనమే చెబుతోంది మౌనమే చెబుతోంది నీ మౌనమే చెబుతోంది ఏ మాట నీ మాటున దాగుందో మౌనమే చెబుతోంది నీ మౌనమే చెబుతోంది ఏ మాట నీ మాటున దాగుందో చూపు చెబుతోంది నీ చూపు చెబుతోంది ఎద చాటునున్న ఆశ ఏమందో ఏమందో... మౌనమే చెబుతోందా నా మౌనమే చెబుతోందా ఏ మాట నా మాటున దాగుందో మౌనమే చెబుతోందా నా మౌనమే చెబుతోందా ఏ మాట నా మాటున దాగుందో చూపు చెబుతోందా నా చూపు చెబుతోందా ఎద చాటునున్న ఆశ ఏమందో ఏమందో... చరణం: 1 అదిగో నీ బిడియం నాకు చెబుతోంది ఏమని ఎంత ఆరాటాన్ని లోపల ఆపిందో ఇదిగో నీ చొరవే నాకు చెబుతోంది ఏమని ఎంత ఆనందాన్ని పంచగ చేరిందో ఆ ఇరువురి చెరలో పరువం చెబుతోంది ఒకరినొకరం వద్దునుకోలేనంత ప్రేమ సొంతమైందని మౌనమే చెబుతుంది నీ మౌనమే చెబుతుంది ఏ మాట నీ మాటున దాగుందో చరణం: 2 వేసే ప్రతి అడుగు దారికి చెబుతోంది నేటినుండి నేను ఒంటరి కాదంటూ పలికే ప్రతి పలుకు ఆశకు చెబుతోంది శ్వాస చెప్పే ప్రేమ భాష్యం శ్వాస చెప్పే ప్రేమ భాష్యం వినమంటూ ఆ గుప్పెడు గుండెల చప్పుడు చెబుతోంది ఎప్పటికి లయ తప్పని రాగం నీ నా అనురాగం అని మౌనమే చెబుతోంది ఏ మాట నీ మాటున దాగుందో మౌనమే చెబుతోంది నీ మౌనమే చెబుతోంది ఏ మాట నీ మాటున దాగుందో
ఏలేలో ఏలేలో పాట సాహిత్యం
చిత్రం: శుభప్రదం (2010) సంగీతం: మణిశర్మ సాహిత్యం: అనంత్ శ్రీరామ్ గానం: యస్.పి.బాలు, శంకర్ మహదేవన్ ఏలేలో ఏలేలో
నీ చూపే కడదాక పాట సాహిత్యం
చిత్రం: శుభప్రదం (2010) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: కార్తీక్, చిత్ర నీ నవ్వే కడదాక
బైలేలే బైలేలే పల్లకి పాట సాహిత్యం
చిత్రం: శుభప్రదం (2010) సంగీతం: మణిశర్మ సాహిత్యం: రామ్ భట్ల గానం: మల్లికార్జున్, విజయలక్ష్మి, మాళవిక బైలేలే బైలేలే పల్లకి
ఓరిమి చాలమ్మా పాట సాహిత్యం
చిత్రం: శుభప్రదం (2010) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: రీటా త్యాగరాజన్ ఓరిమి చాలమ్మా
అంబాపరాకు దేవి పరాకు పాట సాహిత్యం
చిత్రం: శుభప్రదం (2010) సంగీతం: మణిశర్మ సాహిత్యం: కూచిపూడి ట్రెడిషినల్ గానం: డి.యస్.వి.శాస్త్రి అంబాపరాకు దేవి పరాకు