చిత్రం: వయ్యారి భామలు వగలమారి భర్తలు (1982) సంగీతం: రాజన్-నాగేంద్ర సాహిత్యం: వేటూరి (All) గానం: యస్.పి.బాలు , పి.సుశీల (All) నటీనటులు: యన్. టి.రామారావు, కృష్ణ దర్శకత్వం: కట్టా సుబ్బారావు నిర్మాత: ఆర్. వి. గురుపాదం విడుదల తేది: 28.08.1982
Songs List:
ఆడవే రాజహంస పాట సాహిత్యం
చిత్రం: వయ్యారి భామలు - వగలమారి భర్తలు (1982) సంగీతం: రాజన్-నాగేంద్ర సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, పి.సుశీల పల్లవి: ఆడవే రాజహంస... నడయాడవే రాజహంస లయలే నీవై.. హొయలిక నీదై.. రాగ... భావ... రాసలీల తేలగా ఆడవే రాజహంస... నడయాడవే రాజహంస లయలే నీవై.. హొయలిక నీదై.. రాగ... భావ... రాసలీల తేలగా ఆడవే రాజహంస... నడయాడవే రాజహంస చరణం: 1 తొలకరి అందాల పులకరమే నీవు... నవ్వితేనే వసంతం తొలకరి అందాల పులకరమే నీవు... నవ్వితేనే వసంతం అరుణిమ చరణాల విరిసిన ఉదయాల... కళలే నాలోన కురిసే మకరందం నీరాక వలపు తొలి ఏరువాక.. నీ అందమంత నాదే... నీ నవ్వులందు సిరిమువ్వ చిందు.. ఆనందమంత నాదే నీరాక వలపు తొలి ఏరువాక.. నీ అందమంత నాదే... నీ నవ్వులందు సిరిమువ్వ చిందు.. ఆనందమంత నాదే రావే.. మనుగడవు కావే... మధువనివి నీవే నీవే నేనైపోవే... పాడనా హంసగీతం... మురిపాల నా నాట్యవేదం ప్రియలయలన్నీ... అభినయమైన... రాగ.. భావ.. రాసలీల తేలగా పాడనా హంసగీతం... మురిపాల నా నాట్యవేదం చరణం: 2 లలలలా... లలలల... ఆ.. ఆ.. హ.. ఆ.. హా.. ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. కనులకు నిదురేది కౌగిలి నీవై... కళలకు గిలిగింత పెడితే కనులకు నిదురేది కౌగిలి నీవై... కళలకు గిలిగింత పెడితే కలలకు సెలవేది కమ్మని కలతై... వయసుకు పులకింత నీవైతే కూసంతా వెన్నెల్లలో... వయసంతా వయ్యారమై... పూసింది పున్నాగలా... మెరిసేటి మిన్నాగులా ఎదయ విరుల పొదల నీడలా... ఆ... ఆ.. ఆ ఆడవే రాజహంస... నడయాడవే రాజహంస ప్రియలయలన్నీ... అభినయమైన... రాగ.. భావ.. రాసలీల తేలగా పాడనా హంసగీతం... మురిపాల నా నాట్యవేదం చరణం: 3 సరిసరి నటనాల సరిగమలో తేలి... ఆడితేనే విలాసం సరిసరి నటనాల సరిగమలో తేలి... ఆడితేనే విలాసం కడలిని పొంగించి... సుధలను చిందించు జతులే నీ నోట పలికే నవలాస్యం కాలాలు కరిగి గతమవ్వు దాక నీ కౌగిలింత నాదే... లోకాలు సురిగి కథలవ్వు దాక నా జలదరింత నీదే నాలో రసధునివి నీవే... ఉదయినివి కావే నాలో వెలుగై పోవే.... పాడనా హంసగీతం... మురిపాల నా నాట్యవేదం లయలే నీవై.. హొయలిక నీదై.. రాగ... భావ... రాసలీల తేలగా ఆడవే రాజహంస... నడయాడవే రాజహంస
కొంగే తగిలిందే పాట సాహిత్యం
చిత్రం: వయ్యారి భామలు వగలమారి భర్తలు (1982) సంగీతం: రాజన్-నాగేంద్ర సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు , పి.సుశీల అరరె రరె కొంగే తగిలిందే రంగు తెలిసిందే చూపుల్లో ప్రేమ చురుకే రగిలిందే అది చూపులో ఇది చూపులో పలుగాకులో ఆ పిలుపులో నా కోడి ఏడెక్కి గూడెక్కి కూచుంది కొక్కొరొ కొక్కో చెంగే ఎగిరిందా చళ్ళున తగిలిందా చెలరేగే ప్రేమా క్షనుకే తెలిసిందా ఆ మెరుపులే కోసమెరుపులై మైమరపులై ఆ వలపులో నా గుండె కొట్టాడి మెట్టాడి కోరింది అత్త కొడుకా నీ కొంగే తగిలిందే రంగు తెలిసిందే చూపుల్లో ప్రేమ చురుకే రగిలిందే కులుకింత చిలక అహ పలికింది చిలక కులుకింత చిలక అహ పలికింది చిలక నిన్నే కోరింది గోరింకలా పులకింత పలక అహ బిడియాల మొలక పూలు పూసింది గోరింకలా ఓ చక్కని చుక్క నీకు చక్కెన ముక్క ఓసి చక్కర ముక్కా నీ దుడుకులు చాల్లే దాగినాది అరె దాగినాది ఓ చక్కని చుక్క నీకు చక్కెన ముక్క ఓసి చక్కర ముక్కా నీ దుడుకులు చాల్లే దాగినాది చెంగే ఎగిరిందా చళ్ళున తగిలిందా చెలరేగే ప్రేమా క్షనుకే తెలిసిందా అది చూపులో ఇది చూపులో పలుగాకులో ఆ పిలుపులో నా కోడి ఏడెక్కి గూడెక్కి కూచుంది కొక్కొరొ కొక్కో చెంగే ఎగిరిందా చళ్ళున తగిలిందా చెలరేగే ప్రేమా క్షనుకే తెలిసిందా ముదిరింది అలక నీ ముడుపేదొ అడగ ముదిరింది అలక నీ ముడుపేదొ అడగ దారి మారింది కౌగిల్లుగా సిగసుంటే ఎదర అరె ఇగిరింది నిదర ఆ కళ్ళు మారేను ఆకళ్లుగా అత్తకు కొడకా నీవు తత్తర పడక ఓసి చిచ్చర పిడుగా నీ చిటికెలు చాల్లే అత్తకు కొడకా నీవు తత్తర పడక ఓసి చిచ్చర పిడుగా నీ చిటికెలు చాల్లే కొంగే తగిలిందే రంగు తెలిసిందే చూపుల్లో ప్రేమ చురుకే రగిలిందే ఆ మెరుపులే కోసమెరుపులై మైమరపులై ఆ వలపులో నా గుండె కొట్టాడి మెట్టాడి కోరింది అత్త కొడుకా నీ కొంగే తగిలిందే రంగు తెలిసిందే చెలరేగే ప్రేమా అహ హ హా...
మేఘాల పందిరిలోనా... పాట సాహిత్యం
చిత్రం: వయ్యారి భామలు వగలమారి భర్తలు (1982) సంగీతం: రాజన్-నాగేంద్ర సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, పి.సుశీల పల్లవి: మేఘాల పందిరిలోనా... మెరిసింది మెరుపే ఔనా మేఘాల పందిరిలోనా... మెరిసింది మెరుపే ఔనా అది చూపై.. విరి తూపై... కురిసింది పూలవానా ఓ... కురిసింది పూలవానా రాగాలపల్లకిలోనా... పిలిచింది వలపే ఔనా అది పాటై... విరిబాటై... వెలసింది జీవితానా ఓ... వెలసింది జీవితానా మేఘాల పందిరిలోనా... మెరిసింది మెరుపే ఔనా చరణం: 1 గగనాల తార భువనాల జారి.. నన్ను చేరు వేళలో నీవే ఆ తారై మదిని వెలిగినావులే... ఇల వంక జారు.. నెలవంక తీరు... గోట మీటు వేళలో నీవే నా నీడై... మనసు తెలిపినావులే... మరులుగొలిపినావులే అననీ విననీ ఏ రాగం... మనలో పలికే సరాగం.. మేఘాల పందిరిలోనా... మెరిసింది మెరుపే ఔనా అది చూపై.. విరి తూపై... కురిసింది పూలవానా ఓ... కురిసింది పూలవానా రాగాలపల్లకిలోనా... పిలిచింది వలపే ఔనా చరణం: 2 నీ తీపి ఉసురు... నా వైపు విసిరి... వెల్లువైన వేళలో నాలో అల నీవై... కలలు రేపినావులే నీ నీలికనుల లేలేత కలలు వెల్లడైన వేళలో... నాలో ఎద నీవై... నిదుర లేచినావులే కదలి పాడినావులే మనసే కలిసే వేతీరం... విరిసే మమతా కుటీరం రాగాలపల్లకిలోనా.. పిలిచింది వలపే ఔనా అది పాటై... విరిబాటై... వెలసింది జీవితానా ఓ... వెలసింది జీవితానా మేఘాల పందిరిలోనా... మెరిసింది మెరుపే ఔనా
కొత్తపెళ్లికూతురునే పాట సాహిత్యం
చిత్రం: వయ్యారి భామలు - వగలమారి భర్తలు (1982) సంగీతం: రాజన్-నాగేంద్ర సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, పి.సుశీల కొత్తపెళ్లికూతురునే
యవ్వనమంతా పాట సాహిత్యం
చిత్రం: వయ్యారి భామలు - వగలమారి భర్తలు (1982) సంగీతం: రాజన్-నాగేంద్ర సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, పి.సుశీల పల్లవి: యవ్వనమంతా నవ్వుల సంతా నవ్విన జంటే నందనమంటా నీ కన్నే వెన్నెలై... నా చూపే చుక్కలై ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది.. సాగే సంసారం ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది.. సాగే సంసారం యవ్వనమంతా నవ్వుల సంతా నవ్విన జంటే నందనమంటా నీ కన్నే వెన్నెలై... నా చూపే చుక్కలై ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది.. సాగే సంసారం ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది.. సాగే సంసారం యవ్వనమంతా నవ్వుల సంతా చరణం: 1 నీలగిరి కొండల్లో నెమలిగా పుట్టాలి నీలగగనాలలో ఉరుమునై రావాలి చంద్రగిరి కోనల్లో వెన్నెలై రావాలి... జాబిల్లి మంచుల్లో జాజినై నవ్వాలి హా.. ఆ నవ్వు నా కంటికే దివ్వెగా నువ్వుగా నవ్వగా యవ్వనమంతా నవ్వుల సంతా నవ్విన జంటే నందనమంటా నీ కన్నే వెన్నెలై... నా చూపే చుక్కలై ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది.. సాగే సంసారం ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది.. సాగే సంసారం చరణం: 2 నీ భావశిఖరంలో భాషనై పొంగాలి నీ రాగ హృదయంలో కవితనై కదలాలి ఆ.. లలలలా.. లలలలా... ఆ కవిత నా బ్రతుకై అలరారు వేళల్లో ఆరారు ఋతువుల్లో కోయిలలు పాడాలి హా.. ఆ కోయిలే కోరికై గుండెలో పాడగా.. పండగా యవ్వనమంతా నవ్వుల సంతా నవ్విన జంటే నందనమంటా నీ కన్నే వెన్నెలై... నా చూపే చుక్కలై ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది.. సాగే సంసారం లలలలలాల.. లలలలలా.. లలలాలాలలలాలాల
వయ్యారి భామవే పాట సాహిత్యం
చిత్రం: వయ్యారి భామలు - వగలమారి భర్తలు (1982) సంగీతం: రాజన్-నాగేంద్ర సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, పి.సుశీల వయ్యారి భామవే