Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Aatma Bandhuvu (1962)




చిత్రం: ఆత్మ బంధువు (1962)
సంగీతం: కె.వి. మహదేవన్
నటీనటులు: యన్.టి.రామారావు, యస్.వి.రంగారావు, సావిత్రి, శారద
దర్శకత్వం: పి.యస్.రామకృష్ణా రావు
నిర్మాత: వై. ఆర్.కృష్ణప్రసాద్
విడుదల తేది: 12.12.1962



Songs List:



అనగనగా ఒక రాజు పాట సాహిత్యం

 
చిత్రం: ఆత్మ బంధువు (1962)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి. సుశీల

పల్లవి:
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న 
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి

చరణం: 1 
ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నారు
వారు చదువుసంధ్యలుండి కూడా చవటలయ్యారు
ఒఠ్ఠి చవటలయ్యారు     

చరణం: 2
పడకమీద తుమ్మముళ్ళు పరచెనొక్కడు 
అయ్యొ ఇంటి దీపమార్పివేయు నెంచెక్కడు
తల్లీ దండ్రులు విషమని తలచెనొక్కడు     
పడుచు పెళ్ళామే బెల్లమని భ్రమసెనొక్కడు... భ్రమసెనొక్కడు...

చరణం: 3
కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచీ
ప్రేమయనే పాలుపోసి పెంపుచేసెను    
కంటిపాపకంటె ఎంతో గారవించెను
దానిగుండెలోన గూడుకట్టి వుండసాగెను తానుండసాగెను 

చరణం: 4
నాది నాది అనుకున్నది నీది కాదురా
నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా 
నాది నాది అనుకున్నది నీది కాదురా
నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా 
కూరిమిగలవారంతా కొడుకులేనురా        
జాలిగుండె లేని కొడుకుకన్న కుక్కమేలురా... కుక్కమేలురా

అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి

ఈ బిట్ చిత్రం చివర్లో వస్తుంది:

అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచీ
ప్రేమయనే పాలు పోసి పెంపుచేసెను
కొన్నాళ్ళకు ఆ రాజు కన్నుమూసెను
కుక్క చల్లనైన చూపువల్ల ఇల్లు నిలిచెను
నా ఇల్లు నిలిచెను




చదువు రాని వాడవని పాట సాహిత్యం

 
చిత్రం: ఆత్మ బంధువు (1962)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: సినారె
గానం: సుశీల

పల్లవి:
చదువు రాని వాడవని దిగులు చెందకు ..
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు
చదువు రాని వాడవని దిగులు చెందకు ..
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు
మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో..
జీవించలేని పనికిరాని బ్రతుకులెందుకు

చదువు రాని వాడవని దిగులు చెందకు ..
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు

చరణం: 1
ఏమి చదివి పక్షులు పైకెగుర గలిగేను
ఏ చదువు వల్ల చేపపిల్ల లీదగలిగెను
అడవిలోని నెమలికెవడు ఆట నేర్పేను
అడవిలోని నెమలికెవడు ఆట నేర్పేను...
కొమ్మ పైని కోయిలమ్మ కెవడు పాట నేర్పేను

చదువు రాని వాడవని దిగులు చెందకు ..
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు

చరణం: 2
తెలివి లేని లేగ దూడ పిలుచుని అంబా అని
యేమెరుగని చంటి పాప యేడ్చును అమ్మా అని
చదువులతో పని యేమి హృదయం ఉన్న చాలు
చదువులతో పని యేమి హృదయం ఉన్న చాలు..
కాయితంబు పూల కన్న గరిక పూవు మేలు

చదువు రాని వాడవని దిగులు చెందకు..
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు
చదువు రాని వాడవని దిగులు చెందకు..
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు




ఎవరో ఏ ఊరో పాట సాహిత్యం

 
చిత్రం: ఆత్మ బంధువు (1962)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: సముద్రాల (సీనియర్)
గానం: ఘంటసాల

ఎవరో ఏ ఊరో 




చీరగట్టి సింగారించి.. పాట సాహిత్యం

 
చిత్రం: ఆత్మ బంధువు (1962)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల

పల్లవి:
చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి
చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా.. చిన్నదానా.. హోయ్

చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి
చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా.. చిన్నదానా.. హోయ్
చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి
చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా.. చిన్నదానా.. హోయ్

చరణం: 1
ఒయ్యారము ఒలకబోసినావా.. వాలుచూపులతో గాలమ్ము వేసినావా
ఒయ్యారము ఒలకబోసినావా.. వాలుచూపులతో గాలమ్ము వేసినావా
పెళ్ళికొడుకును పట్టినావా .. పెళ్ళికొడుకును పట్టినావా ..
ఓసి కోడలుపిల్లా ఛాన్సు కొట్టినావా

చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి
చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా.. చిన్నదానా.. హోయ్

చరణం: 2
చందమామవంటి భలే అందగాడు.. బాగ కన్నువేసి నిన్ను కోరుకున్నవాడు
చందమామవంటి భలే అందగాడు.. బాగ కన్నువేసి నిన్ను కోరుకున్నవాడు
నేనన్నమాట తప్పిపోదు ఇటు చూడు.. నేనన్నమాట తప్పిపోదు ఇటు చూడు
ఏడాది తిరగకుండ వచ్చు.. ఏడాది తిరగకుండ వచ్చు చిన్నవాడు

చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి
చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా.. చిన్నదానా.. హోయ్

చరణం: 3
ముక్కుమీదే ఉంది నీకు కోపం..అబ్బో విసురుకుంటే కసురుకుంటే ఏమి లాభం
ముక్కుమీదే ఉంది నీకు కోపం..అబ్బో విసురుకుంటే కసురుకుంటే ఏమి లాభం
వలపు దాచావంటే పరితాపం .. వలపు దాచావంటే పరితాపం..
అది పైకి చెప్పుకుంటేనే ఉల్లాసం

చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి
చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా.. చిన్నదానా.. హోయ్




తీయని ఊహలు పాట సాహిత్యం

 
చిత్రం: ఆత్మ బంధువు (1962)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల, జమునారాణి

తీయని ఊహలు 



మారదు మారదు పాట సాహిత్యం

 
చిత్రం: ఆత్మ బంధువు (1962)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: కొసరాజు
గానం: పి.సుశీల

మారదు మారదు




దక్కెనులే పాట సాహిత్యం

 
చిత్రం: ఆత్మ బంధువు (1962)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: శ్రీ శ్రీ 
గానం: పి.బి.శ్రీనివాస్ , జమునారాణి

దక్కెనులే

Most Recent

Default