Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Captain Nagarjun (1986)



చిత్రం: కెప్టెన్ నాగార్జున్ (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ (All)
గానం: యస్.పి.బాలు
నటీనటులు: నాగార్జున, రాజేంద్రప్రసాద్ , ఖుష్బూ
దర్శకత్వం: వి.బి. రాజేంద్రప్రసాద్
నిర్మాత: వి.బి. రాజేంద్రప్రసాద్
విడుదల తేది: 29.08.1986

మనసు పడితే ప్రేమవుతుంది
మనసు చెడితే ఏమవుతుందీ
చెప్పరాని ఒప్పుకోని తప్పు అవుతుంది
అది ఆరోలేని నిప్పు అవుతుంది

మనసు పడితే ప్రేమవుతుంది
మనసు చెడితే ఏమవుతుందీ
చెప్పరాని ఒప్పుకోని తప్పు అవుతుంది
అది ఆరోలేని నిప్పు అవుతుంది

కానరాని మమత ఒకటుందీ
అది కలత పడితే కథై పోతుందీ
కల్లు పలికే బాష ఒకటుందీ
అది కొన్ని కలలే చదవగలిగేదీ
ఆ బాష కందని బాధ వుందీ
అది రాసుకోను...దాచుకోనూ
కల్లనిండా నీరు వుందీ
నీరు కాస్త యెండి పోతే మండి పోతుందీ
నీరు కాస్త యెండి పోతే మండి పోతుందీ

మనసు పడితే ప్రేమవుతుంది
మనసు చెడితే ఏమవుతుందీ

పొంగులెగసే వయసు ఒకటుందీ
అది రంగు రంగుల కలలు కంటుందీ
ఆ కలలు మలిచే బొమ్మ ఒకటుందీ
అది పగిలి యెపుడో ముక్కలవ్తుందీ
ఆ ముక్కలన్ని దాచుకోనా
అవి చేరుకోకా చెదిరి పోకా
మచ్చగానే మిగులుతుందీ
మచ్చనెవరో గుర్తుపడితే చిచ్చు పెడుతుందీ
మచ్చనెవరో గుర్తుపడితే చిచ్చు పెడుతుందీ

మనసు పడితే ప్రేమవుతుంది
మనసు చెడితే ఏమవుతుందీ
చెప్పరాని ఒప్పుకోని తప్పు అవుతుంది
అది ఆరోలేని నిప్పు అవుతుంది
చెప్పరాని ఒప్పుకోని తప్పు అవుతుంది
అది ఆరోలేని నిప్పు అవుతుంది



*******   *******   *******


చిత్రం: కెప్టెన్ నాగార్జున్ (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

ఝనకు ఝనకు ఝన్ ఝన్ జతిలో
దినకు దినకు దిం దిం లయలో
మువ్వలన్ని ముల్లల్లె అయ్యొ గుచ్చుకున్నయీ
పువ్వులాంతి పాదలు అమ్మో నొచ్చుకున్నయీ
ఆ గాయాలన్ని చల్లని వేల
వలపులు సలపులు పడతాయీ
వలపులు సలపులు పడతాయీ

మువ్వలన్ని ముల్లల్లె అయ్యొ గుచ్చుకున్నయీ
పువ్వులాంతి పాదలు అమ్మో నొచ్చుకున్నయీ

యెన్ని చుక్కలున్నయీ యెన్ని దిక్కులున్నయీ
అన్ని నా కల్లు గా నిన్నే చూడాలిగా
వేయి కన్నిలున్నయీ కోటి చూపులున్నాయీ
నాకు అందాలుగా నీకు బంధాలుగా
ఆ బంధాలె ఒక వరం గా
నీ అందాలె మధు లీనం గా
ఏన్నో వసంతాలు గా
నీకై తపించాను గా
ఆ తాపలన్ని మాపటివేల
తలుపులు తడితే యెట్లాగా
తలుపులు తడితే యెట్లాగా

మువ్వలన్ని ముల్లల్లె అయ్యొ గుచ్చుకున్నయీ
పువ్వులాంతి పాదలు అమ్మో నొచ్చుకున్నయీ
ఆ గాయాలన్ని చల్లని వేల
వలపులు సలపులు పడతాయీ
వలపులు సలపులు పడతాయీ

మువ్వలన్ని ముల్లల్లె అయ్యొ గుచ్చుకున్నయీ
పువ్వులాంతి పాదలు అమ్మో నొచ్చుకున్నయీ

ఎన్ని మొక్కులున్నయీ ఎన్ని ముడుపులున్నయీ
అన్ని నీకివ్వగా దాచి వున్ననుగా
ఎన్ని ఆశలున్నాయీ అన్ని కాచుకున్నయీ
వేల రావాలిగా అన్ని తీరాలిగా
నీ ప్రేమె ఒక జ్వరం గా
నీ పేరె ఒక జపం గా
కలలే దగా చేయగా
చలిలో సెగైనానుగా
ఆ సెగలు వగలు
పగలు రేయి దిలైపోతె యెట్లాగ
దిలైపోతె యెట్లాగ

మువ్వలన్ని ముల్లల్లె అయ్యొ గుచ్చుకున్నయీ
పువ్వులాంతి పాదలు అమ్మో నొచ్చుకున్నయీ
ఆ గాయాలన్ని చల్లని వేల
వలపులు సలపులు పడతాయీ
వలపులు సలపులు పడతాయీ

ఝనకు ఝనకు ఝన్ ఝన్ జతిలో
దినకు దినకు దిం దిం లయలో



*******   *******   *******


చిత్రం: కెప్టెన్ నాగార్జున్ (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

తై తక్క తై తై తక్క
ఆడి పాడి ఒడించు నా పందెము
తై తక్క తై తై తక్క
ఒడి పొఓయి అందించు నీ అందము
కాల్లల్లొ గజ్జల సడి
కల్లల్లొ వజ్రాల జడి
సై అంటు రమ్మంది సరి జొడీ
తై తక్క తై తై తక్క

గ గ స ని ప గ స ని మ ప గ మ
మ గ స ని ప ప ని స గ స
ని స గ మ గ
ప మ గ స
రి రి ప మ ప
ని ని ప మ ప
ప ప మ గ స
స గ స గ మ ప ని స

అడుగెది నడకెది నడుముకి నడకకి పొత్తెది
అడుగెది నడకెది నడుముకి నడకకి పొత్తెది
నీ వొంటి వొంపుల్లొ సొంపున్నదీ
నా కంటి చూపుల్లొ కెంపున్నదీ
ఉన్నదొ లెనిదొ గుప్పించి మెప్పించి
ఒప్పించు నీ గొప్ప ఎమన్నదీ

తై తక్క తై తై తక్క

జడిసింది సడలింది
అడుగులు తడబది ఆడింది
జడిసింది సడలింది
అడుగులు తడబది ఆడింది
నీ కొంటె నవ్వుల్లొ పొగరున్నదీ
నా గుండె లొతుల్లొ సెగలున్నవీ
ఆడలెని ఆడదీ
విద్యంటో ఉందంటు మద్యల్లొ గొడంటూ అంటున్నదీ

తై తక్క తై తై తక్క
ఆడి పాడి ఒడించు నా పందెము
తై తక్క తై తై తక్క
ఒడి పొఓయి అందించు నీ అందము
కాల్లల్లొ గజ్జల సడి
కల్లల్లొ వజ్రాల జడి
సై అంటు రమ్మంది సరి జొడీ
తై తక్క తై తై తక్క


Most Recent

Default