చిత్రం: ఎదురులేని మనిషి (1975)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి.సుశీల, యస్.పి.బాలు
నటీనటులు: యన్.టి.రామారావు , వాణిశ్రీ
దర్శకత్వం: కె.బాపయ్య
నిర్మాత: సి. అశ్వనీదత్
విడుదల తేది: 12.12.1975
పల్లవి:
కసిగా ఉంది.. కసి కసిగా ఉంది
కలవక కలవక కలిసినందుకు.. కస్సుమంటుంది
కసుక్కుమంటూ కాటేయ్ మంటుంది
కసిగా ఉంది.. కసి కసిగా ఉంది
కలవక కలవక కలిసినందుకు.. కస్సుమంటుంది
కస కస నిన్నూ నవిలేయ్ మంటుంది
కసిగా ఉంది.. ఆ.. హా.. కసి కసిగా ఉంది
చరణం: 1
నీ ఛాతీ చూస్తే నిన్న రాతిరి గుర్తుకు వస్తూంది.. అబ్బా
నీ కండలు చూస్తే గుండె నిండా గుబులే పుడుతూంది
నీ ఛాతీ చూస్తే నిన్న రాతిరి గుర్తుకు వస్తూంది
నీ కండలు చూస్తే గుండె నిండా గుబులే పుడుతూంది
గుబులంతా నీ కళ్ళల్లోనే గుబగుబమంటూంది.. లలల..
గుబులంతా నీ కళ్ళల్లోనే గుబగుబమంటూంది .. ఓహో..
అది కొత్త కొత్త కథలను రోజూ చెప్పక చెపుతూంది
కసిగా ఉంది.. కసి కసిగా ఉంది..
కలవక కలవక కలిసినందుకు.. కస్సుమంటుంది
కసుక్కుమంటూ కాటేయ్ మంటుంది..
కసిగా ఉంది.. కసి కసిగా ఉంది
చరణం: 2
ఎంత కాలం నీ కోసం ఎదురు చూస్తూ ఉండేది
ఎదురు తిరిగే పరువాన్ని అదుపులోన ఉంచేది
ఎంత కాలం నీ కోసం ఎదురు చూస్తూ ఉండేది
ఎదురు తిరిగే పరువాన్ని అదుపులోన ఉంచేది
అదుపులోన ఉండనిదాన్ని అనుభవించాలి.. అ
అదుపులోన ఉండనిదాన్ని అనుభవించాలి..
అనుభవానికి రాని దాన్ని వదులుకోవాలి
కసిగా ఉంది కసి కసిగా ఉంది
కలవక కలవక కలిసినందుకు కస్సుమంటుంది
కస కస నిన్నూ నవిలేయ్ మంటుంది
కసిగా ఉంది.. కసి కసిగా ఉంది
చరణం: 3
నీ అండలేక అందరికీ నే నలుసై పోయాను
నువ్వుండగా ఏ మొనగాడు నా జోలికి రాలేడు
నీ అండలేక అందరికీ నే నలుసై పోయాను
నువ్వుండగా ఏ మొనగాడు నా జోలికి రాలేడు
అందుకేగా ఆడదానికో మగవాడుండాలి
అందుకేగా ఆడదానికో మగవాడుండాలి
ఉంటే చాలదు అందుకు తగ్గ మగసిరి ఉండాలి
కసిగా ఉంది.. కసి కసిగా ఉంది.. కలవక కలవక కలిసినందుకు.. కస్సుమంటుంది
కసుక్కుమంటూ కాటేయ్ మంటుంది.. కసిగా ఉంది.. కసి కసిగా ఉంది
కసిగా ఉంది.. ఆ.. కసి కసిగా ఉంది.. కసిగా ఉంది.. ఆ.. హా..కసి కసిగా ఉంది