చిత్రం: గుప్పెడు మనసు (1979) సంగీతం: ఎమ్.ఎస్.విశ్వనాథన్ సాహిత్యం: ఆత్రేయ (All) నటీనటులు: శరత్ బాబు, నారాయణరావు, సరిత, సుజాత దర్శకత్వం: కె.బాలచందర్ నిర్మాతలు: పి.ఆర్.గోవింద రాజన్, జె.దొరస్వామి విడుదల తేది: 07.09.1979
Songs List:
కన్నె వలపు కన్నెల పిలుపు పాట సాహిత్యం
చిత్రం: గుప్పెడు మనసు (1979) సంగీతం:ఎమ్. ఎస్. విశ్వనాథన్ సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు, వాణీ జయరాం కన్నె వలపు సన్నపిలుపు ఎదురు చూస్తున్నవి నిన్నకలలు నేటినురులు ఎగిరి వస్తున్నవి ఇన్నిదినాలు వేచిన వయసు ఆగనంటున్నది వున్న క్షణాలేకొన్ని యుగాలై జాగుచేస్తున్నవి యీ కాలాన్ని నిందించనా మన మొర వినగలదని మేఘాల కబురంపనా మన కధ తెలిసినదని - యీగాలి కరుణించునా విడువని జత మనదని యీ సృష్టి దీవించునా ॥కన్నె || మల్లెలమంచం చల్లనిగంధం పెళ్ళి ఎప్పుడన్నవి పున్నమిరేయి వెన్నెలసాక్షిగ పుస్తె కట్టన్నది మన తొలిరేయి వూహించనా తడబడునడకలతో నీ చెంత నే చేరనా చిదుమని పెదవులపై మునిపంట కాటెయ్యనా... తుది మొదలెరుగని_నీ దాహాన్ని నే తీర్చనా ॥కన్నె ॥
మౌనమే నీ భాష పాట సాహిత్యం
చిత్రం: గుప్పెడు మనసు (1979) సంగీతం:ఎమ్. ఎస్. విశ్వనాథన్ సాహిత్యం: ఆత్రేయ గానం: మంగళంపల్లి బాలమురళి కృష్ణ మౌనమే నీ భాష ఓ మూగ మనసా మౌనమే నీ బాష ఓ మూగ మనసా తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు కల్లలు కాగానే కన్నీరౌతావు మౌనమే నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా చీకటి గుహ నీవు చింతల చెలి నీవు నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో కోర్కెల సెగ నీవు ఊరిమి వల నీవు ఊహల ఉయ్యల్లవే మనసా మాయల దెయ్యానివ్వే లేనిది కోరేవు ఉన్నది వదిలేవు ఒక పొరపాటుకు యుగములు పగిలేవు ఒక పొరపాటుకు యుగములు పగిలేవు " మౌనమే నీ భాష ఓ మూగ మనసా మౌనమే నీ భాష ఓ మూగ మనసా తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు కల్లలు కాగానే కన్నీరౌతావు మౌనమే నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా
నేనా పాడనా పాట పాట సాహిత్యం
చిత్రం: గుప్పెడు మనసు (1979) సంగీతం:ఎమ్. ఎస్. విశ్వనాథన్ సాహిత్యం: ఆత్రేయ గానం: వాణీ జయరాం, యస్.పి.బాలు నేనా... పాడనా పాట మీరా... అన్న దీమాట నీ వదనం భూపాలము నీ హృదయం ధృవతాళము నీ సహనం సాహిత్యము నువు పాడిందే సంగీతము ఇల్లే సంగీతము వంటిల్లే సాహిత్యము ఈ పిల్లలే నా సాధనం ఇంకా... వింటారా నా గానం ఊగే ఉయ్యాలకు నువు పాడే జంపాలకు సరితూగదు ఏ గానము నీకెందుకు సందేహము ఉడకని అన్నానికి మీకొచ్చే కోపానికి ఏ రాగం బాగుండునో చెప్పే త్యాగయ్య మీరేగా కుతకుత వరి అన్నం తెతకతకమను నాట్యం ఏ భరతుడు రాసింది. నీకా పదునెటు తెలిసింది.
నువ్వేనా సంపంగి పువ్వున నవ్వేనా పాట సాహిత్యం
చిత్రం: గుప్పెడు మనసు (1979) సంగీతం: ఎం ఎస్ విశ్వనాథన్ సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు నువ్వేనా సంపెంగ పువ్వున నువ్వేనా ! జాబిల్లి నవ్వున నువ్వేనా గోదావరి పొంగున నువ్వేనా ? నువ్వేనా ? నిన్నేనా ?... అది నేనేనా...? కల కన్నానా ? కనుగొన్నానా అల్లిబిల్లి పద మల్లేనా ? ఆది అందాల పందిరి వేసేనా? కళ్ళేనా హరి విల్లేనా అది చూపేనా... విరి తూపేనా తుళ్ళితుళ్ళిపడు వయ సేనా ? నను తొందర వందర చేసేనా? నువ్వైనా ? నీ నీడైనా ఏనాడైనా నా తోడేనా మళ్ళీ మళ్ళీ కలవచ్చేనా ? ఇలా మల్లెలు మాపై విచ్చేనా...