చిత్రం: గురు శిష్యులు (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ (All)
గానం: యస్.పి.బాలు, చిత్ర (All)
నటీనటులు: కృష్ణంరాజు , రాజేంద్రప్రసాద్ , సుమలత , కుష్బూ
దర్శకత్వం: యస్.పి.ముత్తురామన్
నిర్మాతలు: యమ్.పూర్ణ ప్రకాష్ , యస్.సాంబశివరావు
విడుదల తేది: 1990
పల్లవి:
మత్తుగా చిత్తుగా తేనెపట్టు కొట్టానయ్యా
కొత్తకాదు ఉన్నోళ్ల కూతుర్నై పుట్టానయ్యా
మత్తుగా చిత్తుగా తేనెపట్టు కొట్టానయ్యా
కొత్తకాదు ఉన్నోళ్ల కూతుర్నై పుట్టానయ్యా
నీటిలో చేపలా దాగున్నది తాగిన లేదులే తప్పన్నది
డబ్బుతో వచ్చిన జబ్బేనయ్యా తండ్రికి తగ్గదీ బిడ్డేనయ్యా
మత్తుగా చిత్తుగా తేనెపట్టు కొట్టానయ్యా
కొత్తకాదు ఉన్నోళ్ల కూతుర్నై పుట్టానయ్యా
చరణం: 1
కుర్రదంటే ఒక గుర్రమంటా దమ్ము ఉంటే నన్ను తెమ్మంటా
పెగ్గులంటే ఒళ్ళు మంటంటా బాటిలుంటే కాచుకోమంటా
వయసోక తాపం నీళ్లతో తీరదు దాహం
మధువక స్నేహం చేసినా కాదది పాపం
ఆడు తైతక్కని ఈడు వేడెక్కని
అందాలు బంధాలు అయిపోని
ఒళ్ళు చల్లారని తెలివి తెల్లారని
పొద్దుల్ని ముద్దుల్ని మాపేయ్ నీ
ఇంపు ఈడున్నది సొంపు తోడున్నది
లేనే లేదు ఇంక అడ్డన్నది
మత్తుగా చిత్తుగా తేనెపట్టు కొట్టానయ్యా
కొత్తకాదు ఉన్నోళ్ల కూతుర్నై పుట్టానయ్యా
చరణం: 2
ఆడదంటే గొప్ప ఏమున్నది గొర్రెలాంటిది అన్న పేరున్నది
బంధామంటూ అరె ఎక్కడున్నది
వ్యాపారమే దాని ఊపిరైనది
ప్రేమొక పాట అందులో మనసోక మాట
బ్రతుకొక ఆట కలిమికే గెలుపనమాట
గ్లాసు నిండున్నది నైసు ఊపున్నది
కళ్ళల్లో ఎర్రాని కైపుంది
కాదు రేపన్నది పోదు మాపన్నది
ఈరోజు నా మోజు తీరేది
సిగ్గు యెగ్గన్నది లేదు రానన్నది
సందు చూసి గూబ గుర్రన్నది
మత్తుగా చిత్తుగా తేనెపట్టు కొట్టానయ్యా
కొత్తకాదు ఉన్నోళ్ల కూతుర్నై పుట్టానయ్యా
నీటిలో చేపలా దాగున్నది తాగిన లేదులే తప్పన్నది
డబ్బుతో వచ్చిన జబ్బేనయ్యా తండ్రికి తగ్గదీ బిడ్డేనయ్యా
మత్తుగా చిత్తుగా తేనెపట్టు కొట్టానయ్యా
కొత్తకాదు ఉన్నోళ్ల కూతుర్నై పుట్టానయ్యా