చిత్రం: హలో (2017) సంగీతం: అనూప్ రూబెన్స్ నటీనటులు: అఖిల్ , కళ్యాణి ప్రియదర్శన్ దర్శకత్వం: విక్రమ్ కుమార్ నిర్మాత: అక్కినేని నాగార్జున విడుదల తేది: 22.12.2017
Songs List:
హెల్లొ పాట సాహిత్యం
చిత్రం: హలో (2017) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: శ్రేష్ఠా , వనమాలి గానం: అర్మాన్ మాలిక్ హెల్లొ ఎక్కడున్న హెల్లొ ఎమయ్యవ్ హెల్లొ వింటున్నవా ఈ వేలలో హెల్లొ ఇటు రావా హెల్లొ హెల్లొ మరిచావా హెల్లొ గడిపేస్తున్న నీ ద్యాసలో హెల్లొ ఎక్కడెక్కడున్నవు హెల్లొ ఎం చేస్తున్నవు కనపడవా, వినపడవా ఎంత కాలమైన నన్ను చేరవా girl i say hello hello i feel the love and it makes me glow girl you are my love for sure i hear you calling me hello hello నువ్వెంత దూరమున్న ఏ చోట దాగి ఉన్నా నీ జాడ తెలుసుకోనా నీ చెంత చేరుకొనా యె నాడు వీడిపోనీ నీ తోడు నీడ నేనై నీ వెంటే నడిచి రానా నీతోనె ఉండిపోనా ఉండిపోనా.. హెల్లొ ఎక్కడున్న హెల్లొ ఎమయ్యవ్ హెల్లొ వింటున్నవా ఈ వేలలో హెల్లొ ఇటు రావా హెల్లొ హెల్లొ మరిచావా హెల్లొ గడిపేస్తున్న నీ ద్యాసలో
అనగనగా ఒక ఊరు పాట సాహిత్యం
చిత్రం: హలో (2017) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: చంద్రబోస్ గానం: శ్రీ ధృతి అనగనగా ఒక ఊరు అనుకోకుండ ఒక నాడు కలిసారే పసివాల్లు స్నేహంగా సంతోషమంత రెక్కలుగా రివ్వంటు యెగిరె పక్షులుగా ఆకశమంత ఆటాడుకుంటు ఉన్నరు సరదాగా ఒకరేమొ సీను ఒక్కరెమొ జున్ను కలిసారె ప్రాణంగ కురిసారె వర్షంగ పాటేమొ సీను ఆటెమొ జున్ను ఒకటై యెదిగారె మధురంగ ప్రపంచమంత తమ ఇల్లంటు ప్రతి క్షణం ఒక పండుగగా కన్నీరు లేని కలలే కంటు చిన్నరి చెలిమే బలపడగా తియ తియ్యని ఊసులతో తెల తెల్లని మనసులలో కథ ఇలాగ మొదలయ్యెగా కథ ఇలాగ మొదలయ్యెగా అనగనగా ఒక ఊరు అనుకోకుండ ఒక నాడు కలిసారె పసివాల్లు స్నేహంగ యెగిరిన బుడకలలోన చెలిమె ఉరికిన పడవలలోన చెలిమె రంగుల రట్నంలో చెలిమె చిందులు వేసిందే మినుగురు వెలుగులలోన చెలిమె తొలకరి తేనెలలోన చెలిమె గాజుల గలగలలో చెలిమె సందడి చెసిందే ఈ గ్నాపకాలన్ని నిలెచెనులే ఈ జీవితానికి బలమై నడిపెనులే ఈ సాక్ష్యాలే అనుభందాల బవనానికి స్థంబాలె అనగనగ ఒక ఊరు అనుకోకుండ ఒక నాడు కలిసారె పసివాల్లు స్నేహంగ తెలపని కబురులలోన చెలిమె తిరగని మలుపులలోన చెలిమె దొరకని చూపులలో చెలిమె దోసిలి నింపింది జరిగిన నిమిషములోన చెలిమె యెరగని మరు నిమిషాన చెలిమె కాలం చెక్కిలిలో చెలిమె చుక్కై మెరిసిందే చిననాడు మురిపించే ఈ గురుతులె కనరాని దారిని చూపే మీ గురువులె ఉండాలంటు ఈ బతుకంతా ఈ మాటలకి కట్టుబడి
తలచి తలచీ పాట సాహిత్యం
చిత్రం: హలో (2017) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: వనమాలి గానం: హరిచరణ్ తెలిసీ తెలియని ఊహలో కలిసీ కలవని దారిలో యెటు వెల్లిందొ యెటు వెల్లిందో మనసే విరిసీ విరియని స్నేహమై పలికీ పలకని రాగమై యెటు వెల్లిందొ యెటు వెల్లిందో మనసే పలకరించె పాటలా మనసూగెను ఊయలా ఎదిగింది అందమైన ఓ కలా ఏమయ్యిందో ఏమో గాని యెవరు పోల్చుకోని ఇరు దారుల్లొ యెటు నడిచారొ ఈ వేలా తలచి తలచీ వెతికే కన్నులివిగో తిరిగి తిరిగీ అలిసే అడుగులివిగో యెదురు చూసి చూసీ యెంతకాలమైనా జత చేరకుండ ఆశ జారిపోయెనా తలచి తలచీ వెతికే కన్నులివిగో తిరిగి తిరిగీ అలిసే అడుగులివిగో తెలిసీ తెలియని ఊహలో కలిసీ కలవని దారిలో యెటు వెల్లిందొ యెటు వెల్లిందో మనసే విరిసీ విరియని స్నేహమై పలికీ పలకని రాగమై యెటు వెల్లిందొ యెటు వెల్లిందో మనసే కన్నుల్లొ కల నిజమవక నిదురించవుగ ఈ హ్రుదయాలు ముల్లున్న తమ దారుల్లొ పరుగాపరులే ఈ పసివాల్లు ఆ నిన్నలో ప్రతి గ్నాపకము ఈ జంటనె వెంటాడేన ఆ లోకమె యెటు వెల్లిందొ కానరాదు కాస్తైనా తలచి తలచీ వెతికే కన్నులివిగో తిరిగి తిరిగీ అలిసే అడుగులివిగో యెదురు చూసి చూసీ యెంతకాలమైనా జత చేరకుండా ఆశ జారిపోయేనా తలచి తలచీ వెతికే కన్నులివిగో తిరిగి తిరిగీ అలిసే అడుగులివిగో ఇద్దరికి పరిచయమే ఒక కల లాగ మొదలయ్యిందా ఇద్దరుగా విడిపోయక అది కలాగానె మిగిలుంతుందా పసి వాల్లుగ వేరయ్యక ఇన్నల్లుగ యెమయ్యరొ ఈ నేలపై నలుదిక్కుల్లొ యెటు దాగి ఉన్నరొ తలచి తలచీ వెతికే కన్నులివిగో తిరిగి తిరిగీ అలిసే అడుగులివిగో యెదురు చూసి చూసీ యెంతకాలమైనా జత చేరకుండ ఆశ జారిపోయెనా తలచి తలచీ వెతికే కన్నులివిగో తిరిగి తిరిగీ అలిసే అడుగులివిగో
ఏవేవో కలలు కన్న పాట సాహిత్యం
చిత్రం: హలో (2017) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: చంద్రబోస్ గానం: అఖిల్ అక్కినేని, జోనిత గాంధి ఏవేవో కలలు కన్న ఏవైపో కదులుతున్న ఏమైందొ తెలియకున్న ఎన్నెన్నొ జరుగుతున్న ఏమొ ఏమైందో నాలోనె ఏమైందో ఏమొ ఏముందో ఇకముందేం కానుందో ఇదేమి ఇదేమిటో...ఈమాయ పేరేమిటో ఇదేమి ఇదేమిటో...ఈమాయ పేరేమిటో ఏవేవో కలలు కన్న ఏవైపో కదులుతున్న ఏమైందొ తెలియకున్న ఎన్నెన్నొ జరుగుతున్న ఏమొ ఏమైందో నాలోనె ఏమైందో ఏమొ ఏముందో ఇకముందేం కానుందో ఇదేమి ఇదేమిటో...ఈమాయ పేరేమిటో ఇదేమి ఇదేమిటో...ఈమాయ పేరేమిటో తలచుకున్న వేలలో తెలుసుకున్న వెలుగేమిటో కలుసుకున్న వేలలో క్షనముకింత విలుమేమిటో ఇలా నేను నా నువ్వు మనమైన ఈ వేలల్లో ఈ వెలుగేమొటో...ఈ పరుగేమిటో...మైమరపేమిటో హాయి గీతాలలో ఈ బాషేమిటొ భవాలేమిటో ఈ తియ్యనీ బంధాలేమొటో ఏవేవో కలలు కన్న ఏవైపో కదులుతున్న ఏమైందొ తెలియకున్న ఎన్నెన్నొ జరుగుతున్న ఏమొ ఏమైందో నాలోనె ఏమైందో ఏమొ ఏముందో ఇకముందేం కానుందో ఇదేమి ఇదేమిటో...ఈమాయ పేరేమిటో ఇదేమి ఇదేమిటో...ఈమాయ పేరేమిటో
అనగనగా ఒక ఊరు పాట సాహిత్యం
చిత్రం: హలో (2017) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: చంద్రబోస్ గానం: శ్రేయా ఘోషల్ అనగనగా ఒక ఊరు అనుకోకుండ ఒక నాడు కలిసారే పసివాల్లు స్నేహంగా సంతోషమంత రెక్కలుగా రివ్వంటు యెగిరె పక్షులుగా ఆకశమంత ఆటాడుకుంటు ఉన్నరు సరదాగా ఒకరేమొ సీను ఒక్కరెమొ జున్ను కలిసారె ప్రాణంగ కురిసారె వర్షంగ పాటేమొ సీను ఆటెమొ జున్ను ఒకటై యెదిగారె మధురంగ ప్రపంచమంత తమ ఇల్లంటు ప్రతి క్షణం ఒక పండుగగా కన్నీరు లేని కలలే కంటు చిన్నరి చెలిమే బలపడగా తియ తియ్యని ఊసులతో తెల తెల్లని మనసులలో కథ ఇలాగ మొదలయ్యెగా కథ ఇలాగ మొదలయ్యెగా అనగనగా ఒక ఊరు అనుకోకుండ ఒక నాడు కలిసారె పసివాల్లు స్నేహంగ యెగిరిన బుడకలలోన చెలిమె ఉరికిన పడవలలోన చెలిమె రంగుల రట్నంలో చెలిమె చిందులు వేసిందే మినుగురు వెలుగులలోన చెలిమె తొలకరి తేనెలలోన చెలిమె గాజుల గలగలలో చెలిమె సందడి చెసిందే ఈ గ్నాపకాలన్ని నిలెచెనులే ఈ జీవితానికి బలమై నడిపెనులే ఈ సాక్ష్యాలే అనుభందాల బవనానికి స్థంబాలె అనగనగ ఒక ఊరు అనుకోకుండ ఒక నాడు కలిసారె పసివాల్లు స్నేహంగ తెలపని కబురులలోన చెలిమె తిరగని మలుపులలోన చెలిమె దొరకని చూపులలో చెలిమె దోసిలి నింపింది జరిగిన నిమిషములోన చెలిమె యెరగని మరు నిమిషాన చెలిమె కాలం చెక్కిలిలో చెలిమె చుక్కై మెరిసిందే చిననాడు మురిపించే ఈ గురుతులె కనరాని దారిని చూపే మీ గురువులె ఉండాలంటు ఈ బతుకంతా ఈ మాటలకి కట్టుబడి
మెరిసే మెరిసే మెరిసే పాట సాహిత్యం
చిత్రం: హలో (2017) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: వనమాలి గానం: హరిచరన్, శ్రీనిధి వెంకటేష్ , శృతి రంజిని మెరిసే మెరిసే మెరిసే ఆ కన్నుల్లో ఏదో మెరిసే ఆ మనసే మురిసే మురిసే ఆ సంగతి నాకు తెలుసే కురిసే కురిసే కురిసే నవ్వుల్లో వెన్నెల కురిసే ఇది కొత్తగా మారిన వరసే ఆ సంగతి నాకు తెలుసే సన్నాయి మోగేనా అమ్మాయి గుండెలో ఈ రేయి ఆశలే రేగేలా రావోయి అల్లరి అబ్బాయి అందుకో ఈ చేయి ఒకటై సందడి చేసేలా దినక్ నక్ దిరణ తనక్ దిన దినక్ నక్ దిరణ ఓ దినక్ నక్ దిరణ జోర్ సే డోలు బజావో నా (2) రెండు గుండెల చప్పుడు ఒకటే మూడు ముళ్ల ముచ్చట కాగా ఈడు జోడు కలిసి తోడు నీడై సాగగా ఏడు జన్మల బంధమిదేలే ఏడు అడుగులు వేస్తూ ఉంటే చిన్న పెద్ద అంతా సంబరాలే చేయరా ఆనందం పువ్వుల మాలలుగా ఇప్పుడే అల్లెస్తూ హాయిగా తేల్చేగా బంధాలే ఈ ప్రేమ జంటనిలా పెళ్లిలో బంధించే కమ్మని కన్నుల పండుగగా దినక్ నక్ దిరణ తనక్ దిన దినక్ నక్ దిరణ ఓ దినక్ నక్ దిరణ జోర్ సే డోలు బజావో నా అరె షాదియాల వచ్చెరా షురూగిట్ల పరిషాను సంజైతాలేదా చెప్తా చూడు ఓ కహానీ పెండ్లి పిల్లగాడు ముందు కింగు లెక్క తిరుగుతుండె ఇంక పెండ్లి అయ్యినంక ఆమె కొంగుబట్టి ఊగుడంతే హోయ్ - అంతే హోయ్ - అంతే అంతే మాటలాడనంటది వెయ్యకుంటే సోపు అందగత్తె లెందరున్న నువ్వేమేటి తోపు అంటు గాపులేక పొగడకుంటే రోజు గిట్ల గడవదంతే అంతే అంతే ఆమె గొప్పలెన్నో జెప్పనీకి తిప్పలెన్నో పెట్టెనంట సప్పగున్న లైఫ్ లోకి అప్పు లొల్లి తప్పదంతే ఆడిగినన్ని చీరలింక నువ్వుతెచ్చి పెట్టకుంటే మాటనీది ఇంటిలోన నడవదంతే నడవదంతే అంతే అంతే అంతే మెరిసే మెరిసే మెరిసే ఆ కన్నుల్లో ఏదో మెరిసే ఆ మనసే మురిసే మురిసే ఆ సంగతి నాకు తెలుసే దినక్ నక్ దిరణ తనక్ దిన దినక్ నక్ దిరణ ఓ దినక్ నక్ దిరణ జోర్ సే డోలు బజావో నా (2)