చిత్రం: ఇంద్రసేన (2017)
సంగీతం: విజయ్ ఆంటోని
సాహిత్యం: బాషాశ్రీ
గానం: కార్తిక్
నటీనటులు: విజయ్ ఆంటోని, డయానా చంపిక, మహిమ
దర్శకత్వం: జి.శ్రీనివాసన్
నిర్మాతలు: ఫాతిమా విజయ్ ఆంటోని, రాధికా శరత్ కుమార్
విడుదల తేది: 30.11.2017
పల్లవి:
వజ్రమా ముత్యమా ఎవరు వీడు
వీడ్ని పోల్చుటకు ఏదీ సరిపోదు
సొంతమా బంధమా ఏదీ కాడు
ఐనా కష్టమంటే చాలు వీడు వచ్చేస్తాడు
సత్యమే వీడు చల్లగుండ
సత్యమైన దెళ్ల వీడ్ని మొక్కకుండా
స్వచ్చం కన్నా ఎంతో స్వచ్చమైన వాడే ఇంద్రసేన
వజ్రమా ముత్యమా ఎవరు వీడు
వీడ్ని పోల్చుటకు ఏదీ సరిపోదు
సొంతమా బంధమా ఏదీ కాడు
ఐనా కష్టమంటే చాలు వీడు వచ్చేస్తాడు
చరణం: 1
లోకంలోని ప్రేమంతా వీడై రూపం దాల్చెనే
లోకంలోని ప్రేమంతా వీడై రూపం దాల్చెనే
అడిగి చూడు గాయమే చెప్పే వీడి గాధలే
ఉలినే ఓర్చుకున్న శిల్పం వీడు
నిజమే వేయికథల కందనీడు
సత్యమే వీడు చల్లగుండ
సత్యమైన దెళ్ల వీడ్ని మొక్కకుండా
స్వచ్చం కన్నా ఎంతో స్వచ్చమైన వాడే ఇంద్రసేన
వజ్రమా ముత్యమా ఎవరు వీడు
వీడ్ని పోల్చుటకు ఏదీ సరిపోదు
సొంతమా బంధమా ఏదీ కాడు
ఐనా కష్టమంటే చాలు వీడు వచ్చేస్తాడు
చరణం: 2
కన్నీటిలో తానున్నా నీ కళ్ళే తుడిచే దేవుడే
కన్నీటిలో తానున్నా నీ కళ్ళే తుడిచే దేవుడే
సాయం అంటు ఎవ్వరోచ్చినా ప్రాణం ఇచ్చు రాజులే
కట్టలే కాలి కాలి బొట్టు అవులే
ఇతని బాధ చదువు చరితౌలే
సత్యమే వీడు చల్లగుండ
సత్యమైన దెళ్ల వీడ్ని మొక్కకుండా
స్వచ్చం కన్నా ఎంతో స్వచ్చమైన వాడే ఇంద్రసేన
వజ్రమా ముత్యమా ఎవరు వీడు
వీడ్ని పోల్చుటకు ఏదీ సరిపోదు
సొంతమా బంధమా ఏదీ కాడు
ఐనా కష్టమంటే చాలు వీడు వచ్చేస్తాడు
సత్యమే వీడు చల్లగుండ
సత్యమైన దెళ్ల వీడ్ని మొక్కకుండా
స్వచ్చం కన్నా ఎంతో స్వచ్చమైన వాడే ఇంద్రసేన
****** ****** ******
చిత్రం: ఇంద్రసేన (2017)
సంగీతం: విజయ్ ఆంథోని
సాహిత్యం: భాష్యశ్రీ
గానం: హేమచంద్ర, సుప్రియ జోషి
జిఎస్టీలా నువ్వే వచ్చి ఎంతపని చేస్తివే
మాటైనా చెప్పక వచ్చి తీపి కోతే కోస్తివే
భూకంపం మాదిరి వచ్చి బొమ్మే చూపి పోతివే
చూపుల్తో గునపాలే గుచ్చి గుండే లాక్కుపోతివే
నిద్దురపోయే నా కంటి నిద్దురమొత్తం
వీడిపోయే హే నీవల్లే
చేరిపోయే నా రక్తంలో మత్తే ఎక్కి
తూగిపోయే హే నా వల్లే
జిఎస్టీలా నువ్వే వచ్చి ఎంతపని చేస్తివే
మాటైనా చెప్పక వచ్చి తీపి కోతే కోస్తివే
భూకంపం మాదిరి వచ్చి బొమ్మే చూపి పోతివే
చూపుల్తో గునపాలే గుచ్చి గుండే లాక్కుపోతివే
ఎన్నెన్నో జన్మాలు వెతికాయి రాత్రంత
నా రెండు నయనాలు నీకోసము
నాలోని ఎరుపంత మింగేసి నీ పెదవి
కసితీర తీస్తుందె నా ప్రాణము
ఓఓ నడిచేటి నదిలాగె వచ్చావురా
అదిరేటి ఎద చప్పుడయ్యావురా
నన్నైన నే మరిచి పోగలనురా
అరె నిను మరిచి పోతే నేనుంటానయ్యా
జిఎస్టీలా నువ్వే వచ్చి ఎంతపని చేస్తివే
మాటైనా చెప్పక వచ్చి తీపి కోతే కోస్తివే
భూకంపం మాదిరి వచ్చి బొమ్మే చూపి పోతివే
చూపుల్తో గునపాలే గుచ్చి గుండే లాక్కుపోతివే
ఆకాశమేదాటి స్వర్గాలె వెతికాను
నీలాంటి దేవత లేనే లేదు
ఏ భాషలేనట్టి నీ కంటి ఊసులకు
అర్ధాలు వెదికేను నా ధ్యానము
నువ్ ఔనన్న కాదన్న నా సోకువి
ఏడ్చిన నవ్విన నా బంటువి
గెలిచిన ఓడిన నా విజయమే
విడిచిన దాచిన నా ప్రాణమే
జిఎస్టీలా నువ్వే వచ్చి ఎంతపని చేస్తివే
మాటైనా చెప్పక వచ్చి తీపి కోతే కోస్తివే
భూకంపం మాదిరి వచ్చి బొమ్మే చూపి పోతివే
చూపుల్తో గునపాలే గుచ్చి గుండే లాక్కుపోతివే