చిత్రం: మెంటల్ మదిలో (2017)
సంగీతం: ప్రశాంత్ ఆర్.విహార్
సాహిత్యం: కిట్టు విస్సప్రగడ
గానం: రేవంత్ , రజిని శివకుమార్
నటీనటులు: శ్రీ విష్ణు , నివేద పేతురాజ్
దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాత: రాజ్ కందుకూరి
విడుదల తేది: 24.11.2017
ఏదోలా ఏదోలా ఉందే ఈ వేళా
ఈ రోజే మారాల నేను నీలా సాగే వేళా
ఏదోలా ఏదోలా ఉందే ఈ వేళా
ఈ దారే కావాలా నీకు నాలా
హలో అంటు ఫ్రీడమ్ కూడా పిలుస్తోందిలాగ
చలో అంటు దూరం కూడా దూరం కాదా ఈవేళ
హలో అంటు ఫ్రీడమ్ కూడా పిలుస్తోందిలాగ
చలో అంటు దూరం కూడా ఓకే అంటూ దూరం కాదా
ఏదోలా ఏదోలా ఉందే ఈ వేళా
ఏదోలా ఏదోలా నేను నీలా సాగే వేళ
నీలో సగమై ఓ నిజమై ఓ వరమై
వరమే నిజమై
నాలో సగమే ఓ వరమై
ఓ నిజమై
నిన్నే పిలిచే ఓ పదమై ఓ స్వరమై
స్వరమే వరమై
నన్నే పిలిచే ఓ స్వరమే ఓ వరమై
అడుగులతోనే పరుగులు తీస్తూ
ఎటుపోనుందో ఏమో
పరుగెడు తూనే పడిపోతున్నా
పడమంటుందే మనసే
ఏదోలా ఏదోలా ఉందే ఈ వేళా
ఈ రోజే మారాల నేను నీలా సాగే వేళా
ఓ నువ్వే ఎదురై ఓ మలుపై ఓ గెలుపై
గెలుపే ఓ మలుపై
ఓ నువ్వే ఎదురై ఓ గెలుపై ఓ మలుపై
నీకై వలచి ఓ కథనై ఓ కలనై
కలలో కథనై
నీకై వలచి ఓ కలనై ఓ కథనై
సరిపోవంటూ అడుగులు వేస్తే ఎదురీదాలో ఏమో
అలుపంటూనే పరిగెడుతుంటే నిలబడుతుందా మనసే
ఏదోలా ఏదోలా ఉందే ఈ వేళా
ఈ రోజే మారాల నేను నీలా సాగే వేళా
ఏదోలా ఏదోలా ఉందే ఈ వేళా
ఈ దారే కావాలా నీకు నాలా
హలో అంటు ఫ్రీడమ్ కూడా పిలుస్తోందిలాగ
చలో అంటు దూరం కూడా దూరం కాదా ఈవేళ
హలో అంటు ఫ్రీడమ్ కూడా పిలుస్తోందిలాగ
చలో అంటు దూరం కూడా ఓకే అంటూ దూరం కాదా
****** ****** ******
చిత్రం: మెంటల్ మదిలో (2017)
సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి
సాహిత్యం: వివేక్ ఆత్రేయ
గానం: శక్తిశ్రీ గోపాలన్
ఊఊఊహూ..ఊఊఊహూ..
ఊహలే ఆగవే
వెంట నీవుంటే పాటలా
నీ జతే వీడితే
ఒంటరయ్యేనూ ఆ కలా
ఊఊఊహూ..ఊఊఊహూ..
ఊహలే ఆగవే
వెంట నీవుంటే పాటలా
నీ జతే వీడితే
ఒంటరయ్యేనూ ఆ కలా
అలై చేరవా ప్రియా
తీరానికే స్వరం నీవై
దరే తాకుతూ అలా
దాటేయకు మరో నీడై
ఓఓఓ అలై చేరవా ప్రియా
తీరానికే స్వరం నీవై
దరే తాకుతూ అలా
దాటేయకు మరో నీడై
ప్రతిపదం పాదమై
ఓ గానమై నీ చెంత చేరదా
పదే పదే ఊసులై
ఊరించెనే ఎడారి వానలా
ఊఊఊఊ... ఊఊఊఊ