చిత్రం: మిస్టర్ భరత్ (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, జానకి
నటీనటులు: శోభన్ బాబు, రాజ శేఖర్ , సుహాసిని, రజిని శారద, చరణ్ రాజ్,
దర్శకత్వం: రాజాచంద్ర
నిర్మాత: జయకృష్ణ
విడుదల తేది: 28.03.1986
పల్లవి:
సరాసరి ఇలావచ్చి ప్రేమించకు
మరి మరి ఏదోచేసి వేధించకు
రోజు రాత్రి కల్లోకొచ్చి వయ్యారాల వల్లోవేసి
రోజు రాత్రి కల్లోకొచ్చి వయ్యారాల వల్లోవేసి
చూపులతో గుచ్చి గుచ్చి ప్రాణాలన్ని తినేయకు
సరే సరే సరే సరే
సరే సరే అలాగని శృతిమించకు
పదే పదే ఇలాగ నా చలి పెంచకు
కన్నె కొట్టి కొంగే పట్టి అన్నీ దాటి ముద్దే పెట్టి
సిగ్గులని గిల్లి గిల్లి నా పరువే తీసేయకు
సరాసరి ఇలావచ్చి ప్రేమించకు
పదే పదే ఇలాగ నా చలి పెంచకు
చరణం: 1
ఆడపిల్లకి తగునా ఇంత చొరవా
తీరా నేనంటుకుంటే ఇంత గొడవా
అలాగని తీస్తారా కన్నె విలువ
నా తప్పే మన్నించు ఒక్క తడవ
సరేనని వస్తే ఈ సరాగములేలా
వరించినా మోమాటాలా
పదామరి అంటే ఈ పరాకులింకేల
మరింతగా ఆరాటాలా
వయసుల్లో ఉన్న పస మనసుల్లో ఉన్న నస
వినకుంటే ఎట్టాగే బులిపించే బుల్లెమ్మ
సరే సరే అలాగని శృతిమించకు
పదే పదే ఇలాగ నా చలి పెంచకు
రోజు రాత్రి కల్లోకొచ్చి వయ్యారాల వల్లోవేసి
చూపులతో గుచ్చి గుచ్చి ప్రాణాలన్ని తినేయకు
సరే సరే అలాగని శృతిమించకు
మరి మరి ఏదోచేసి వేధించకు
చరణం: 2
నీ మీదే ఉంటుంది పాడు తలపు
నిదరైన పోనీదు ఏమి వలపు
అందుకనే కట్టాను ఇంటి తలుపు
పాడాను నా ప్రేమ మేలుకొలుపు
ఇదే కదా వలపు ఆ కదే వేరు కాదా
అదే తెలిసి ప్రేమిస్తావా
ఇదే సుమా వలపు ఆ మజా వేరు కాదా
చలాకీగా ముద్దిస్తావా
కళ్ళల్లో ఉన్న కసి కౌగిట్లో ఉన్న రుచి
మననుషులకి ఇంకేల ఎల్లెళ్ళు మావయ్య
సరాసరి సరాసరి
సరాసరి ఇలావచ్చి ప్రేమించకు
మరి మరి ఏదోచేసి వేధించకు
కన్నె కొట్టి కొంగే పట్టి అన్నీ దాటి ముద్దే పెట్టి
సిగ్గులని గిల్లి గిల్లి నా పరువే తీసేయకు
సరాసరి ఇలావచ్చి ప్రేమించకు
మరి మరి ఏదోచేసి వేధించకు
ఏయ్ సరే సరే అలాగని శృతిమించకు
పదే పదే ఇలాగ నా చలి పెంచకూ...