చిత్రం: మూడు ముక్కలాట (2000)
సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్. పి.బాలు, చిత్ర
నటీనటులు: జగపతిబాబు, సౌందర్య, రాశి, రంభ
దర్శకత్వం: రాఘవేంద్రరావు
నిర్మాత: రామోజీరావు
విడుదల తేది: 01.09.2000
వాన కన్యకా వలపు కానుక
నీ తలా తల మెరుపుల విరుపులు నాకే జాబురాయగా
మేఘమాలికా మెరుపు చాలిక
ఈ చిట పట చినుకుల దరువులు నాకే కన్నుగీటగా
చలి చలి ఉడుకుల చమకంలో
తొలి ఉడి దుడుకుల గమకంలో
తెగించి హద్దులు ముగించి ముద్దులు
బిగించి బంధాలే పాడన సౌదర్య లహారి
మేఘమాలికా మెరుపు చాలిక
ఈ చిట పట చినుకుల దరువులు నాకే కన్నుగీటగా
వాన వాన వాన వాన వాన వాన వాన వాన వాన..
వాన వాన వాన వాన వాన వాన వాన వాన జడి వాన
చరణం: 1
అమ్మ బాబోయ్ పరువాన
ఈ తడి తడి అలజడి వాన
వద్దు వద్దోయమ్మ ఆపోదోయమ్మ
యమా యమా సమయాన
అయ్యో బాబోయ్ కురిసేన
ఈ తొలకరి చినుకుల సేన
ఇద్దు ఇద్దోయమ్మ మనసిద్ధోయమ్మా
తహ తహ తరుణాన
వానమ్మ వడగల్లో జాణమ్మ చెడుగుల్లో
నాజూకు నలుగుల్లో అందాల అలుగుల్లో
అబ్బబ్బబ్బా వరించి ప్రేయసి
ఉరించి హాయిని హరించు వెళ్లలో
రాయన శృంగార లహారి
మేఘమాలికా మెరుపు చాలిక
వాన కన్యకా వలపు కానుక
చరణం: 2
ఎందుకబ్బా చెలువాన ఈ మగసిరి సెగసరి వాన
చాలు చాలోయబ్బా ఎట్టగబ్బా వలపుల వడదెబ్బా
ఏమిటబ్బా చెలివాన ఈ సిరి సిరి సొగసిరి వాన
వాలు వాలోయబ్బా వానోయబ్బా వయసుల ముసురబ్బా
తడిమేటి తాపాలు బుడమేటి ప్రాయాలు
హాయ్ తడిచీర తాళాలు నడుమింటి నాట్యాలు
అబ్బబ్బబ్బా జవాబు దొరకని
సవాలు వలపే శివాలు పుట్టిస్తే చేరనా ని ప్రేమనగరి
వాన కన్యకా వలపు కానుక
నీ తలా తల మెరుపుల విరుపులు నాకే జాబురాయగా
చలి చలి ఉడుకుల చమకంలో
తొలి వడిదుడుకుల గమకంలో
తెగించి హద్దులు ముగించి ముద్దులు
బిగించె బంధాలే పాడనా సౌదర్య లహారి