Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Pravarakhyudu (2009)



చిత్రం: ప్రవరాఖ్యుడు (2009)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం:  చైతన్య ప్రసాద్ (All)
గానం: అనుజ్ గురవార
నటీనటులు: జగపతిబాబు , ప్రియమణి
దర్శకత్వం: ఆర్.ఆర్. మధన్
నిర్మాత: గణేష్ ఇందుకూరి
విడుదల తేది: 04.12.2009

ఏమైపోయానో ఏమైపొతున్నానో
నీతోనే సావాసం మొదలెట్టాకా
నీ నీడది నా పేరే అని తెలిసాకా
మాటాడాలంటు చూడాలంటు చేరాలంటు తాకాలంటు
నీలో ఏకం కావాలంటు ఆలోచిస్తూ ఆలోచిస్తు
ఏమైపోయానో ఏమైపోతున్నానో

ఏ ఏ ఏ ఏ చోట తిరిగినా నీ రూపే కనపడుతోంది
ఏం చెయ్యను ఏంచెయ్యను ఏంచెయ్యను

ఏ ఏ ఏ ఏ గాలి తాకినా నువ్వు తాకినట్టే ఉంది
కంఫ్యుజన్ కంఫ్యుజన్ కంఫ్యుజన్ కంఫ్యుజన్

Oh My Love Deep in Love
Don't know how tell me now

నువ్వుంటే స్వర్గం అంటూ
లేకుంటే శూన్యం అంటూ
నా మనసే నన్నే వెలి వేస్తుంటే
నీ దగ్గరకే తరిమేస్తుంటే

ఏమైపోయానో ఏమైపోతున్నానో

ఏ ఏ ఏఏకాంత వేళలో నా జంట కలవయ్యిందీ
నువ్వేనా నువ్వేనా నువ్వేనా నువ్వేనా

ఏ ఏ ఏఏ జన్మ బంధమో ఈనాడు జత కమ్మంది
ఓకేనా ఓకేనా ఓకేనా ఓకేనా

Oh My Love Mad in Love
Don't know how tell me now

కను తెరిచే నిదురిస్తున్నా
నిదురిస్తు నడిచేస్తున్నా
ఇక స్వప్నం ఏదో సత్యం ఏదో
తేడా తెలియని ఆరాటం లో
ఏమైపోయానో ఏమైపోతున్నానో

Most Recent

Default