చిత్రం: ప్రియా ఓ ప్రియా (1997) సంగీతం: కోటి నటీనటులు: వడ్డే నవీన్, అబ్బాస్, సిమ్రాన్ దర్శకత్వం: ముప్పలనేని శివ నిర్మాతలు: యన్. అర్. అనురాధ దేవి, కె. భానుప్రసద్ విడుదల తేది: September.1997
Songs List:
# పాట సాహిత్యం
Song Details
కమ్మని కలలకు ఆహ్వానం పాట సాహిత్యం
చిత్రం: ప్రియా ఓ ప్రియా (1997) సంగీతం: కోటి సాహిత్యం: భువనచంద్ర గానం: యస్.పి.బాలు, చిత్ర హూలల హూలల హులల్లా హూలల్లా అలా హూలల హూలల హులల్లా హూలల్లా అలా కమ్మని కలలకు ఆహ్వానం చక్కని చెలిమికి శ్రీకారం పలికిన పాటకి నా ప్రాణం అంకితం అన్నది నా హృదయం హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ పులకించిన కాలపు వడిలో పురివిప్పినదో స్వర పుష్పం చిరు నవ్వుల వీణలు మీటి వినిపించినదో నవ రాగం హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ కమ్మని కలలకు ఆహ్వానం చక్కని చెలిమికి శ్రీకారం హ్యాపీ న్యూ ఇయర్ ఓ జాబిలి నా నెచ్చెలి విన్నానులే నీవన్న మాట నాకోసమే వస్తావని కట్టానులే ఓ కలల కోట అణువణువు నిన్ను తడిమే చూపులకి ఎంత మహిమో అనుక్షణము నిన్ను పిలిచే పెదవులకి ఎంత సుఖమో ప్రియా ఓ ప్రియా... ప్రియా ఓ ప్రియా... మనసులో ఉన్నది ఓ మాట తెలుపన కమ్మగ ఈ పూట ప్రియా ఓ ప్రియా... హూలల హూలల హులల్లా హూలల్లా అలా హూలల హూలల హులల్లా హూలల్లా అలా ఓ నేస్తమా చిరుగాలితో కబురంపినా నేనాగలేక ఓ జానేమన్ మేడ్ ఇన్ హెవెన్ రాసేయనా ఓ ప్రేమ లేఖ విరహమనే మంచు తెరలో చిక్కినదో లేత పరువం కౌగిలిలో వెచ్చబడితే కరుగునులే కన్నె బిడియం ప్రియా ఓ ప్రియా... ప్రియా ఓ ప్రియా... మనసులో ఉన్నది ఓ మాట తెలుపన కమ్మగ ఈ పూట ప్రియా... ఓ ప్రియా... పులకించిన కాలపు వడిలో పురివిప్పినదో స్వర పుష్పం ప్రియా... ఓ ప్రియా... ప్రియా... ఓ ప్రియా...
# పాట సాహిత్యం
Song Details
చిటపట చినుకుల వానా పాట సాహిత్యం
చిత్రం: ప్రియా ఓ ప్రియా (1997) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, చిత్ర పల్లవి: వానా వానా వానా వానా (2) చిటపట చినుకుల వానా చిగురాశ రేపె నాలోనా వానా వానా వానా వానా చలి చలి స్వరముల వీణా ఎదలోన చిలిపి థిల్లానా వానా వానా వానా వానా ఏవేవో కొత్త ఊహలు ఎన్నెన్నో కొంటె ఊసులు ఆహ్వానం పాడుతున్న లయలోనా చిలిపిగ చేరనా వానా వానా వానా వానా (2) చిటపట చినుకుల వానా చిగురాశ రేపె నాలోనా చలి చలి స్వరముల వీణా ఎదలోన చిలిపి థిల్లానా చరణం: 1 నీటి మంటతో లేత ఒంటిలో తీగ ఈడు వేగుతున్న వింత చూడనా కోడె జంటలో వేడి వంటతో సోయగాల పాయసాల విందు చేయనా ఊరించే అందమందన ఊపిరితో ఊదుకొందునా కళ్ళారా ఆరగించమంటే.. పరుగున వాలనా వానా వానా వానా వానా (2) చిటపట చినుకుల వానా చిగురాశ రేపె నాలోనా చలి చలి స్వరముల వీణా ఎదలోన చిలిపి థిల్లానా చరణం: 2 చిమ్మచీకటీ సమ్మతించెలే కమ్మనైన సంగతేదో విన్నవించనా తిమ్మిరేవిటో కమ్ముకుందిలే నమ్మరాని సంబరాన నిన్ను తేల్చనా జల్లేమో వంతెనేయగా పిల్లేమో సొంతమాయెగా లవ్లీగా చెంత చేరుకొని రా... తహ తహ పంచనా వానా వానా వానా వానా (2) చిటపట చినుకుల వానా చిగురాశ రేపె నాలోనా వానా వానా వానా వానా చలి చలి స్వరముల వీణా ఎదలోన చిలిపి థిల్లానా వానా వానా వానా వానా ఏవేవో కొత్త ఊహలు ఎన్నెన్నో కొంటె ఊసులు ఆహ్వానం పాడుతున్న లయలోనా చిలిపిగ చేరనా వానా వానా వానా వానా (2)
# పాట సాహిత్యం
Song Details
# పాట సాహిత్యం
Song Details