చిత్రం: సత్యభామ (2007)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: శ్రీనివాస్
నటీనటులు: శివాజి , భూమిక, కృష్ణ ఘట్టమనేని
దర్శకత్వం: శ్రీహరి నాను
నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్ , మామిడిశెట్టి శ్రీనివాస్
విడుదల తేది: 06.07.2007
హాయిగా వుండదా..ప్రేమనే భావన
మనసుతో మనసుకి వేయదా వంతెన
కదిలే అడుగుల వెంట మమతే వెలుగై రాదా
కనుపాపకి రెప్పలా కాపలా కాయదా
పెదవంచుపై నవ్వులా సంతకం చేయదా
నీ ప్రేమ లోతెంతనీ అడగొద్దు ఓ మిత్రమా
ఈ ప్రేమ ఘన చరితని వర్ణించడం సాధ్యమా
హాయిగా వుండదా..ప్రేమనే భావన
మనసుతో మనసుకి వేయదా వంతెన
మనసంటూ నీకుంటే అది ఇచ్చేటందుకే
ప్రేమంటూ ఒకటుంది అది పంచేటందుకే
ప్రేమించేందుకొక క్షణమె చాలు
మొదలవుతుంది తొలి సంబరం
ప్రేమను మరచి పోదాము అంటే
సరిపోదేమో ఈ జీవితం
జత కలిసి కనులు కనులు
ప్రతి దినము కలలు మొదలు
ఒక చినుకు లాగ మొదలైన ప్రేమ
అంతలో సంద్రమై పొంగదా
ఆపాలన్నా అణచాలన్నా వీలే కాదుగా
హాయిగా వుండదా..ప్రేమనే భావన
మనసుతో మనసుకి వేయదా వంతెన
ఎదనిండా ప్రేముంటే ఏముందీ కానిది
కలకాలం తోడుండే గుణమేగా ప్రేమది
చుట్టంలాగ వచ్చెళ్ళిపోయే మజిలీ కాదు ఈ ప్రేమది
గుండెల్లోకి ఓ సారి వస్తే గుమ్మం దాటి పోదే ఇది
ఇక ఒకరినొకరు తలచి బ్రతికుండలేరు విడిచి
అసలైన ప్రేమ ౠజువైన చోట
అనుదినం...అద్భుతం...జరగదా...
నీకేం కాదు నేనున్నానని హామీ ఇవ్వదా
హాయిగా వుండదా..ప్రేమనే భావన
మనసుతో మనసుకి వేయదా వంతెన
నిజమైన ప్రేమంటే యే స్వార్దం లేనిదే
కష్టాల్ని ఇష్టంగా భావిస్తానంటదే
పంచే కొద్ది పెరిగేది ప్రేమ
అర్దం కాని సూత్రం ఇది
కల్లోలాన్ని ఎదురీదుకుంటూ
తీరం చేరు తావే ఇది
నీ దిగులు తనకి దిగులు
నీ గెలుగు తనకి గెలుపు
నీ సేవలోనె తల మునకలై
తండ్రిగా, అన్నగా మారదా...
నీ వెనకాలే సైన్యం తానై నడిపించేనుగా
హాయిగా వుండదా..ప్రేమనే భావన
మనసుతో మనసుకి వేయదా వంతెన
****** ****** *******
చిత్రం: సత్యభామ (2007)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కౌశల్య
గుండెలోనా నువ్వే..కళ్ళలోనా నువ్వే !
వెన్నలైనా నువ్వే..వేకువైనా నువ్వే !!
మనసున మైమరపేదో..కలిగెను ఈ క్షణమే
తీయగా తీయతీయగా మనసు మురిసిందిగా
ముద్దుగా తొలి ముద్దనే మంత్రమే వేయగా
గుండెలోనా నువ్వే..కళ్ళలోనా నువ్వే !
ఏ జన్మలో వరమడిగాననో..నువ్వే నువ్వే కావాలని
ఆ దైవమే నిను పంపించెనో..తోడై నీడై ఉండాలనీ
నా చిరునవ్వా నే నీవైపోనా
అవుననలేవా అల్లుకుపోరా
నీ ప్రేమలోనా నేనుండిపోనా..యుగమే క్షణమై పోవాలిక !
గుండెలోనా నువ్వే..కళ్ళలోనా నువ్వే !
తననా నననానాన నానానా
తననా నననానాన నానానా
మనసే..మురిసీ..అలసీ..సొలసీ..నన్ను నేను మరిచా !
నిమిరిందిలే నా మెడవంపునే..తెలుసా
బహుసా నీ ఊపిరే తొలిసిగ్గునే మరి తెలిపిందిలే..
ఇపుడే ఇచటే నీ కౌగిలీ
నిజమనుకోనా ఇది కలయనుకోనా
కలలోనైనా కలవరమనుకోనా
ఒకరోజు మొదలై ప్రతి రోజు ఎదురై
పెదవీ పెదవీ అందించనా !
గుండెలోనా నువ్వే..కళ్ళలోనా నువ్వే !
వెన్నలైనా నువ్వే..వేకువైనా నువ్వే !!
మనసున మైమరపేదో..కలిగెను ఈ క్షణమే
తీయగా తీయతీయగా మనసు మురిసిందిగా
ముద్దుగా తొలి ముద్దనే మంత్రమే వేయగా