Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Suvarna Sundari (1957)




చిత్రం: సువర్ణ సుందరి (1957)
సంగీతం: పి.ఆదినారాయణరావు  (అసోసియేట్: టి.వి.రాజు)
నటీనటులు: నాగేశ్వరరావు, అంజలీ దేవి, రాజసులోచన, గిరిజ
సాహిత్యం: సముద్రాల (సీనియర్), సముద్రాల (జూనియర్), కొసరాజు 
మాటలు: మల్లాది రామకృష్ణ శాస్త్రి 
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
నిర్మాత: పి.ఆదినారాయణరావు
విడుదల తేది: 10.05.1957



Songs List:



పిలువకురా అలుగకురా... పాట సాహిత్యం

 
చిత్రం: సువర్ణ సుందరి (1957)
సంగీతం: ఆదినారాయణరావు
సాహిత్యం: సముద్రాల (సీనియర్)
గానం: పి.సుశీల (కోరస్: ఎల్.ఆర్.ఈశ్వరి)

పల్లవి:
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ
పిలువకురా అలుగకురా...
నలుగురిలో నను ఓ రాజా..
పలుచన సలుపకురా..

పిలువకురా అలుగకురా....
నలుగురిలో నను ఓ రాజా.. ఆ..
పలుచన సలుపకురా..

పిలివకురా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ

చరణం: 1
మనసున తాళి మరువనులేర...
గళమున మోడి సలుపకు రాజా....
సమయము కాదురా నిన్ను దరిచేర..
సమయము కాదురా నిన్ను దరిచేర...

కరుణను నన్నీవేళ మన్నించర రాజా..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా...
పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ

చరణం: 2
ఏలినవారి కొలువుర సామీ...
మది నీ రూపే మెదలినగాని..
ఓయన లేనురా కదలగలేర..
ఓయన లేనురా కదలగలేర..

కరుణను నన్నీవేళ మన్నించర రాజా..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా....

పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ




బంగారు వెన్నెల పాట సాహిత్యం

 
చిత్రం: సువర్ణ సుందరి (1957)
సంగీతం: ఆదినారాయణరావు
సాహిత్యం: సముద్రాల (సీనియర్)
గానం: పి. లీల 

బంగారు వెన్నెల 



అమ్మా! అమ్మా! పాట సాహిత్యం

 
చిత్రం: సువర్ణ సుందరి (1957)
సంగీతం: పి.ఆదినారాయణరావు
సాహిత్యం: సముద్రాల (జూనియర్)
గానం: పి.సుశీల

అమ్మా! అమ్మా! అమ్మా!
అమ్మా అమ్మా అమ్మా యని అడిగేవు బాబూ
మీ అమ్మ ఎటనున్నదో "అమ్మా అమ్మా అని"
పలుకాడలని - పసివాడవే - నువ్వు - తెలిపేదెలా బాబూ
అమ్మను కలిసేదెలా బాబూ
పతి సతులను బాసి బ్రతుకన్న రోసి - మగవేషమే వేసి
అల్లాడు తల్లి అగుపించినా నువ్వు - తెలిసేదెలా బాబూ

అమ్మను కలిసేదెలా బాబూ
విధి చేతివ్రాలే శాపాలపాలై - ఈ రీతి జవరాలై
అల్లాడు తండ్రి అగుపించినా నువ్వు - తెలిసేదెలా బాబూ
అయ్యను కలిసేదెలా బాబూ
అనాధాళీకి ఆలన పాలన దేవుడే
మహాదేవుని సన్నిధి చేరరా బాలుడా - దయజూచి దరిజేర్చినా
 ఆ దేవుడే గతిరా మహాదేవుడే గతిరా




బొమ్మలమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: సువర్ణ సుందరి (1957)
సంగీతం: పి.ఆదినారాయణరావు
సాహిత్యం: సముద్రాల (సీనియర్)
గానం: పి.సుశీల

బొమ్మలమ్మా




ఏరా మనతోటి పాట సాహిత్యం

 
చిత్రం: సువర్ణ సుందరి (1957)
సంగీతం: పి.ఆదినారాయణరావు
సాహిత్యం: కొసరాజు 
గానం: మాధవపెద్ది సత్యం,  పిఠాపురం నాగేశ్వర రావు

ఏరా! - ఏరా మనతోటి గెల్చే - ధీరులెవ్వరురా! రణ - శూరులెవ్వరురా!
రణ - శూరులెవ్వరురా! భళా భళి:
కోరస్ : "ఏరా మనతోటి"

అద్దిరభన్న - గుద్దుల బెల్లం - గుభిగుభిగుభి వీపుకు సున్నం
దుబ్ దుబ్ దుబ్ దూదేకుడూ - ఆ దెబ్బలతో తోకపీకుడూ
అరె ఆంజనేయుడికి అన్నదమ్ములం - భీమ సేనుడికి పెద్ద కొడుకులం

కోరస్ : అద్దిరభన్నా

అద్దిరభన్నా అరె సాగితే మహారాజులం
కోరస్ : అరె చతికిలబడితే రరాజులం "ఏరా మనతోటి"

పిన్నా పెద్దా - బేధం లేదూ కొద్దీ గొప్పా తేడాలేదు
కోరస్ : అద్దిరభన్నా

జుట్టూ జుట్టూ  ముడిపెడతాం - చెవులకు తాటాకులు కడతాం
కోరస్ : అద్దిరభన్నా

మా సొంత మన్నదే లేదు - మేం చుప్పనాతులంగాదు
ఎప్పుడు కోపంరాదు - అది వచ్చినదంటే పోదూ
కోరస్ : అది వచ్చినదంటే పోదూ "ఏరా మనతోటి"

మీసం జూడు - రోసం జూడూ - పక్కనున్న సావాసం జూడు
కోరస్ : అద్దిరభన్నా

ఈ బాటకు సుంకం కట్టు - మా కాళ్ళకు దణ్ణం పెట్టు
అరె చిక్కెర చేతిలో జుట్టు ఇక - తిరగెయ్ ర పెసరట్టు
కోరస్ : ఇక తిరగెయ్ రా పెసరట్టు

అద్దిరభన్న - గుద్దుల బెల్లం - గుభిగుభిగుభి వీపుకు సున్నం
దుబ్ దుబ్ దుబ్ దూదేకుడూ - ఆ దెబ్బలతో తోకపీకుడు
కోరస్ : ఆ దెబ్బతో తోకపీకుడూ "ఏరా మనతోటి"



హాయి హాయిగా ఆమని సాగే పాట సాహిత్యం

 
చిత్రం: సువర్ణ సుందరి (1957)
సంగీతం: పి.ఆదినారాయణరావు
సాహిత్యం: సముద్రాల (సీనియర్)
గానం: ఘంటసాల, జిక్కి 

పల్లవి :
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
హాయి హాయిగా ఆమని సాగే
హాయి హాయిగా ఆమని సాగే
సోయగాల గన ఓయి సఖా.. ఆ ఆ ఆ.. హాయి సఖా.. ఆ ఆ ఆ
హాయి హాయిగా ఆమని సాగే

లీలగా పువులు గాలికి ఊగా ఆ.. ఆ.. ఆ...
లీలగా పువులు గాలికి ఊగా ఆ ఆ ఆ.....లీలగా పువులు గాలికి వూగా
సనిదమ దనిసా గమ గమ దనిసా
రిసనిద సరిసని దనిని దనిని దని మగద మగద మద గరిగ మదని
లీలగా పువులు గాలికి ఊగా
కలిగిన తలపుల వలపులు రేగా
కలిగిన తలపుల వలపులు రేగా
ఊగిపోవు మది ఉయ్యాలగా..ఆ ఆ ఆ..  జంపాలగా ఆ ఆ ఆ
హాయి హాయిగా ఆమని సాగే

చరణం: 1
ఏమో... ఏమో తటిల్లతికమే మెరుపు
ఏమో తటిల్లతికమే మెరుపు మైమరపేమో
మయిలు రాజు దరి మురిసినదేమో.. మైమరపేమో
మయిలు రాజు దరి మురిసినదేమో

వలపు కౌగిలుల వాలి సోలి... వలపు కౌగిలుల వాలి సోలి
ఊగిపోవు మది ఉయ్యాలగా...  జంపాలగా ఆ ఆ ఆ
హాయి హాయిగా ఆమని సాగే

చరణం: 2
ఆ ఆ ఆ ఆ ఆచూడుమా చందమామ.. అటు చూడుమా చందమామ

కనుమా వయ్యారి శారదయామిని కవ్వించే ప్రేమ...

ఆ ఆ ఆ.. చూడుమా చందమామ

వగలా తూలే విరహిణులా
వగలా తూలే విరహిణులా
మనసున మోహము రేపు నగవులా
మనసున మోహము రేపు నగవులా

ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా.. ఆ.. ఆ.. ఆ
హాయి హాయిగా ఆమని సాగే

చరణం: 3
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
కనుగవా తనియగా ప్రియతమా
కలువలు విరిసెనుగా..... కనుగవా తనియగా ప్రియతమా

కలువలు విరిసెనుగా ఆ ఆ ఆ కనుగవా తనియగా

చెలువము కనుగొనా.. ఆ.. ఆ.. చెలువము కనుగొనా
మనసానంద నాట్యాలు సేయనోయీ
ఆనంద నాట్యాలు సేయనోయీ
సరిగమదనిసా దనిసా సనిసగరిగా సరిసని
దనిమదనిస నిరినిరి దనిదని మదమద గమగమ గమ
దనిసా గమ దనిసా దనిసా





జగదీశ్వరా... పాహి పరమేశ్వరా.. పాట సాహిత్యం

 
చిత్రం: సువర్ణ సుందరి (1957)
సంగీతం: పి.ఆదినారాయణరావు
సాహిత్యం: సముద్రాల (సీనియర్)
గానం: పి.సుశీల , జిక్కి    P. Susheela / Jikki (Two Versions)

పల్లవి:
ఓం నమశ్శివాయః...  సిద్ధం నమః
ఓం...
జగదీశ్వరా... పాహి పరమేశ్వరా..
జగదీశ్వరా...  పాహి పరమేశ్వరా..
దేవాపుర సంహార... ధీర నటశేఖరా
త్రాహి కరుణాకరా... పాహి సురశేఖరా

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..

జగదీశ్వరా... పాహి పరమేశ్వరా..

చరణం: 1
శంభోహరా... వినుతలంబోధరా..
అంబావరకావరా..ఆ ఆ ఆ....
శంభోహరా... వినుతలంబోధరా..
అంబావరకావరా..

వరమీయరా..గౌరివరసుందరా... గౌరివరసుందరా..
నిన్నే కని మేము కొలిచేము గంగాధరా.. దేవగంగాధరా

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
జగదీశ్వరా... పాహి పరమేశ్వరా..
జగదీశ్వరా... పాహి పరమేశ్వరా..

చరణం: 2
ప్రమధులు పాడా... ఫణిగణ మాడా.. పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార.. గని పారవశ్యంబున కొనియాడా..

ఓ.. ఓ.. ఓ.. ఓ..
ప్రమధులు పాడా... ఫణిగణ మాడా.. పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార.. గని పారవశ్యంబున కొనియాడా..
నడిపెను సుందర నటనకు జతులిడ.. నందియ మార్దళనాదమే..
మధురాతిమధుర శృతి గీతమే...

తధిమి..తధిమి ధిమితైతై తయ్యని
తాండవమాడేను..పాదమే..
మది సేవించిన సమ్మోదమే..
జగంబులా ఏలికా శివకామసుందర నాయకా
జగంబులా ఏలికా శివకామసుందర నాయకా

ఓ..ఓ..ఓ..ఓ...
ప్రమధులు పాడా... ఫణిగణ మాడా.. పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార.. గని పారవశ్యంబున కొనియాడా..




లక్ష్మి క్షీర సమూరి పాట సాహిత్యం

 
చిత్రం: సువర్ణ సుందరి (1957)
సంగీతం: పి.ఆదినారాయణరావు
సాహిత్యం: సముద్రాల జూనియర్
గానం: ఘంటసాల

లక్ష్మి క్షీర సమూరి




నా చిట్టి పాప పాట సాహిత్యం

 
చిత్రం: సువర్ణ సుందరి (1957)
సంగీతం: పి.ఆదినారాయణరావు
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: పి.సుశీల, యం.యస్.రామారావు 

నా చిట్టి పాప 



కొమ్మనురా పాట సాహిత్యం

 
చిత్రం: సువర్ణ సుందరి (1957)
సంగీతం: పి.ఆదినారాయణరావు
సాహిత్యం: కొసరాజు 
గానం: పి.లీల 

కొమ్మనురా



నీ నీడలోన నిలిచేనురా పాట సాహిత్యం

 
చిత్రం: సువర్ణ సుందరి (1957)
సంగీతం: పి.ఆదినారాయణరావు
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: పి.సుశీల

ఆ-ఆ-ఆ

సాకీ :
నీ నీడలోన నిలిచేనురా - యువతీ మనోజా

నీ నీడోన నిలిచేనురా
నిను కొలిచేనురా - యువతీ మనోజా
ఏనాటికైనా నీదానరా - యువతీ మనోజా
ఏనాటికయినా నీదానరా

ఆ - ఆ - ఆ
నీ తీయై కొనగోరుల మీటి "2"
మేళవించిన హృదయ విపంచి మేళవించిన ప్రేమ విపంచి
మురిసిన చిరుగాలి సోకునా మొరసి భవదీయ గీతమే
వినిచేనే మేళా - ఏనాటికయినా నీదానరా
యువతీ మనోజా ఏనాటికైనా నీదానరా ఆ - ఆ - ఆ



శంభో నా మోర వినరా పాట సాహిత్యం

 
చిత్రం: సువర్ణ సుందరి (1957)
సంగీతం: పి.ఆదినారాయణరావు
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: పి.సుశీల

శంభో నా మోర వినరా 





తద్దిం ననన తోం థిల్లాన పాట సాహిత్యం

 
చిత్రం: సువర్ణ సుందరి (1957)
సంగీతం: పి.ఆదినారాయణరావు
సాహిత్యం: కొసరాజు 
గానం: పి.లీల, కోమల 

తద్దిం ననన తోం థిల్లాన


Most Recent

Default