Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Uncle (2000)




చిత్రం: అంకుల్ (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు
నటీనటులు: తరుణ్ కుమార్, పల్లవి
దర్శకత్వం: రాజశేఖర్ ( కన్నడ డైరెక్టర్)
నిర్మాత: ఏవియస్
విడుదల తేది: May 2000

పల్లవి:
ఎన్నో ఎన్నో ఏళ్లుగా 
అడగాలనుంది ఓ వరం
ఆడే పాడే పాపగా 
గడపాలనుంది జీవితం
ఏదైవం ఇస్తాడో ఆ వరం 
ఏ దీపం చూపేనో ఆ వనం
వెదికి వెదికి వేసారిన

ఎన్నో ఎన్నో ఏళ్లుగా 
అడగాలనుంది ఓ వరం

చరణం: 1
చినుకమ్మకు పడవాటలు
చిలుకమ్మకు పొడిమాటలు
నేర్పించే చిన్నారులతో
చిగురమ్మకు తొలిపూతలు
వెలుగమ్మకు తొలి జ్యోతలు
అనిపించే చిరునవ్వులతో
ప్రతిక్షణం సంతోషమే
ప్రతిస్వరం సంగీతమే
దివిజాబిలి దిగలేదని చిరుకోపాలా
తీయతియ్యగ ఉంటుంది కన్నీరైన
అలక సొగసే ఆ ప్రాయాన

ఎన్నో ఎన్నో ఏళ్లుగా 
అడగాలనుంది ఓ వరం
ఆడే పాడే పాపగా 
గడపాలనుంది జీవితం

చరణం: 2
విలువెందుకు చదివేందుకు 
కలిమెందుకు బలిమెందుకు
పసితనమును కరిగిస్తుంటే
పాపాయిలుగా పుట్టి
పాపాలుగా మారే 
పయనం పేర పెరగడమంటే
తిరిగిరాని ఆ పెన్నిధి
ఏ సంపద కొనలేనిది
చేజారిన నా బాల్యమె వస్తానంటే
ఇన్నాళ్లుగ నన్నళ్లిన దారాన్నిట్టే
వదిలి తనతో వెళ్లాలని

ఎన్నో ఎన్నో ఏళ్లుగా 
అడగాలనుంది ఓ వరం
ఆడే పాడే పాపగా 
గడపాలనుంది జీవితం
ఏదైవం ఇస్తాడో ఆ వరం 
ఏ దీపం చూపేనో ఆ వనం
వెదికి వెదికి వేసారిన

ఎన్నో ఎన్నో ఏళ్లుగా 
అడగాలనుంది ఓ వరం


Most Recent

Default