Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Vajram (1995)

చిత్రం: వజ్రం  (1995)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు , చిత్ర
నటీనటులు: నాగార్జున, రోజా, ఇంద్రజ
దర్శకత్వం: ఎస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాత: సి.గౌతమ్ కుమార్ రెడ్డి
విడుదల తేది: 05.11.1995

కూత కూసె పిట్ట ...కుయిలె కుయిలె కుయిలె కుయిలె
పాత పాడిందంత...కుయిలె కుయిలె కుయిలె కుయిలె
కూత కూసె పిట్ట ...కుయిలె కుయిలె కుయిలె కుయిలె
పాత పాడిందంత...కుయిలె కుయిలె కుయిలె కుయిలె

ఉన్నట్టుండి యేమయ్యిందే....కుయిలె కుయిలె
సన్నయి రాగం విన్నట్టుందే...కుయిలె కుయిలె
పల్లకి తెచ్చె పెల్లీడొచ్చె...కుయిలె కుయిలె
పిల్లని మెచ్చె పిల్లాడొచ్చె....కుయిలె కుయిలె

కూత కూసె పిట్ట ...కుయిలె కుయిలె కుయిలె కుయిలె
పాత పాడిందంత...కుయిలె కుయిలె కుయిలె కుయిలె

మెల్లొ మూడు ముల్లనగానే మొదటేం చేస్తావే
మనువాదిన వాడిని కొంగున కట్టిపడేస్తాలే
మీసం ఉన్న మగాడ్ని యెట్ట దారికి తెస్తావే
మూడొచ్చి ముందుకు వస్తే మూడంకేస్తాలే
అమ్మడో నీ జిమ్మడో నిన్నేవ్వడూ పెళ్లాడడే
లయలేస్తాలే అహ ఏం style యే
లాగేస్తాన్లే...పడిపొతాన్లే

కూత కూసె పిట్ట ...కుయిలె కుయిలె కుయిలె కుయిలె
పాత పాడిందంత...కుయిలె కుయిలె కుయిలె కుయిలె
ఉన్నట్టుండి యేమయ్యిందే....కుయిలె కుయిలె
సన్నయి రాగం విన్నట్టుందే...కుయిలె కుయిలె
పల్లకి తెచ్చె పెల్లీడొచ్చె...కుయిలె కుయిలె
పిల్లని మెచ్చె పిల్లాడొచ్చె....కుయిలె కుయిలె

సాయంకాలం time అయితే నువ్ ఇంటికి చేరాలోయ్
అయ్యబాబొయ్ చిత్తం తల్లే ఇంకేం చెయ్యాలే
ఇక నుంచి ఈ wife అంటే నీ life అనుకొవాలోయ్
చస్తాన సర్లే కాని కర్మనుకుంటాలే
జుమ్మడొ ఈ జన్మలో ఆ బ్రహ్మ ముడినే నమ్మరో
నమ్మిస్తాలే....చూస్తుంటాలే
కలహం చాల్లే....కలిసుందంలే

కూత కూసె పిట్ట ...కుయిలె కుయిలె కుయిలె కుయిలె
పాత పాడిందంత...కుయిలె కుయిలె కుయిలె కుయిలె
ఉన్నట్టుండి యేమయ్యిందే....
సన్నయి రాగం విన్నట్టుందే...కుయిలె కుయిలె
పల్లకి తెచ్చె పెల్లీడొచ్చె...కుయిలె కుయిలె
పిల్లని మెచ్చె పిల్లాడొచ్చె....కుయిలె కుయిలె

కూత కూసె పిట్ట ...కుయిలె కుయిలె కుయిలె కుయిలె
పాత పాడిందంత...కుయిలె కుయిలె కుయిలె కుయిలె

*******   ********   *******

చిత్రం: వజ్రం  (1995)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు , రేణుక

మనసా ఎందుకె కన్నీరు
మనకోసం ఎవరున్నరు
కాలగనమని ఎవరన్నరు
కరిగితె ఎవరేం చేస్తారు

ఏ నవ్వు చినుకైనా చేరని ఈ ఎడారిలో
ఈ కాస్త తడినైనా ఆపవె గుండె లోతులో
తెగిన గాలి పటమై సాగుతున్న పయనం
తనది అన్న తీరం కోరుకుంటె నేరం

మనసా ఎందుకె కన్నిరు
మనకోసం ఎవరున్నరు
కాలగనమని ఎవరన్నరు
కరిగితె ఎవరేం చేస్తారు

చిన్న చిన్న ఆనందాలు
చిందులాడు చల్లని ఇల్లు
అందమైన అనుబంధాలు
సొంతమైతె అంతే చాలు
అంత కన్న గొప్ప వరాలు
అడగలేదు నువ్వేనాడు
చిటికిడంత ప్రేమను కోరి చెయ్యి చాచినావు
ఐనవాల్లు అంతా వుండి అందవైనావు
పంచలేనిదీ మమకారమెందుకు
పెంచలేక ఈ నిట్టూర్పులెందుకు

మనసా ఎందుకె కన్నిరు
మనకోసం ఎవరున్నరు
కాలగనమని ఎవరన్నరు
కరిగితె ఎవరేం చేస్తారు

రునం తీరిపోయే అంది
కన్న తండ్రి చేసిన లెక్క
శేషమంటు ఏముందింక
ఆయువుంది ఇంకా అందీ
మాయదారి దేవిడి లెక్క
మొండి బతుకు తప్పదు గనక
దీవెనియ్యవలసిన చెయ్యే శపిస్తాను అంటే
దారిచూపవలసిన దీపం దహిస్తాను అంటే
ఆలకించరే నీ గోడు ఎవ్వరు
ఆదరించడే ఏ రాతి దేవుడు

మనసా ఎందుకె కన్నిరు
మనకోసం ఎవరున్నరు
కాలగనమని ఎవరన్నరు
కరిగితె ఎవరేం చేస్తారు

ఏ నవ్వు చినుకైనా చేరని ఈ ఎడారిలో
ఈ కాస్త తడినైనా ఆపవె గుండె లోతులో
తెగిన గాలి పటమై సాగుతున్న పయనం
తనది అన్న తీరం కోరుకుంటె నేరం

Most Recent

Default