చిత్రం: అల్లరి బుల్లోడు (2005) సంగీతం: యమ్. యమ్.కీరవాణి నటీనటులు: నితిన్ , త్రిష , రతి దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు నిర్మాత: అనిల్ కుమార్. కె బ్యానర్: మారుతి కంబైన్స్ విడుదల తేది: 15.09.2005
Songs List:
అందమంటే ఎవరిదీ పాట సాహిత్యం
చిత్రం: అల్లరి బుల్లోడు (2005) సంగీతం: యమ్. యమ్.కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: యస్.పి. బి. చరణ్, సునీత ఔరా ఔరౌరా.. అందమంటే ఎవరిదీ నీదికాక కాకకాక కాకకాక కాకకాక కాకకాక తెలివితేటలెవరివి నీవికాక కాకకాక కాకకాక కాకకాక కాకకాక ఆవు పాల లాంటి నవ్వు ఆవగింజలాంటి నడుము ఆయుదాల లాంటి కళ్లు అధ్బతాల ఇల్లు ఒళ్లు అంతరిక్షమంటి సొగసు అంతకంటే గొప్ప మనసు అబ్బా…. అబ్బా నీ దెబ్బకుప్పితబ్బిబ్బయిపోతున్నా ఇంత హాయి మోయడం నా వల్లకాక కాకకాక కాకకాక కాకకాక ఔరా ఔరౌరా.. అశ కవితలెవరివి నీవికాక కాకకాక కాకకాక కాకకాక కాకకాక అదరగొట్టుడెవరిది నీదే కాకా…… పూవులన్ని నడచి వచ్చి తేనె తోటి కాళ్లు కడగవా తమను కొప్పులోన తురమమంటు అడగడానికి కాక కాక పక్షలన్నీ ఎగిరివచ్చి పల్లకీగా నిన్ను మోయవా వాటి చిట్టి రెక్కలన్నీ ధన్యమవ్వడానికి కాకా కాకా పూర్వకవులు అందరు పునర్జమ్మ పొందరా నిన్ను చూసి కవితలన్నీ తిరగరాయడానికి నాల్గు తలలు ఎత్తుతూ నేలపైకి చేరడా బ్రహ్మగారు తనగొప్పను చాటుకోవడానికి పువ్వుని కాక నేను పక్షిని కాకా బ్రహ్మను కాక నేను కవినీ కాకా ఇంకేమవుతానే నీ దాసున్ని కాక కాకకాక కాకకాక కాకకాక కాకకాక హా.. ఔరా ఔరౌరా.. పచ్చి నిజాలెవరివి నీవికాక కాకకాక కాకకాక కాకకాక కాకకాక రెచ్చగొట్టుడెవరిది నీదేకాకా….. చెట్టుకొమ్మ నిన్నుచూసి కాగితమై అవతరించగా నీ చేతిరాత తాకి పులకిరంచడానికి కాకా కాకా ఏటి నీరు నిన్ను చూసి విరహంతో ఆవిరవ్వదా తిరిగి వాన జల్లులాగా నిన్ను తడపడానికి కాకా కాకా పిల్లగాలి ప్రేమగా ఊపిరల్లే చేరదా గుండెలోన గాలిమేడ కట్టకోవడానికి మాటలన్నీ ముద్దుగా నిన్నుకోరి చేరవా పాటలై తమ కీర్తిని పెంచుకోడానికి చెట్టును కాను ఏటి నీటిని కాను గాలిని కాను పట్టి మాటను కాను ఇంకేమవుతారా నీ ప్రియురాలిని కాకకాక కాకకాక కాకకాక కాకకాక కా ఔరా ఔరౌరా.. పిచ్చి ప్రేమ ఎవరిది మనదికాక కాకకాక కాకకాక కాకకాక కాకకాక ప్రేమ పిచ్చి ఎవరిది మనదికాక కాకకాక కాకకాక కాకకాక కాకకాక ఆవు పాల లాంటి నవ్వు ఆవగింజలాంటి నడుము ఆయుదాల లాంటి కళ్లు అధ్బుతాల ఇల్లు ఒళ్లు అంతరిక్షమంటి సొగసు అంతకంటే గొప్ప మనసు అబ్బా…. అబ్బా నీ దెబ్బకుప్పితబ్బిబ్బయిపోతున్నా ఇంత హాయి మోయడం నా వల్ల కాక కాక కాకకాక కాకకాక కాకకాక కా
నొప్పి నొప్పి పాట సాహిత్యం
చిత్రం: అల్లరి బుల్లోడు (2005) సంగీతం: యమ్. యమ్.కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: ఉదిత్ నారాయణ్ , శ్రేయఘోషల్ నొప్పి నొప్పి - ఏమి నొప్పి నిన్ను చూడకుంటే గుండె నొప్పి నొప్పి నొప్పి - ఏడ నొప్పి నిన్ను చేరకుంటే ఈడ నొప్పి కన్ను నువ్వు కొట్టకుంటే కంటి నొప్పి నన్ను వీడి వెళ్ళిపోతే కాళి నొప్పి ఉన్నమాట చెప్పుకుంటే చెప్పు నుండి కొప్పు దాక నొప్పి నొప్పి నొప్పి నొప్పి నొప్పి నొప్పి నొప్పి - ఏమి నొప్పి నిన్ను చూడకుంటే గుండె నొప్పి నొప్పి నొప్పి - ఏటి నొప్పి మాటలాడకుంటే గొంతునొప్పి నిన్ను చేరదీయకుంటే చేతి నొప్పి నిన్ను కౌగిలించ కుంటే ఛాతి నొప్పి నీడ లాగ తిప్పకుంటే ప్రేమనుండి పెళ్లిదాక నొప్పి నొప్పి నొప్పి నొప్పి నొప్పి ఆడపిల్ల కెప్పుడు తప్పనే తప్పదు బుగ్గలోన పుట్టెడంత నొప్పి అందగాడి కెప్పుడు తప్పనే తప్పదు గోటిలోన గంపెడంత నొప్పి గుచ్చేటి ముళ్ళు నింక ముళ్ళుతోటి తీసుకో పుట్టేటి నొప్పినింక నొప్పితోటి తీర్చుకో గుచ్చేటి ముళ్ళు నింక ముళ్ళుతోటి తీసుకో పుట్టేటి నొప్పినింక నొప్పితోటి తీర్చుకో గోటి తోటి బుగ్గగిల్లు నీకు నాకు తగ్గుతుంది నొప్పి నొప్పి నొప్పి నొప్పి నొప్పి నొప్పి నొప్పి - ఏడ నొప్పి నిన్ను చూడకుంటే గుండె నొప్పి నొప్పి నొప్పి - ఏమి నొప్పి నిన్ను చేరకుంటే ఈడ నొప్పి హాస్పిటల్ కెళ్లినా ఆగనే ఆగదు ఐస్ లోనె అందమైన నొప్పి అమృతాన్ని తాగినా ఆగనే ఆగదు మనసులోన ముచ్చటైన నొప్పి ఈ వ్యాధి కెప్పుడైన నాటువైద్యమొక్కటే ఈ మంట కెన్నడైన నోటిమందు ఒక్కటే ఈ వ్యాధి కెప్పుడైన నాటువైద్యమొక్కటే ఈ మంట కెన్నడైన నోటిమందు ఒక్కటే మూడు పూట్ల ముద్దు మాత్ర వేసుకుంటె చేరదంట నొప్పి నొప్పి నొప్పి నొప్పి నొప్పి నొప్పి నొప్పి - ఏమి నొప్పి నిన్ను చూడకుంటే గుండె నొప్పి నొప్పి నొప్పి - ఏడ నొప్పి నిన్ను చేరకుంటే ఈడ నొప్పి నిన్ను చేరదీయకుంటే చేతి నొప్పి నిన్ను కౌగిలించ కుంటే ఛాతి నొప్పి ఉన్నమాట చెప్పుకుంటే చెప్పు నుండి కొప్పు దాక నొప్పి నొప్పి నొప్పి నొప్పి నొప్పి
దాచుకుంటే ధనా ధన్ పాట సాహిత్యం
చిత్రం: అల్లరి బుల్లోడు (2005) సంగీతం: యమ్. యమ్.కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: దేవి శ్రీ ప్రసాద్ దాచుకుంటే ధనా ధన్
త్రిషా అచట ఇచట పాట సాహిత్యం
చిత్రం: అల్లరి బుల్లోడు (2005) సంగీతం: యమ్. యమ్.కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: యమ్. యమ్.కీరవాణి, చిత్ర త్రిషా అచట ఇచట
మగవాడ మతిపోయెరా పాట సాహిత్యం
చిత్రం: అల్లరి బుల్లోడు (2005) సంగీతం: యమ్. యమ్.కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: టిప్పు, శ్వేతా పండిట్ మగవాడ మతిపోయెరా మనసంతా నీవాయరా ఒకటోసారి కోపించా రెండోసారి తపించా వేరోసారి వేదించా మరివో సారి మోహించా మొత్తం మీద నిన్నే ప్రేమించా మగవాడ మతిపోయెరా మనమాడే ఆటుందిరా పోకిరోడు నేడు కాదు ప్రయోజకుడుగా మారగా అల్లరోడు నేడు నను అల్లే తోడు అనిపించగా అమాయకుడు వీడు అమ్మాయి కుడిగా మారగా నెమ్మదస్తు డొకడు బహు జబర్దస్తుడిగా చేరగా అయ్యింది ముఖపరిచయం ఇక అవ్వాలి సుఖపరిచయం చూపుల్లో తొలి పరిచయం ఇది వలపుల్లో బల పరిచయం నా పైకి లంఘించరా రారా నియమాలే ఉల్లంఘించరా మగవాడ మతిపోయెరా మనసంతా నీవాయరా నిప్పులేని మంట మరి పుట్టించింది నువ్వే కడట్ మబ్బు లేని వాన కురిపించాల్సింది నీ బాధ్యత నేలలేని పంట అది పండించింది నువ్వే కదా కూలీ లేని పనిలో శ్రమ పడాల్సింది నేనే సదా రావాలి ఆ యోగమే అది ఇరువురికి ఉపయోగమే అందాల ఆరోహణే ఇది విరహాల అవరోహణే ఎంతెంతో ఆశించారా చేతుల్తో సంభాసించరా చినదాన చిటికేయనా చిటికేసి చెలరేగనా
అటక మీద ఉందమ్మో పాట సాహిత్యం
చిత్రం: అల్లరి బుల్లోడు (2005) సంగీతం: యమ్. యమ్.కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: జాస్సి గిఫ్ట్ , సునిది చౌహాన్ అటక మీద ఉందమ్మో
No comments
Post a Comment