చిత్రం: అందరికంటే మొనగాడు (1985) సంగీతం: కె.వి.మహదేవన్, సంగీత సహాయకులు: పుహళేంది సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, రోహిణీ కుమార్ గానం: యస్.పి.బాలు, కె.జె.జేసుదాస్, రమేష్ , కాకినాడ పుల్లారావు, యస్.జానకి , పి.సుశీల, వాణిజయరాం నటీనటులు: కృష్ణ , జయసుధ మాటలు: డి. ప్రభాకర్ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, దర్శకత్వం: టి.కృష్ణ నిర్మాత: ఎ. శ్రీరామ్ రెడ్డి ఫోటోగ్రఫీ: పుష్పాల గోపీకృష్ణ బ్యానర్: శ్రీ అజంతా సినీ ప్రొడక్షన్స్ విడుదల తేది: 25.04.1985
Songs List:
కంటికి కునుకే కరువాయే (ఏమాయే) పాట సాహిత్యం
చిత్రం: అందరికంటే మొనగాడు (1985) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: కె.జె.జేసుదాస్, రమేష్ & కోరస్ కంటికి కునుకే కరువాయే వంటికి మనసే బరువాయే పగలేమో నడి జామాయే
మంగళ గౌరి దేవి పాట సాహిత్యం
చిత్రం: అందరికంటే మొనగాడు (1985) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: రోహిణీ కుమార్ గానం: వాణిజయరాం & కోరస్ మంగళ గౌరి దేవి దీవెనలు మహిలో మగువుల మాంగల్యం
మొగ్గలు పూలుగా మారే కాలం పాట సాహిత్యం
చిత్రం: అందరికంటే మొనగాడు (1985) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: రోహిణీ కుమార్ గానం: వాణిజయరాం మొగ్గలు పూలుగా మారే కాలం బుగ్గలు సిగ్గులు ఊరే కాలం పరువాలొచ్చిన పైడిబొమ్మలకు పైటలు జారే కాలం
నా సోకు నాజూకు తమలపాకు పాట సాహిత్యం
చిత్రం: అందరికంటే మొనగాడు (1985) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: రోహిణీ కుమార్ గానం: యస్. జానకి నా సోకు నాజూకు తమలపాకు అదిమాత్రం అందరిలో అడగబాకు నిన్నరేతిరి చేసిన పూతరేకు నీకే నీకే ఇస్తా తొందర పడకు తొందర పడకూ... కూ... కూ... కుకూ...
మంచు కరిగితే ఆగదు పాట సాహిత్యం
చిత్రం: అందరికంటే మొనగాడు (1985) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి. బాలు, పి. సుశీల పల్లవి: మంచు కరిగితే ఆగదు మనసు కరిగితే దాగదు అది చినుకు చినుకుగా జారుతుంది అది చినుకు చినుకుగా జారుతుంది ఇది చిలికి చిలికి ప్రేమగా మారుతుంది మంచు కరిగితే ఆగదు మనసు కరిగితే దాగదు చరణం:1 వయసుతో వంటిగా వేగలేవు వరదలో ఎదురుగా ఈదలేవు వయసుతో వంటిగా వేగలేవు - ఆ వరదలో ఎదురుగా ఈదలేవు - హా ఎందుకో ఈ వగలమారి మూతి ముడుపులు అందుకో నా తొలి తొలి వలపుల అకు మడుపులు ఎందుకో ఈ వగలమారి మూతి ముడుపులు అందుకో నా తొలి తొలి వలపుల అకు మడుపులు రోజూ నిను కొలిచే ఈ అర్చకుడు రోజూ నిను కొలిచే ఈ అర్చకుడు ఈ రోజైనా ఏ రోజైనా ఈ రోజైనా ఏ రోజైనా అందరికంటే మొనగాడు అందరికంటే మొనగాడు మంచు కరిగితే ఆగదు మనసు కరిగితే దాగదు చరణం: 2 సిగ్గుతో పెదవితో చెప్పలేక కళ్ళతో తెలిపితే ప్రేమ లేఖ సిగ్గుతో పెదవితో చెప్పలేక - ఊ కళ్ళతో తెలిపితే ప్రేమ లేఖ - ఆహా... కలలు గన్న పడుచు జంట నిలువలేక కలుసుకున్న శుభగడియే కళ్యాణ లేఖ కలలు గన్న పడుచు జంట నిలువలేక కలుసుకున్న శుభగడియే కళ్యాణ లేఖ ముద్దులతో ముద్రించిన ఆ లేఖ ముద్దులతో ముద్రించిన ఆ లేఖ మొదటి రాత్రి చదువుకో ముద్దు తీరే దాకా మంచు కరిగితే ఆగదు మనసు కరిగితే దాగదు అది చినుకు చినుకుగా జారుతుంది అది చినుకు చినుకుగా జారుతుంది ఇది చిలికి చిలికి ప్రేమగా మారుతుంది మంచు కరిగితే ఆగదు మనసు కరిగితే దాగదు
ఏడు రంగులున్నదొక్కటే పాట సాహిత్యం
చిత్రం: అందరికంటే మొనగాడు (1985) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి. బాలు & కోరస్ ఏడు రంగులున్నదొక్కటే ఇంద్రధనస్సు ఆ ఇంద్రధనస్సు ఏడుకొండలంత ఎత్తురా అన్న మనసు మా అన్న మనసు