చిత్రం: బుర్రిపాలెం బుల్లోడు (1979) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి (All) గానం: పి.శుశీల, యస్.పి.బాలు, మాదవపెద్ది రమేష్ నటీనటులు: కృష్ణ, శ్రీదేవి, రతీదేవి (నూతన నటి) కథ: సత్యానంద్ , జంధ్యాల మాటలు ( డైలాగ్స్ ): జంధ్యాల స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బీరం మస్తాన్ రావు నిర్మాత: కె.విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ: పి.భాస్కరరావు ఎడిటర్: నరసింహారావు బ్యానర్: తిరుపతి ఇంటర్నేషనల్ విడుదల తేది: 16.11.1979
Songs List:
పంతులూ పంతులూ పావుశేరు మెంతులు పాట సాహిత్యం
చిత్రం: బుర్రిపాలెం బుల్లోడు (1979) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: పి.శుశీల, యస్.పి.బాలు పంతులూ.... పంతులూ పావుశేరు మెంతులు ముక్కు మీద కళ్ళజోడు గంతులూ పాఠాలు చెప్పలేక కుప్పి గంతులూ పంతులగారా, పింతిలిగిరి, పుంతులు గూరూ, పొంతులుగోరో అచ్చ తెలుగు హీరోలా అందంగా వున్నారు. ఆడపిల్లలందుకే మీ వెంట పడ్డారు తేట తేట తెలుగులో- హాటు హాటు లవ్ స్టోరీ- స్వీటుగా చెప్పండి మాష్టారూ-మీరే మా పాలిటి సినిమా స్టార్ పంతులగారా, పింతిలిగిరి, పుంతులుగూరూ, పొంతులుగోరో. శకుంతలను తొలిసారిగా తిలకించిన- దుష్యంతుడు ఏమనుకున్నాడంటే, మె.... మె.... మేక సందేహంలోనా మాస్టారు. కాదమ్మా.... మేఘ సందేశం అనాఘ్రాతం పుష్పం - కిసలయ మలూనం కరుణహై అనాలిద్దం, రత్నం – మధునవమనాస్వాతి తరసమ్, తరసమ్. పంతులుగారి మెళ్ళో ఏముంది తల్లీ.. టిఫ్ టాప్ రంగురంగుల రంగూన్ టై ఎలా చెప్పగలిగావ్....? తావీజ్ మహిమ శెభాష్ బేబీ.... పప్పులింక ఉడకవండి పంతులుగారూ తప్పుకుంటే సన్మానం తప్పదండి సారూ పూసగుచ్చినట్టు, అరటిపండు వలిచి పెట్టినట్టు ప్రేమకథలు చెప్పుకుంటే పెద్దొట్టు చెప్పనంటే ఒప్పుకోదు చేతిలో దెడ్డు హా.... పరమేశ్వరా.... ఏమి యీ విపరీతము లావొక్కింతయులేదు - నిజమేనుడి పాపం .... ధైర్యము విలోలంబయ్యే- అలో లచ్చనా ప్రాణంబులు తావులు త ప్పెను బోలెడన్ని కాగితాలున్నాయ్ మాస్టారూ.. మూర్ఛ వచ్చెను. సఫట్ లోషన్.... మీ గజ్జి తామరకు మందు -
నా జీవన బృందావనిలో పాట సాహిత్యం
చిత్రం: బుర్రిపాలెం బుల్లోడు (1979) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: పి.శుశీల, యస్.పి.బాలు నా జీవన బృందావనిలో ఆమని ఉదయంలో నిను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో నా జీవన బృందావని లో ఆమని ఉదయం లో నిను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో కనిపించె నీలో కళ్యాణ తిలకం వినిపించె నాలో కళ్యాణి రాగం ఏనాటిదో ఈ రాగమూ ఏ జన్మదో ఈ బంధమూ ఏనాటిదో ఈ రాగమూ ఏ జన్మదో ఈ బంధమూ నీవు నన్ను తాకిన చోట పులకరింత పువ్వవుతుంటే మేను మేను సోకిన పాటా వేణు గానమైపోతుంటే నీవు నన్ను తాకిన చోట పులకరింత పువ్వవుతుంటే మేను మేను సోకిన పాటా వేణు గానమైపోతుంటే మనసులో మధుర వయసులో యమున కలిసి జంటగా సాగనీ మన యవ్వనాల నవ నందనాల మధు మాస మధువులే పొంగనీ ముద్దు ముద్దులడిగిన వేళా నెమలి ఆట ఆడనీ ముద్దు ముద్దులడిగిన వేళా నెమలి ఆట ఆడనీ ఇదే రాసలీలా ఇదే రాగ డోలా ఇదే రాసలీలా ఇదే రాగ డోలా నా జీవన బృందావని లో ఆమని ఉదయంలో నిన్ను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో నా జీవన బృందావని లో ఆమని ఉదయంలో నిన్ను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో నా ప్రాణమంతా నీ వేణువాయే పులకింతలన్నీ నీ పూజ లాయే ఏ యోగమో ఈ రాగమూ ఏ జన్మదో ఈ బంధమూ ఏ యోగమో ఈ రాగమూ ఏ జన్మదో ఈ బంధమూ ఇంద్రధనసు పల్లకీలో చంద్రుడల్లె నువ్వొస్తుంటే నల్ల మబ్బు కాళ్ళు కడిగీ మెరుపు కొంగు ముడిపెడుతుంటే ఇంద్రధనసు పల్లకీలో చంద్రుడల్లె నువ్వొస్తుంటే నల్ల మబ్బు కాళ్ళు కడిగీ మెరుపు కొంగు ముడిపెడుతుంటే రాగలహరి అనురాగ నగరి రస రాజధాని నను చేరనీ శృంగార రాజ్య సౌందర్య రాణి పద రేణువై చెలరేగనీ నింగి నేల కలిసిన చోటా నిన్ను నేను పొందనీ నింగి నేల కలిసిన చోటా నిన్ను నేను పొందనీ అదే రాసలీలా అదే రాగ డోలా అదే రాసలీలా అదే రాగ డోలా
బుర్రిపాలెం బుల్లివాణ్ణి నేనే పాట సాహిత్యం
చిత్రం: బుర్రిపాలెం బుల్లోడు (1979) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: పి.శుశీల, యస్.పి.బాలు బుర్రిపాలెం బుల్లివాణ్ణి నేనే బుట్ట మల్లెపూలు పెడతా కంచి పట్టు చీర పెడతా అందాలతో బంధాలతో అల్లారు ముద్దిచ్చి తెల్లారనీవే.. చల్లపల్లి పిల్లదాన్ని నేనే ముంత మజ్జిగిచ్చుకుంటా గోరు ముద్దలిచ్చుకుంటా అందాలతో, బంధాలతో అల్లారు ముద్దిచ్చి తెల్లారిపోతా.... పొద్దు పొటారగానే సద్దు చల్లారగానే లేత చీకట్లలోనా నీతోనే కలిసిపోతా నా కోకగాలి తగిలి నీ కాక రగులుతుంటే గారెల్లో బెల్లమేసి గారంగ నీకు పెడతా - బుర్రోడా, ఓ బుల్లోడా, బుల్లోవా, ఓ బుల్లోడా నీ షోకుతో నాజూకుగా - కన్నుల్తో మాట్లాడి కవ్వించి పోవే మల్లెల్లో దూట కలిపి ఎన్నెల్లో మనసు కలిపి పరువాల పాన్పుమీద దిండల్లే వుండిపోత... ఎర్రై ఎంటబడితే ఎన్నెమ్మ దుమ్ము దులిపి దూరంగ పక్కవేసి దుప్పట్లే కప్పిపోతా - బుల్లోడా, ఓ బుల్లోడా వయ్యారమే వుయ్యాలగా– ఊగించి ఊహల్లో తేలించి పోవే....
చల్ హై దీని సోకుమాడ పాట సాహిత్యం
చిత్రం: బుర్రిపాలెం బుల్లోడు (1979) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: పి.శుశీల, యస్.పి.బాలు చల్ హై దీని సోకుమాడ చిన్నది కాదమ్మో బల్ చిచ్చర పిడగమ్మో యిది వేడి మీదున్నా నా వెన్నెల మడుగమ్మో- చల్ హై వీడి జోరుగాల పిల్లడు కాడమ్మో బత బిత్తర గాడమ్మో . యిటు వెన్నరాస్తునే అటు సున్నం కొడతాడు తప్పుడు వయసు ఎప్పుడేమి చేస్తుందో చెప్పదు మనసు ఎవరికేమి యిస్తుందో దానిపై దానికే అలక… ఎంత తీరినా కోరికే తీరదు. దంచమాకు లెక్చర్లు మనసు మీద దించమాకు పిక్చర్లు వయసు మీద బోడి బోడి పాఠాలు బోలెడన్ని విన్నాను. పోవోయి పిచ్చి పుల్లాయ్ చిక్కిన నడుము బక్క చిక్కి బాగుంది చేతికి చిక్కి చెడుగుడేదో ఆడింది చిక్కనీ దక్కని చిలక -- రావే చక్కని చెక్కర తునక కొయ్యమాకు లేత లేత సొరకాయలు తింటావు తీపి తీపి మొట్టికాయలు సూటిపోటి మాటల్ని చుక్కదాటి పోనీకు పోవోయి నీకు జిల్లాయ్
లంగరు చిన లింగయ్య పాట సాహిత్యం
చిత్రం: బుర్రిపాలెం బుల్లోడు (1979) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: పి.శుశీల, యస్.పి.బాలు అబ్బాయా ఎవర్రా అది.... ? లంగరు చిన లింగయ్య కూతుర్ని అబ్బయ్యా.. కోటిలింగాల రేవుకాడ జాతర్ని అబ్బయ్యా- కన్నేస్తే సొగసుంది కాటేస్తే వయసుంది.. కాటేసే చొరవుంటే చోటుందిర మాటుంది రా....రా.. రా అమ్మయా... ఏవూరుమంది? కత్తుల పెదరత్తయ్య మనవణ్ణి అమ్మాయా..... నీ ఎత్తుకు చిత్తయి పోని చిన్నోణ్ణి అమ్మాయా కరుకైన కన్నుంది చురుకైన చూపుంది సై అంటే సరుకుంటే సాటున్నది మాటున్నది... లంగరు ..... మసిలీపట్నాముకాడా, మంగినపూడికాడ ఇసగుంటది గస, గస ముంటది కొల్లేటి సెరువుకాడ కొంగాల మడుగుకాడ బురదుంటది బుస బుసమంటది ఆడెందుకు అబ్బాయా - యీడెందుకు అబ్బాయా.... ఆడెందుకు యీడెందుకు, ఆడేందుక పాడేందుకు గూడంటి గువ్వపిట్ట నీకుండగ- పండంటి పాలపిట్ట నా పండగ రాచ నిమ్మలమీన రామచిలకంటి చిన్నదానా-పసచూడన మిస మిస చూడనా ఉసిరీ కొమ్మలమీన బుల్లి ఉడతంటి పిల్లగాడా గిలిచూడనా గిల్లీగిల్లీ చూడనా కొమ్మెందుకు అమ్మాయా, రెమ్మెందుకు అమ్మాయా? కొమ్మెందుకు రెమ్మెందుకు కోరెందుకు తీరెందుకు మేడంటి కుర్రవాణ్ణి తోడుండగా_ పాటంటి పడుచుదాన్ని యీడుండగ లైలైలై
మాయదారి సచ్చినోళ్ళూ పాట సాహిత్యం
చిత్రం: బుర్రిపాలెం బుల్లోడు (1979) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, మాదవపెద్ది రమేష్ మాయదారి సచ్చినోళ్ళూ మా ఎంట పడతారు మా దగ్గరే ముందో మీది మీది కొస్తారు. అవునంటే అల్లరి కాదంటే చిల్లరీ, కిందనుంచి పైదాకా గుచ్చి గుచ్చి చూస్తారు ॥ మాయదారి॥ అక్కాయంటే ఆళ్ళకి కోపం. బావయ్యంటే యీళ్ళకి కోపం- అక్కలూ లేక బావలూ లేక - ఏమై పోవాలి.....? మేమేమై పోవాలి మా హక్కుల కోసం మాలో ఒకరు మంతిరి కావాలి ॥ మాయదారి ॥ మా రోజులు మారాలి - ఎందరెందరో మహానుభావులు వెలసిన చరిత్ర మాదండీ... జగడంలో జగమొండి శిఖండి భీష్ముడి అంతం చూసిందండీ .... అన్న బృహన్నల కథలేకుంటే నర్తనశాలకు విలువేదండీ .... అర్ధనారులం మేము వ్యర్థ పురుషులం కాము సత్వరమే మా రక్షణ కోసం కమీషన్ వెయ్యాలి- మా సమస్య తీరాలి ॥ మాయదారి ॥