Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Cheekati Velugulu (1975)




చిత్రం: చీకటి వెలుగులు  (1975)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆత్రేయ, సి.నారాయణ రెడ్డి, ఆరుద్ర, కొసరాజు, ప్రయాగ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, వాణిజయరాం, సావిత్రి
నటీనటులు: కృష్ణ , వాణిశ్రీ , పద్మప్రియ
మాటలు: ముళ్లపూడి వెంకటరమణ
కథ, దర్శకత్వం: కె.యస్.ప్రకాష్ రావు
నిర్మాత: కానూరి రంజిత్ కుమార్
ఫోటోగ్రఫీ: వి.యస్.ఆర్.స్వామి
ఎడిటర్: పర్వతనేని శ్రీహరిరావు
బ్యానర్: రంజిత్ మూవీస్
విడుదల తేది: 11.07.1975



Songs List:



సెలవు మీద రావయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: చీకటి వెలుగులు (1975)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల 

పల్లవి:
సెలవు మీద రావయ్యా సిపాయి బావా
జలసాగ తిరుగుద్దాము సిపాయి బావా
దేశం కోసం నువ్వున్నావు..
దేశం కోసం నువ్వున్నావు.. నీ కోసం నేనున్నా
బావా.. బావా..

సెలవు మీద రావయ్యా సిపాయి బావా
జలసాగ తిరుగుద్దాము సిపాయి బావా

చరణం: 1
కోర మీసం తిప్పుకుంటూ నువ్వొస్తావూ..
కొప్పు నిండా పూలెట్టుకొని నేనుంటానూ
కోర మీసం తిప్పుకుంటూ నువ్వొస్తావూ..
కొప్పు నిండా పూలెట్టుకొని నేనుంటానూ
చెయ్యి చెయ్యి కలుపుకొని.. చెట్టాపట్టాలేసుకొని..
సీతాకోక చిలుకల్లాగా ఎగిరిపోద్దాము...

సెలవు మీద రావయ్యా సిపాయి బావా
జలసాగ తిరుగుద్దాము సిపాయి బావా

దేశం కోసం నువ్వున్నావు..
దేశం కోసం నువ్వున్నావు.. నీ కోసం నేనున్నా
బావా.. బావా..

చరణం: 2
ముద్దుముద్దు సరసానికి పోట్లాడుకుంద్దాము...
మురిపాల గుసగుసల మాట్లాడుకుంద్దాము
ముద్దుముద్దు సరసానికి పోట్లాడుకుంద్దాము...
మురిపాల గుసగుసల మాట్లాడుకుంద్దాము
మాపటేల ఏట్లోనా.. హా.. మాపటేల ఏట్లోనా
మసకమసక చీకట్లో..
మల్లెపూల తెప్ప మీద మనసు తీర్చుకుంద్దాము
బావా.. బావా..

సెలవు మీద రావయ్యా సిపాయి బావా
జలసాగ తిరుగుద్దాము సిపాయి బావా
దేశం కోసం నువ్వున్నావు..
దేశం కోసం నువ్వున్నావు.. నీ కోసం నేనున్నా
బావా.. బావా..

సెలవు మీద రావయ్యా సిపాయి బావా
జలసాగ తిరుగుద్దాము సిపాయి బావా




ఊరు పేరు లేని వాణ్ణి పాట సాహిత్యం

 
చిత్రం: చీకటి వెలుగులు (1975)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పల్లవి :
ఊరు పేరు లేని వాణ్ణి ప్రేమించానమ్మా తక్ధీం
ఓనామాలు దగ్గరుండి నేర్పించాలమ్మాతక ధిం
ఊరు పేరు లేని వాణ్ణి ప్రేమించానమ్మా తక్ధీం
ఓనామాలు దగ్గరుండి నేర్పించాలమ్మా
ఓనా మహః ఓనా మహః

శివా యహః అబ్బా శివా యహః
నేర్చుకో కళ్ళతో దాచుకో గుండెలో
చూడనీ కళ్ళలో చేరనీ గుండెలో
ఊరు పేరు లేని వాణ్ణి ప్రేమించానమ్మా..
ఓనామాలు దగ్గరుండి నేర్పించాలమ్మా..

చరణం: 1
మంచు కప్పిన కొండ పైనా
మనసు తెలిసిన మనిషి తోటి కలిసీ ఉంటే
ఏ..ఏ..ఏ..ఉన్నదేమిటి..?
ఊ..చలీ...ఆ..
లేనిదేమిటి...?
ఊ...గిలీ...
వుండి కూడా  లేనిదేమిటి..?
వుండి కూడా  లేనిదేమిటి..?
ఆ..ఆ.. కౌగిలీ

ఊరు పేరు లేని వాణ్ణి ప్రేమించానమ్మా
ఓనామాలు దగ్గరుండి నేర్పించాలమ్మా

చరణం: 2
ఉరకలెత్తే పడుచుపిల్లను
ఒడుపు తెలిసిచేయి వేసి
పట్టుకుంటే... ఏ..ఏ..ఏ...ఏ..ఏ
ఉన్నదేమిటి...?
ఏయ్...పొగరు...
హ..హ..హ.. లేనిదేమిటి..?
ఆ.. బెదురూ..
ఉండి కూడా లేనిదేమిటి...?
ఉండి కూడా లేనిదేమిటి...?
ఆ..ఆ..ఆ కుదురూ...

ఊరు పేరు లేని వాణ్ణి ప్రేమించానమ్మా
ఓనామాలు దగ్గరుండి నేర్పించాలమ్మా

చరణం: 3
బెదురులేని కుర్రదప్పుడు..చిగరు పెదవుల
అదురుపాటును ఆపమంటే ఏ..ఏ..ఏ..ఏ
ఆగమన్నది..?
హద్దు...
ఆగనన్నదీ...?
ఊ..ఊ.. పొద్దు...
ఆగమన్నా ఆగనన్నది
ఆగమన్నా ఆగనన్నది
ఆ..ఆ హా...ముద్దూ..ఊ..ఊ..ఊ
ఊరు పేరు లేని వాణ్ణి ప్రేమించానమ్మా తక్ధీం
ఓనామాలు దగ్గరుండి నేర్పించాలమ్మా తక ధిం

నేర్చుకో కళ్ళతో దాచుకో గుండెలో
చూడనీ కళ్ళలో చేరనీ గుండెలో



తీయని తేనెలా మరిపించరా పాట సాహిత్యం

 
చిత్రం: చీకటి వెలుగులు  (1975)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ప్రయాగ 
గానం: సావిత్రి 

తీయని తేనెల మరపించెరా
మాయని మమతల మరపించెరా
చాలు చాలు గోపాల
ఏల రాధ నిటు మరచితివేల
ఏల రాధ నిటు మరచితివేల




చీకటి వెలుగుల కౌగిటిలో పాట సాహిత్యం

 
చిత్రం: చీకటి వెలుగులు (1975)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: దేవులపల్లి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పల్లవి:
చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలూ
చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలూ
ఏకమైనా హృదయాలలో ఓ ఓ ఏకమైనా హృదయాలలో
పాకే బంగరు రంగులు..

ఈ మెడ చుట్టూ గులాబీలూ..ఈ సిగపాయల మందారాలూ
ఈ మెడ చుట్టూ గులాబీలూ..ఈ సిగపాయల మందారాలూ
ఎక్కడివీ రాగాలూ ..చిక్కని ఈ అరుణ రాగాలూ
అంది అందని సత్యాల ..సుందర మధుర స్వప్నాలా..

చరణం: 1
తేట నీటి ఈ ఏటి ఒడ్డునా
నాటిన పువ్వుల తోటా
నిండు కడవల నీరు పోసీ
గుండెల వలపులు కుమ్మరించీ
ప్రతి తీగకు చేయూతనిచ్చీ
ప్రతి మాను పులకింప చేసీ

మనమే పెంచినదీ తోటా
మరి ఎన్నడు వాడనిదీ తోటా
మనమే పెంచినదీ తోటా
మరి ఎన్నడు వాడనిదీ తోటా

మరచి పోకుమా తోటమాలీ
పొరపడి అయినా మతిమాలీ
మరచి పోకుమా తోటమాలీ
పొరపడి అయినా మతిమాలీ

చరణం: 2
ఆరు ఋతువులు ఆమని వేళలే మన తోటలో
అన్ని రాత్రులు పున్నమి రాత్రులే మన మనసులో
మల్లెలతో వసంతం ..చేమంతులతో హేమంతం
మల్లెలతో వసంతం ..చేమంతులతో హేమంతం

వెన్నెల పారిజాతాలు వానకారు సంపెంగలూ
వెన్నెల పారిజాతాలు వానకారు సంపెంగలూ
అన్ని మనకు చుట్టాలేలే..వచ్చే పోయే అతిధులే
అన్ని మనకు చుట్టాలేలే..వచ్చే పోయే అతిధులే

ఈ మెడ చుట్టూ గులాబీలు..ఈ సిగపాయల మందారాలూ
ఎక్కడివీ రాగాలూ చిక్కని ఈ అరుణ రాగాలూ
ఎక్కడివీ రాగాలూ చిక్కని ఈ అరుణ రాగాలూ

చరణం: 3
గల గల మన కూడదూ..ఆకులలో గాలీ
జల జల మనరాదూ ..అలలతో కొండవాగూ
నిదరోయే కొలను నీరూ.. నిదరోయే కొలను నీరూ
కదపకూడదూ ఊ ఊ
ఒదిగుండే పూలతీగా..ఊపరాదూ

కొమ్మపైనిట జంట పూలూ
గూటిలో ఇక రెండు గువ్వలూ

ఈ మెడ చుట్టూ గులాబీలూ
ఈ సిగపాయల మందారాలూ
ఎక్కడివీ రాగాలు..
చిక్కని ఈ అరుణ రాగాలూ
మరచిపోకుమా తోటమాలీ
పొరపడి అయినా మతిమాలి




హరి హరి నారాయణ పాట సాహిత్యం

 
చిత్రం: చీకటి వెలుగులు  (1975)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: కొసరాజు 
గానం: యస్.పి.బాలు,  వాణీజయరాం

పల్లవి:
హరి హరి నారాయణ చూడరా నాయనా
హరి హరి నారాయణ చూడరా నాయనా
సీతా జుబులి సిల్వర్ జూబ్లీ
సీతా జుబులి సిల్వర్ జూబ్లీ మోతగా ఉందిరా
హరి హరి నారాయణ చూడరా నాయనా

చరణం: 1
బోరు కొడితే బీరు పార్టీ విసుగు పుడితే విస్కీ పార్టీ
బోరు కొడితే బీరు పార్టీ విసుగు పుడితే విస్కీ పార్టీ
చక్కని చుక్క పక్కనలేంది రక్తికట్టదు డ్రింక్ పార్టీ

సీతా జుబులి సిల్వర్ జూబ్లీ
సీతా జుబులి సిల్వర్ జూబ్లీ మోతగా ఉందిరా
హరి హరి నారాయణ చూడరా నాయనా

చరణం: 2
గుడ్డలులేని అమ్మయిల చూస్తూ
గుటకలు మింగే ఘనులకు వెల్కమ్
గుడ్డలులేని అమ్మయిల చూస్తూ
గుటకలు మింగే ఘనులకు వెల్కమ్
జమ  జమ లాడే చందమామలకు
జతగా వచ్చే ఫ్రెండ్స్ కు వెల్కమ్
మధువు లేనిది మత్తే రాదు
మగువ లేనిది మజా లేదు
మధువు లేనిది మత్తే రాదు
మగువ లేనిది మజా లేదు

పార్టీలేనిది లేదు ఫ్యాషన్
ఈరోజుల్లో ఇదేని ఫ్యాషన్

సీతా జుబులి సిల్వర్ జూబ్లీ
సీతా జుబులి సిల్వర్ జూబ్లీ మోతగా ఉందిరా
హరి హరి నారాయణ చూడరా నాయనా
సీతా జుబులి సిల్వర్ జూబ్లీ
సీతా జుబులి సిల్వర్ జూబ్లీ మోతగా ఉందిరా
హరి హరి నారాయణ చూడరా నాయనా



హల్లో న్యూసెన్స్ పాట సాహిత్యం

 
చిత్రం: చీకటి వెలుగులు (1975)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

హలో న్యూసెన్స్
సిల్లి నాన్ సెన్స్
ప్లీజ్ లీవ్ మీ
ప్లీజ్ లవ్ మీ
ప్రేమంటే ఏమనుకున్నావ్
నువ్వంటే ప్రేమనుకున్నా
ప్రేమంటే పిల్లాటలా
పిలంటే నగుబాటులా
నీ తోటి చెరలాటలా

అబ్బబ్బ - నీ దొకటే న్యూసెన్సయ్యింది.
ఓయబ్బ - నాన్సెన్సకన్నా న్యూసెన్స్ మెరుగైంది.

సీ - సీ - కళ్లెదుటే వున్నది బ్యూటీ
ఛీ ఛీ ఒళ్లంతా కనిపిస్తూంది నాస్టి 

వాట్ డూయూ మీన్
ఐ మీన్
అందానికి చాటుండాలి అది
అల్లరిచేసే చోటుండాలి
హద్దుమీరితే ముద్దుగ వుండదు
కోతికి నీకూ తేడా వుండదు
యూ యూ యూ
యూ.….వీ …డబ్ల్యు - యక్స్ - వై - జడ్-ప్లీజ్ లీవ్ మీ

నో - నా వెంటబడి రావద్దే తల్లి 
నోటి మాటతోటీ తల వుతానా సిల్లీ 
వాట్ డూ యూ మీన్
ఐ మీన్ - అందిన సళ్ళు పులుపనుకోకు
అందని దానికి పరుగు తీయకు

తల్లీ నేస్తం తలలో నాలుక అన్నీ నేనై వుంటా నీకు
ఐ విల్ కిక్ యూ అవుట్
ఐ విల్ పిక్ యూ అప్





హే...చూశాను పొద్దంతా పాట సాహిత్యం

 
చిత్రం: చీకటి వెలుగులు (1975)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలు, సుశీల 

పల్లవి:
హే...చూశాను పొద్దంతా
చూశాను పొద్దంతా వేచాను రాత్రంతా
లోయలోనా సెలయేటి ధారలోనా
నీ కోసం మామ్మజీ హాజీ మామాజీ
హాజీ మామాజీ

హే...చూశాను పొద్దంతా
చూశాను పొద్దంతా వేచాను రాత్రంతా
కొండపైన చిగురాకు
కోనలోన నీ కోసం ఓ..బేబి..బేబి..
ఓ..బేబి...బేబి...ఓ..బేబి

చరణం: 1
ఒక మబ్బు తునకా నా కురుల వెనకా
ఊగింది చెవిలో ఊదింది

ఏమనీ ఓ బేబి ఏమనీ

నాలాగే కమ్ముకునే నీవాడు ఏడనీ
అడిగింది ఆ మబ్బు తునకా

ఒక పూలరెమ్మా అపరంగి బొమ్మా
అడిగింది తానే అడిగింది

ఏమనీ...మామ్మాజీ ఏమనీ
అహా...ఏమనీ మామ్మాజీ ఏమనీ

నా చిగురు చెంపల్లున్నా నీ చెలియ ఏదనీ
అడిగింది ఆ పూలరెమ్మా
నా చిగురు చెంపల్లున్నా నీ చెలియ ఏదనీ
అడిగింది ఆ పూలరెమ్మా

హే.. చూశాను పొద్దంతా వేచాను రాత్రంతా
లోయలోనా సెలయేటి ధారలోనా
నీ కోసం మామ్మజీ హాజీ మామాజీ
హాజీ మామాజీ

చరణం:  2
ఆ కొండ శిఖరం నీలాల గగనం
అందుకొందీ నాతో అంటొందీ
ఆ కొండ శిఖరం నీలాల గగనం
అందుకొందీ..నాతో అంటొందీ

హా...ఏమనీ మమ్మాజీ ఏమనీ
ఏమనీ...  ఓ బేబీ ఏమనీ

తన లాగే మన వలపే ఎదిగెదిగీ పోవాలనీ
అంటుందీ ఆ కొండ శిఖరం

హే... చూశాను పొద్దంతా వేచాను రాత్రంతా
కొండపైన చిగురాకు
కోనలోన నీ కోసం ఓ..బేబి..బేబి..
ఓ..బేబి...బేబి...ఓ..బేబి





మీటి చూడు నీ హృదయాన్ని పాట సాహిత్యం

 
చిత్రం: చీకటి వెలుగులు (1975)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి.సుశీల 

పల్లవి:
మీటి చూడు నీ హృదయాన్ని పలుకుతుంది ఒక రాగం
మీటి చూడు నీ హృదయాన్ని  పలుకుతుంది ఒక రాగం
తరచి చూడు నీ గతాన్ని మెదులుతుంది ఒక రూపం
ఆ రూపం ఎవ్వరిదో ఆ రాగం ఎక్కడిదో
తెలుసుకుంటే చాలును నీ కలత తీరిపోవును

చరణం: 1
పూడిపోయిన గొంతులా ఓడిపోయిన గుండెలా
పూడిపోయిన గొంతులా ఓడిపోయిన గుండెలా
నీలో ఊపిరాడక ఉన్నదీ
హృదయమే అర్పించుకున్నదీ హృదయమే అర్పించుకున్నదీ

ఆ రూపం ఎవ్వరిదో ఆ రాగం ఎక్కడిదో
తెలుసుకుంటే చాలును నీ కలత తీరిపోవును

చరణం: 2
పువ్వులోని పిందెలా పిందెలోని తీపిలా
పువ్వులోని పిందెలా పిందెలోని తీపిలా
నీలో ..లీనమైనది కానరానిదీ
నీ పదము తానై మూగపోయినదీ మూగపోయినదీ 

ఆ రూపం ఎవ్వరిదో ఆ రాగం ఎక్కడిదో 
తెలుసుకుంటే చాలును నీ కలత తీరిపోవును

చరణం: 3
మనసు మూలలు వెతికి చూడూ మరుగు పొరలను తీసి చూడూ
మనసు మూలలు వెతికి చూడూ మరుగు పొరలను తీసి చూడూ
ఏదో ...మబ్బుమూసి మసక కమ్మి
మమత మాయక ఉన్నది నీ మనిషి తాననుకున్నదీ 

మీటి చూడు నీ హృదయాన్ని పలుకుతుంది ఒక రాగం
తరచిచూడు నీ గతాన్ని మెదులుతుంది ఒక రూపం
ఆ రూపం ఎవ్వరిదో  ఆ రాగం ఎక్కడిదో 
తెలుసుకుంటే చాలును నీ కలత తీరిపోవును

Most Recent

Default